తన కథని మోస్తూ
తిరుగుతాడు
భారంగా
ఊపిరి ఆగిపోయే
వరకు
తన కథకు
తానే
కథానాయకుడు
ప్రతి నాయకుడు
చెబుతూ పోతాడు
అడిగిన వాళ్ళకి
అడగని వాళ్ళకి
తన కథ
తన కాలికి
తానే కట్టుకున్న
బండ రాయి
వివేకం ముల్లె
వస్తుందని
బంగారు కంకణం
ఆశ చూపే
ముసలి పులిలా
తన కథలోకి
లాగుతాడు
తన
అనుభవసారాన్ని
గ్లాసుల కొద్దీ
తాగిస్తాడు
మనకి కథే
చెబుతాడు
తన వారసుడికి
పరువు ఇరుసున
వంశక్రమంలో
గిరగిర తిరిగే
తన కథాచక్రాన్ని
బతుకంతా మోయమని
నెత్తి మీద పెట్టి
పోతాడు.
వాళ్ళ నాన్నలాగే.
మంచి కవిత వారసత్వాన్ని మోచే విధం చెప్పారు
Good poem