రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటా ఒక మంచి మిత్రుడు నోటి వెంట అరుణ పప్పు బ్లాగ్ ” అరుణిమ ” గురించి విన్నాను . బ్లాగులు పరిచయం చేస్తూ ” హలో బ్లాగున్నారా ?” అని రాసేదాన్ని . తనకు తెలిసిన మంచి బ్లాగులు గురించి చెప్పమని అడిగితె మిత్రుడు ఈ బ్లాగ్ గురించి చెప్పేరు. అప్పుడే మొదటి సారి చూసాను . అయితే ఆ అమ్మాయి వేరొక పత్రికలో పనిచేస్తోంది కనుక నే రాసే పత్రికలో ఈమె గూర్చి రాయద్దులెండి అన్నారు నే రాసే పత్రిక వాళ్ళు . ఓహో ఇలా కూడా ఉంటుందా అని అనుకుని ఊరుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి అరుణ వ్యక్తిగతంగా పరిచయమయింది . అప్పుడప్పుడూ ఫోన్లు ఎవరివన్నా నెంబర్లు కావాలంటే మెసేజ్లు తప్ప ఆమె సాహిత్యం పరిచయం లేదు .
ఇన్ని రోజులకి ఇవాళ ఆమె 10 కధల పుస్తకం ” చందనపు బొమ్మ ” చదివాను . రెండు మూడు కథలు తను నాకు మెయిల్ చేసినవే అయినా అన్ని కథలూ ఒకేసారి చదివాను.
ముందుగా చెప్పాల్సిన విషయం ఆమెకి తెలుగు భాష పైన మంచి పట్టు ఉంది. మంచి భాష తో ముందు చదువరులను ఆకట్టుకునే ఐస్కాంతం ఈమె వాక్యాల్లో ఉంది. ఇది ఈమె కథన్గేట్రం కి చాలా సహకరించింది అని చెప్ప వచ్చు. పాత్రికేయ అనుభవాన్ని జీవన అనుభవాన్ని కలిపి రంగరించి ఆమె కథల్లో పాత్రలకు పోసింది అరుణ.
కొన్ని కథలు ఆమె జర్నలిస్ట్ డైరీ నుండి యధా తధంగా ఎత్తిపోతల పథకం లో ఈ పుస్తకం లో చోటు చేసుకున్నాయి . అది కొంచం ఇబ్బంది పెడుతుంది పాఠకుల్ని. అమ్మో రేపు నాగురించి కుడా రాసేస్తుందేమో అనిపిస్తుంది. అబ్బో నా అక్షరాల్లోకి మీరు కథగా రావాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి సుమా అంటుందో ఏమో కానీ ఆమె కథల్లో ఈ నమ్మకం ధైర్యం కాస్త హెచ్చు పాళ్ళలోనే నాకు కనిపించాయి. అన్నిటికన్నా ఒక మంచి పాట కురాలిగా నన్ను ఆకట్టుకున్న కథ ” వర్డ్ క్యాన్సర్ ” . మంచి పటుత్వం తో సాగినదే కాక ఆమెలోని సాహితీ జిజ్ఞాసను ఆవిష్కరించే కథ ఇది .
కథను ఎక్కడ మొదలెట్టాలో ఎక్కువమందికి తెలుస్తుంది కానీ ఎక్కడ ఆపాలో అరుణకి బాగా తెలుసు . ఇది ఈమె కథల్లోని ప్లస్ ప్లస్ పాయింట్. కాసింత సెంటిమెంట్ , ఒక మంచి పరిశీలన , ఒకింత పరిశోధన , కాస్త వ్యంగ్యం , హృదయానుభవం ఈ కథలనిండా ఉన్నాయి. ఉదాహరణకి చందనపు బొమ్మ లో ఆ పాప ఆబొమ్మపై చూపించే ఇష్టం . నా చెయ్యి విరిగితే అలాగే నన్ను పారేస్తావా అమ్మా అని తలితండ్రులని ప్రశ్నించడం కథలోని ఆర్ద్రతను నింపాయి. ఆ మాట విన్న వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి అదాటుగా కావలించుకుని సారీ చెప్పడం కథలోని మంచి అంశం .
చిన్నపాటి కోరికైనా ఊరు దాటలేని నవీన్ రెడ్డి ” భ్రమణ కాంక్ష ” , పుస్తకాలతో బాటే కోల్పోయి కరిగి పోయిన ” సైకత శిల్పం ” ఆచార్య , అతి సున్నిత హృదయుడు శాండిల్య ” ఈ కానుక ఇవ్వలేను “ అంటూ పడే బాధ , ” ఒక బంధం కావాలి ” అంటూనే ఏ బంధమో నిర్ణయించుకోగల దీప వీళ్ళంతా సాధారణంగా బతికేస్తున్న అసాధారణ మనుషులు.
ఈ అమ్మాయిలో తనపై తనకు బాగా నమ్మకమున్న కథలు ” లోపలి ఖాళీలు ” , ఇందాకే చెప్పేను కథ ఎక్కడ ఆపాలో తెలుసును ఈమెకని దానికి నిదర్శనం ఈ కథలోనూ, ” ఎవరికీ తెలియని కథలివిలే ” , ” ఏకాంతం తో చివరిదాకా ” కథల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి . she is no doubt a crafty writer who pens down with confidence, clarity and also a cautious presenter . she is a conscious writer. తెలివిడి కలిగిన కథయిత్రి . ఉద్విగ్నతలను ఎలా మానేజ్ చేసుకుని అక్షరం చెయ్యాలో తెలుసు.
ఐతే ఈ పది కథలే అరుణ కాదు బహుశా ఎంతో మందిలాగా రాయని ఇంకెన్నో కథలామెలో ఉండే ఉంటాయి . అరుణ ఈ తరం లో ఇప్పుడిప్పుడే ఉదయిస్తోంది. కొన్ని చోట్ల రాయాల్సిన విషయాన్ని దాటవేసే ప్రక్రియ అన్నివేళలా మంచిది కాదు . ఒక అనితా నాయర్ , ఓ శశి దేశ్పాండే లాంటి ఆత్మా స్థైర్యం ఇంకా రావాలి. అభివ్యక్తిలో కూడా ఇంకా స్పష్టత రావాలి. ఎలాగూ సంస్కార వశాన భాష ఉంది కనుక ఇంకా ఇతివృత్తా లలో వైవిధ్యం ఉండాలి . ఇది మొదటి సంపుటి కనుక కేవలం ఆరంభమే కనుక ఇంకా ఈమె కలం నుండి మంచి కథలు ఆశించ వచ్చు.
ఐతే ఈ పది కథలే అరుణ కాదు బహుశా ఎంతో మందిలాగా రాయని ఇంకెన్నో కథలామెలో ఉండే ఉంటాయి . అరుణ ఈ తరం లో ఇప్పుడిప్పుడే ఉదయిస్తోంది. కొన్ని చోట్ల రాయాల్సిన విషయాన్ని దాటవేసే ప్రక్రియ అన్నివేళలా మంచిది కాదు . ఒక అనితా నాయర్ , ఓ శశి దేశ్పాండే లాంటి ఆత్మా స్థైర్యం ఇంకా రావాలి. అభివ్యక్తిలో కూడా ఇంకా స్పష్టత రావాలి. ఎలాగూ సంస్కార వశాన భాష ఉంది కనుక ఇంకా ఇతివృత్తా లలో వైవిధ్యం ఉండాలి . ఇది మొదటి సంపుటి కనుక కేవలం ఆరంభమే కనుక ఇంకా ఈమె కలం నుండి మంచి కథలు ఆశించ వచ్చు.
ఇతివృత్తాలు కేవలం వైయుక్తికమే గాక సమాజం వరకూ ఇంకా పయనించాలి అరుణ. జర్నలిస్ట్ గా తన అనుభవాలు కొందరు వ్యక్తుల గురించి రాసేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం . ఇది ఈ గీత ఎక్కడ ఉదయించే బాలుడు పొన్న పూవు ఛాయలో మొదలైన ఈ కథోదయం కుంకుమ వర్ణపు పరిపక్వ అరుణిమను త్వరలోనే దాల్చాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
క్షమించాలి కొంచెం ఆలస్యంగా చదివాను
అరుణకు అభినందనలు
చక్కగా పరిచయం చేసారు జగద్దాత్రి గారు
Nammasthe, Mee Sameeksha Chadivaanu Baagundhi. RAM