నుడి-11 ఫలితాలు, జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈ సారి ‘నుడి’ని ఆల్ కరెక్టుగా పూరించి విజేతలుగా నిలిచినవారు పదకొండుగురు. వారు:
1. రవిచంద్ర ఇనగంటి,
2. వి. దీప్తి,
3. కామేశ్వర రావు,
4. మాడిశెట్టి రామారావు,
5. జి. వి. శ్రీనివాసులు,
6. పి. వి. ఎస్. కార్తీక్ చంద్ర,
7. నేత్ర చైతన్య,
8. పి. సి. రాములు,
9. రవిచంద్ర పి.,
10.దేవరకొండ,
11.కె. రామేశ్వర్.
విజేతలకు అభినందనలు.
కొన్ని ఆధారాలకు జవాబులు వివరణలు కింద యిస్తున్నాను.
20. అడ్డం: అవతలకు అచ్చు తీసి అడ్డదిడ్డంగా స్మరించకు (4). దీనికి సమాధానం తలవకు.
వివరణ: అచ్చు = అ (హల్లు కానిది). అవతలకు లోంచి ‘అ’ను మైనస్ చేసి జంబుల్ చెయ్యాలి.
21. అడ్డం: కొమ్ము లేని గుర్రం అల (3). దీనికి జవాబు తరంగం.
వివరణ: గుర్రం = తురంగం. అల = తరంగం
22. అడ్డం: పువ్వులు లోయలో ఉండాలి సుమా (4). దీనికి జవాబు కుసుమాలు.
వివరణ: లోయ = కులు. ‘కులు’లో ‘సుమా’ ఉంటే వచ్చేది కుసుమాలు!
4. నిలువు: నా గోడ ఉత్తరానికి ఎగబాకిన కత్తి మీద నాభి (1, 3). దీనికి జవాబు నా భిత్తిక.
వివరణ: ఉత్తరానికి అంటే పైకి. కత్తి పైకి పాకితే వచ్చేది త్తిక. దీని పైన నాభి ఉంటే వచ్చేది నా భిత్తిక = నా గోడ
11. నిలువు: ఈమె కోసం వెనకటి బేసి స్థానాలు ఖాళీ కావాలి (2). దీనికి సమాధానం నటి.
వివరణ: ‘వెనకటి’లో బేసి స్థానాలు అంటే 1, 3 వ స్థానాలు. ఆ స్థానాల్లో వున్న వె, క లను తొలగిస్తే వచ్చేది నటి.
17. నిలువు: పెద్ద నిద్ర కానిది (2, 3). దీనికి జవాబు చిన్న కునుకు లేక చిరు కునుకు. రెండూ కరెక్టే.
18. నిలువు: మా కోతి కొంత ఏలుబడితో కలగా పులగమైంది కనుక, వేడుకో (5)
వివరణ: ఏలుబడిలోని ‘లుబ’ను ‘మా కోతి’తో కలగాపులం చేస్తే వచ్చే ‘బతిమాలుకో’ సమాధానం.
23. నిలువు: చిన్న పాక సరిగ్గా పూసెడి గురి (2, 3). దీనికి సమాధానం పూరి గుడిసె.
వివరణ: ఇక్కడ ‘పూసెడి గురి’ anagram.
34. నిలువు: కొందరి తల నరికితే వచ్చేది దీనికి సమానార్థకమవుతుంది (2)
వివరణ: ‘కొం’దరిలో తలను (మొదటి అక్షరాన్ని) తీసేస్తే దరి వస్తుంది. దరికి సమానమైన తటి దీనికి జవాబు.
**** (*) ****
16 అడ్డం రెండు అక్ష్రరాలే ఉన్నాయి… మీరు 3 అక్షరాలని ఇచ్చినారు..దయచేసి పరిశీలించమని మనవి
స్ఖాలిత్యాన్ని గుర్తించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు రామారావు గారూ. సవరించమని ఎడిటర్ గారిని కోరాను.
సవరించాము.