వేదనతో పగిలి విశ్వవేదికపై
ఒరిగిపోయింది రాత్రి
నారింజరంగు పరదా
మళ్ళీ కొత్తగా రెపరెపలాడింది
సూర్యకాంతి సోకితేనే
కాలిపోయే తెల్లకాగితాలని
ఏ నీడలో దాచి కథ పూర్తి చెయ్యాలో
తెలియలేదతనికి
రంగునీళ్ళని బుడగలుగా గాల్లోకి వదిలి
మిట్టమధ్యాహ్నపు ఆటల్లో నవ్వుకున్నాడు కానీ
ఇంద్రధనుసు పగలకుండా ఆపడం
చేతకాలేదతనికి
అరచేతుల క్రింద ఇసుకను దాచి
ఆటాడీ ఆడించీ గుప్పెట తెరిచాక
వేలి క్రింద ముత్యపు ఉంగరమొక్కటే
మెరుస్తూ కనపడింది
కలలో కనపడ్డ బంగారు చెట్టుకు
ఊయలకట్టి ఊగుతూ నిద్రించిన సంగతి
ఎవ్వరికీ చెప్పకుండానే
వేరు ఎండిపోయింది
నారింజరంగు పరదా
మళ్ళీ రెపరెపలాడింది
ఒకరు ముందుకి – మరొకరు వెనక్కి-
నటనెవరిదైతేనేం- నాటకం సాగుతూనే ఉంది.
Painting: T. Chandrasekhara Reddy
కవితలని పదచిత్రాలంటారే కానీ, అన్ని కవితల్లో అవి కనపడవు. కొన్నయితే వాటి ఆధారంగా ఒక చిత్రాన్ని గీయటానికి అసలు లొంగి రావు. అలాంటివాటిని చదివి అనుభూతించటమే కాని, భావుకుడయిన మరో పాఠకుడికి తనకు తోచిన పద్ధతిలో రేఖలద్వారా ప్రతిస్పందించటానికి వీలు దొరకదు.
మీ కవిత ఈ అభిప్రాయానికి మినహాయింపు. మీ అక్షరస్వరాలు ఇచ్చిన స్ఫూర్తి తో నేను గీసిన వర్ణచిత్రం ఇక్కడ అతికిద్దామంటే కుదర్లేదు. మీకు అభ్యంతరం లేకపోతే, మీ ఈ మెయిల్ ఐడి ఇస్తే, దాన్ని నేరుగా మీకు పంపిస్తాను.
టి. చంద్రశేఖర రెడ్డి
tcsreddy612@జిమెయిల్. కామ్
మనిషి మరణ జననాలని ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు చామర్తి గారు.రాత్రి ఒరిగిపోయింది అనడంలో ఒకరు ముందుకి ఒకరు వెనక్కీ అని అనడంలో జగన్నాటాకాన్ని సూచించారు.ప్రతి పాదంలో ఒక నిరుత్తర భావుకతని పదం చిత్రాలతో గీశారు.ఇంద్ర ధనుసు అనే పదం సుపర్బ్ గా వుంది కాని మీరు ఇంద్ర ధనువు గా అని వుంటె ఇంకా బావుండేదని అని అనుకుంటా నేను.ఒక గొప్ప పోయం చదివాను.అభినందనలు మీకు
విశ్వ వేదిక పైని ఆటను బాగా
అక్షరీకరించావు మనస.బాగుంది కవిత
దృశ్య కవిత లో పదం పదం రంగులద్దుతూ భావ మానసం అలరించింది.
రెండు మూడు సార్లైనా చదవనిదే వూరుకోదు కదా నీ కవిత
పై కవితకి నేను గీసిన పై బొమ్మతో పాటు, చేసిన ఆంగ్లానువాదం ఈ దిగువన-
టి. చంద్రశేఖర రెడ్డి
The Play
Creviced with agony
Night reclines on altar of universe
Orange coloured screen
Chose to crackle once again afresh
No clue about the shade
In which to hide white papers
Inflammable at the touch of Sun-Light;
The story remains unfinished
Born of coloured water- bubbles pop up
A laughter amidst mid-afternoon games
He how-ever fail to stop
Rainbow getting shattered in to pieces
Palms covering the sand-
The play end with fist opened
A shining ring with pearl appears
Beneath a finger feeling its presence
Hammock on a Golden tree
Swing in a dream-
Unrevealing about her sleep;
The root dries up
Orange screen flutters again,
One forward, another backward
To whom-so-ever the acting may belong;
The drama continues to prolong
-o)) O ((o-