కవిత్వం

స్వేచ్ఛ

జూన్ 2016

కాశం కావాలని తను ఎగిరిపోయాక
నేను, తను విడిచిన కొమ్మ
రాత్రులను చేరదీసి వెలిగిస్తున్నాం

లోపలి నుండి ఒక నీటి వాగు
లేపనమై తోటంతా ప్రవహిస్తూ ఉంటే

హృదయాలను ముడి వేస్తూ తీగలు
చల్ల గాలికి ఊసులాడుతూ ఆకులు
ఖాళీ పాత్రలో ఏదో నింపుకుంటూ నేను

ఉదయిస్తూ అస్తమిస్తూ
మేఘాలను నక్షత్రాలను కలుపుకుని
సువిశాలంగా పరచబడే క్రమంలో

కొన్ని వసంతాలు గడిచిపోయాయి

***

ఎగిరేవన్నీ పక్షులు కాలేవని
ఎగరడమే స్వేచ్ఛ కాదని
ఆమెకు ఇంకెలా చెప్పగలను