రాలిన పక్షి ఈక
గాలి తేరు మీద
రెప్పల ముందు
ఎగురుతూ…
మొదలంటిన
నెత్తుటి మరక
తడి ఆరనితనం
దు:ఖ ముఖంగా…
పడమరన దించిన
తెరను లేపుతూ
తూరుపున పూసిన
ఎరుపు రంగులా…
చినిగిన జెండా
అతుకుతూ
పాటనెత్తుకున్న
గొంతు బిగ్గరగా…
నినాదమొక్కటే
నిద్దుర లేపుతూ
పద పదమని
పదం పాడగా…
సమయం
సమన్వయమవుతూ
సముద్రుని ముందు
అలల కోలాహలం…
మొదలంటిన
నెత్తుటి మరక
తడి ఆరనితనం
దు:ఖ ముఖంగా…
పడమరన దించిన
తెరను లేపుతూ
తూరుపున పూసిన
ఎరుపు రంగులా…
చినిగిన జెండా
అతుకుతూ
పాటనెత్తుకున్న
గొంతు బిగ్గరగా…
బాగున్నాయి వర్మా!
Thank you Sir..