ఈ సంచికలో

మే సంచిక

మే 2017

కాలేయం గురించి కవిత్వం రాస్తాడు. కథలతో కీమో థెరఫీ చేస్తాడు. సంకోచాలు లేని పద సంచయం అతనిది. సందేహాలు, మొహమాటాలు లేని సూటిదనం అతని వచనంలో గుచ్చుకుంటుంది. ఎవరికివారు నేనేనేమో అని తరచిచూసుకునేలాంటి పాత్రలు, వాస్తవంలోంచి త్రీడీ చిత్రాలుగా మనముందుకొచ్చే సన్నివేశాలు అతని స్పెషల్ మార్క్. డాక్టర్, రచయిత వంశీధర్ రెడ్డితో ఇంటర్వ్యూ ఈనెల ప్రత్యేకం.

గిరికుమారుని నవయవ్వన ప్రేమగీతాలనుంచి, కిన్నెరసాని పరుగులమీదుగా ప్రవహించి, భ్రష్టయోగి తత్వాన్ని చూపిన విశ్వనాథ గారి అసమాన కవితా ప్రతిభ, నవరసాల మేళవింపుతోసాగే ఆయన కాల్పనిక సృజనలను స్మరిస్తూ ఈ నెల ఎడిటర్స్ పిక్.

క్రైమ్ వెనక కథలు, కథల వెనక కరడుగట్టిన జీవితపు కత్తిపోట్లు, కలగలిసిన ఉత్కంఠ. చీకటి బతుకులు, బతుకు చీకట్లు ముసురుకోవటాన్ని చూపించే “ఫోర్ స్క్వేర్”, వాకిలిలో అనంత్ మొదటి కథ.

పుట్టి పెరిగిన ఊరి పటాన్ని మనముందు పరిచి, నడిచొచ్చిన తొవ్వల్లో మళ్ళీ నడిపించి, చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కపెట్టున మనమీద కుమ్మరించి వెళ్ళే ప్రేమ కథ “నీలా టీచరూ, ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ”, మెహెర్ కలం నుంచి.

మైథిలి గారి Historical fiction ‘సుధా వృష్టి’, రవి బడుగు ‘గరుగు చెప్పిన కథ’, కవితలు, పుస్తక పరిచయాలు యధావిధిగా.