నుడి

నుడి-14 (డిసెంబర్ 2016) & నుడి-13 (నవంబర్ 2016) ఫలితాలు

డిసెంబర్ 2016


నుడి-13 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈ సారి చాలా మంది 9 అడ్డం, 24 అడ్డం, 2 నిలువు, 25 నిలువు, 33 నిలువు దగ్గర తడబడ్డారు.
ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచినవారు ముగ్గురు. వారు
1. కామేశ్వర రావు
2. వి. దీప్తి
3. శుభ

విజేతలకు అభినందనలు.

ఇక జవాబులు, వివరణలను చూద్దాం.

21 అడ్డం: ముక్కు + ఎర = ముక్కెర
24 అడ్డం: తీసుకురాను = తేను
27 అడ్డం: బుద్ధి = ధీ. ‘వ్యతిరేకంగా’ ‘ఉన్నారు’ = లేరు. ఇక్కడ చమత్కారమేమంటే, ధీరులే లోంచి ధీ పోగా రులే మిగులుతుంది. అది వ్యతిరేకంగా (అంటే రివర్సులో) లేరు అవుతుంది. పైగా లేరు అనే సమాధానం ‘ఉన్నారు’కు వ్యతిరేకం (Opposite)!
33 అడ్డం: ‘ని’ను ‘ముం’చేస్తే నిదర ముందరగా మారుతుంది!
2 నిలువు: పంచ = వసారా, పంచాళి = వదరుబోతు
3 నిలువు: ‘సగా’నికి సగం = సగా. సగతంగా మైనస్ సగా = గతం = భూతం!
4 నిలువు: ‘అకా’రణంగా కొంత = అకా. సగం ‘మెరి’సిన = మెరి
15 నిలువు: దుప్పట్లు = రగ్గులు. ఖరీదు చెయ్ = కొను
17 నిలువు: ఒక అమ్మాయి = దీప అనే పేరు గల బాలిక!
25 నిలువు: భర్త = పతి. భర్తే = పతే. తేప = సారి

ఇంకా ఏవైనా ఆధారాలకు నేను పేర్కొన్న జవాబులు ఎట్లా వచ్చాయో వివరణ కావలిస్తే పాఠకులు అడగవచ్చు.