కవిత్వం

కవిత్వం కావాలి

15-ఫిబ్రవరి-2013

కవిత్వం రాస్తూనే వున్నాం

కన్నీళ్ళ కవిత్వం కలల కవిత్వం కల్లబొల్లి కవిత్వం
జ్నాపకాల కవిత్వం వ్యాపకాల కవిత్వం
ఆశల కవిత్వం అడియాసల కవిత్వం
అనుభూతుల ఆశయాల కవిత్వం

విత్తనం వున్న కవిత్వం కావాలి
విస్ఫోటనం చెంది వికసించి
పుష్పించి పరిమళించి
ఫలించే కవిత్వం

వెన్నెముక వున్న కవిత్వం కావాలి
నిటారుగా నిలబడి వ్యవస్థను నిలదీసే కవిత్వం
ఆధిపత్యాన్ని ప్రశ్నించే కవిత్వం
రాజ్యాన్ని ధిక్కరించే కవిత్వం

చూపు వున్న కవిత్వం
లోచూపు వున్న కవిత్వం
ముందు చూపున్న కవిత్వం

శిశువు చిరునవ్వు వంటి కవిత్వం
ప్రేమతో వివశమయిన కవిత్వం
కన్నతల్లి మమకారం వంటి కవిత్వం

ద్వేషించవలసిన ప్రతిదీ ద్వేషించే కవిత్వం
కసిత్వం వంటి కవిత్వం
ప్రేమించవలసిన ప్రపంచాన్నంతా
మనకందించే కవిత్వం

బాధకే కాదు సాంత్వనకూ పర్యాయపదమయిన కవిహత్వం
కష్టజీవికిరువైపులా నిలిచేదే కాదు
కష్టజీవి మార్గంలో కరదీపిక అయిన కవిత్వం

అపార మానవానుభవ కాసారంలో
సారమయిన కవిత్వం
అగాథ జీవిత సముద్రాన్ని తరచిన
ముద్ర అయిన కవిత్వం

పోరాటానికి మార్పుకు చిరునామా అయిన కవిత్వం
ప్రజాస్వామ్య భావమైన కవిత్వం
ప్రజాయుద్ధ రావమైన కవిత్వం.9 Responses to కవిత్వం కావాలి

 1. harish
  February 15, 2013 at 4:35 am

  kavitvam leni kavitvam

 2. buchireddy
  February 15, 2013 at 5:37 am

  ధిక్కరించే—ప్రశ్నించే—నీల ధిసే—
  లో చూపు– ముం ధు చూపు— అలాంటి కవిత్వం కావాలీ
  ఎవరు రాయగలరు ???- విప్లవ కవి వ ర వ ర రా వు గారు తప్ప
  చాలా బాగుంధీ
  ———————
  బుచ్చి రెడ్డి గంగుల

 3. prasad
  February 15, 2013 at 9:44 am

  చాలా బాగుంది

 4. nsmurty
  February 15, 2013 at 3:02 pm

  “ద్వేషించవలసిన ప్రతిదీ ద్వేషించే కవిత్వం, కసిత్వం వంటి కవిత్వం…”

  వస్తోంది.

  కానీ, ఇంకా
  “ప్రేమించవలసిన ప్రపంచాన్నంతా మనకందించే కవిత్వం”

  రావలసి ఉంది. విశ్వప్రేమను ఆలోచనల అనుభూతిలోంచి కార్యాచరణలోకి అనువదించగల కవిత్వం రావలసి ఉంది. నిరాడంబరంగా ఉన్న నిగూఢమైన కవిత.

 5. thanooj
  February 16, 2013 at 1:18 pm

  prayojanam asinchi chesi paniki kavithvam avsarama matallo chepthey saripodhu

 6. February 21, 2013 at 7:36 am

  ద్వేషించవలసిన ప్రతిదీ ద్వేషించే కవిత్వం
  కసిత్వం వంటి కవిత్వం
  ప్రేమించవలసిన ప్రపంచాన్నంతా
  మనకందించే కవిత్వం…. విద్య ,కవిత్వము సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని విశ్లేషించి పరిష్కారం చూపెడిగా వుండాలి .వివి గారి లాంటి కొంత మండిదే అల వుంటే సరిపోదు .మొత్తం అలాగే వుండాలి .అదే వివి గారు ఈ పోయము లో చెప్పారు

 7. పూర్ణిమ సిరి
  February 22, 2013 at 8:27 am

  వాహ్వా…ఏం కావాలో కూడా తెలీని స్థితి లో పదాలను అటు ఇటు దొర్లిస్తూ అదే కవిత్వం అనుకునే వారికి,అనేవారికి ఒక ఆలోచన నిచ్చేలా హాయిగా ఉన్న కవిత్వం ..

 8. c.v.suresh
  February 22, 2013 at 4:09 pm

  వెన్నెముక వున్న కవిత్వం కావాలి
  నిటారుగా నిలబడి వ్యవస్థను నిలదీసే కవిత్వం
  ఆధిపత్యాన్ని ప్రశ్నించే కవిత్వం
  రాజ్యాన్ని ధిక్కరించే కవిత్వం…………….వరవరరావు గారికి నమస్సుమా౦జలులు….గ్రేట్ లైన్స్…

 9. m.h.mujahid
  March 17, 2014 at 1:52 am

  విత్తనం వున్న కవిత్వం కావాలి
  విస్ఫోటనం చెంది వికసించి
  పుష్పించి పరిమళించి
  ఫలించే కవిత్వం…. సూపర్ సర్…

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)