కవిత్వం

It’s Time

అక్టోబర్ 2016

సంధ్య ఆకాశాన్ని చీల్చుకుపోయింది.
గాలి సముద్రాన్ని పిలుచుకు వచ్చింది.

ఎండి రాలిన ఆకుల్లో ఎన్నడూ లేని గలగల.
ఎరుపెక్కిన గగనంలో ఎప్పుడూ లేని మిలమిల.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

జ్ఞాపకాలు వెలిసిపోయిన, నీడలింకా కదలాడుతున్నాయ్.
జాడలింకా చెరిగిపోకున్నా, అడుగులన్నీ తప్పిపోతున్నయ్.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

పనులన్నీ పూర్తి చేసాను. పుస్తకం మూసివేసాను.
నీకేదన్న రాద్దామని పదాలకోసం వెతుక్కున్నాను.
ఖాలీ కాగితం చించుకున్నాను.
పొద్దున లేసి చదువుకుంటావని బల్ల మీద దాన్ని ఉంచిపోయాను.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

ఏ దారిలోనూ మనం ఎదురుపడవద్దని,
ఏ సరిహద్దులో కంచె కావొద్దని,
చీకటిలో నీ పాట వినవద్దని మనస్పూర్తిగా కోరుకున్నాను.
నిశ్చయంగా నీకు దూరమయ్యాను.

హృదయం ఉన్నదో వొలికిపోయిందో..
నీ పిలుపుకై సమయం మించిపోయింది.
బహుశా ఇది వీడ్కోలు సమయం.

మూలం: It’s Time… -మంజీర
తెలుగు: నందకిషోర్


It’s Time…

It’s time to bid adieu
The sun has set in, the summer breeze just started
The leaves are dry and rustle on the ground
The memories faded yet the shades remain
I finish my work and close the book
Lost my pen to write a few words
As a note to you
For you to see the next morning
On your table
When I am gone!

We won’t cross each other
On the road in the corridors
In the dark I won’t hear your voice
Once in a way to drop few lines
Don’t know whether I have the heart
Can’t race with the clock
In waiting for your words!