అది యిది అని కాదు
యేదయినా ఫరవా లేదు
కుంచెం అన్నం కావాలి
కప్ప కాళ్లతో చేసిన కూరయినా
యే జంతువు మాంసమయినా
అన్నం తిని యెంచక్కా నిర్భయంగా
పీడకలల్లేకుండా కాసేపు నిద్దరోవాలి
యిప్పడు యీ యిళ్లన్నీ వున్న చోట్లలో
వొకప్పడు యిళ్లు లేవు
చిన్నవీ పెద్దవీ గుడిసెలు కూడా లేవు
పొదలలో కుందేళ్లు బిక్కుబిక్కుమనేవి
చెట్ల మీద కొండచిలవలు జారుతుండేవి
యెండుగడ్డిలో చిరుతలు పొంచి వుండేవి
అప్పుడూ యిదే యావ
కుంచెం అన్నం పచ్చి పచ్చిదే మాంసం
యే జంతువుది అని చూసుకున్నానా
వొక పండు ఎందరో తిని చనిపోతే గాని
ఫలానా తిన గూడదని నియమం లేదు
తినడంలో, తినగా మిగిలిన చర్మాన్ని
చుట్టుకోడంలో, దాని యెముకలను
చేతికి మరో చెయ్యిలా పట్టుకోడంలో
గాలికి రేగి ఆడే జటాజూటంలో
వొక సౌందర్యం, సంగీతం, ధీరం, గంభీరం
లలితం, వీరం, మగతనం, ఆడతనం
అన్నీ ఆ కాసింత స్థలంలోనే ఆ కాసింత
మనస్సుతోనే
వొకటే భయం
యెప్పుడు యే మృగం మీద పడుతుందో
దేనికి అన్నం అవుతామో
కూర్చున్న చెట్టు కొమ్మను
ఏ పిడుగు నిట్ట నిలువుగా చీల్చేస్తుందో
ప్రేమ కన్న యెక్కువగా…. భయంతో
వొకర్నొకరం కావిలించుకుని నిద్దరోయే వాళ్లం
చెట్ల కొమ్మల మీదనో కొండ గుహల్లోనో
యిప్పుడు నాకు అన్నీ వున్నాయి
నా కుటుంబం యిపుడు చాల చాల పెద్దది
అందరం తిన్నా మిగిలిపోయే బువ్వ వుంది
అందరం కట్టుకున్నా చాలే బట్ట వుంది
సరిగ్గా వాడుకోడం లేదు గాని అందరం
తల దాచుకోడానికి తగినన్ని యిళ్లున్నాయి
అయనా భయం
నేను నిజంగా యేమనుకుంటున్నానో
యెవరితో యేమి చెప్పుకోవాలన్నా భయం
అప్పట్లా ఒక బర్రెను పడగొట్టి కోసి
తెలిసిన అందరం తిని యేటి నీరు తాగి
యే డొక్క దొరికితే ఆ డొక్కలో దూరి
వొకరి వెచ్చదనంలో వొకరం నిద్ర పోలేం
యెవర్ని కావిలించుకోవాలన్నా భయం
యెవరితో యేం చెప్పుకోవాలన్నా భయం
యిప్పుడిలా మీతో కూడా…
Painting: Hristo Lalev
iTsE థాట్ ప్రొవొకింగ్ పొయెమ్ ..
అద్భుతమైన కవిత సర్.
అభినందనలు.
-భాస్కర్ కూరపాటి.
ఇంత ఎదిగి అప్పటిలా బర్రెను పడగొట్టి అందరూ కోసి తినాలని, ఏడొక్కాలో బడితే ఆ డొక్కలో దూరి ఒకరి వెచ్చదనంలో ఒకరు నిద్రపోవాలనుకోవడం వెర్రితనం అవుతుందేమో ? ఎవరినో ఎందుకు కౌగిలించుకోవాలి , ఎవరితోనో ఎందుకు చెప్పుకోవాలి. ఇప్పుడిలా మాతో కూడా!
ప్రాణిహింసలో సింహభాగాన్ని ఆక్రమించే, దినదినానికి అతి ఘోరంగా, నాగరికంగా పరిఢవిల్లుతున్న మాంసాహార పెంపక, పచన, భక్షణ ప్రక్రియ; ఔషధాల ఉత్పత్తిలో తోటి ప్రాణులమీద క్రూర పరిశోధనా ప్రక్రియ; తోటి ప్రాణులను హింసించే బుల్ ఫైట్ లాంటి క్రీడావినోదాలు; రవాణా రంగంలో జంతువులపై చూపే క్రూరత్వం; సౌందర్య, అలంకరణ సామగ్రి తయారీ ప్రక్రియ; మనం నిత్యమూ ఉపయోగించే చర్మంతో చేసిన వస్తువుల, బ్రతికివున్న పట్టుపురుగులను మరిగే నీళ్ళల్లో వేసి తీసే కోట్లాది పట్టుచీరల తయారీ ప్రక్రియ; మృగయా వినోదం; మన దైనందిన క్షీర అవసరాలకు పెంచే జంతువుల నివాస, జీవన దుర్భర పరిస్థితి,….. ఈ భంగిన మానవ జీవితంలోని ప్రతి పార్శ్యంలోనూ అనునిత్యమూ ప్రాణులపై జరుగుతున్న సముద్రమంత హింసలో ఆగిపోతున్న అర్బుద అర్బుదాది శ్వాసల స్థితి ఎప్పుడైనా మనం తలచుకున్నామా?
ఈ స్థాయిలో హింస చేస్తేనేగానీ మనుగడలేని, పురోగతి సాధించలేని ఈ మానవ నాగరిక సమాజంలోనే మిగులుదామనా మనం ఇంకా ఇలాంటి చింతనలు చేసేది?
*****************************************************************************
ఓ పదిలక్షల ఏళ్ల పరిణామక్రమంలో తల్లి కోతి నుండి పుట్టాడు మానవుడు లేదా మానవి. మానవ జాతికి మూలం ఆప్రికాలోని ఒకానొక కోతి. పుట్టిన ఆ మానవులకు తల్లి కోతి పొట్టలో పొదువుకుని పళ్లు, ఆకులు తినడం నేర్పింది. అలా నేర్పిన అది ఇంకా శాకాహారిగానే మిగిలిపోయింది. అది మరచి మన మెదడు ఎదిగిన పరిణామక్రమంలో మనం ఎంతో పురోగమించి మాంసం రుచి మరిగి కనిపించిన ప్రతి జంతువుని, ప్రతి కీటకాన్ని, పక్షినీ మంటపై కాల్చి, మసాలాలు వేసి తినే భక్షకులుగా మారాం. కొందరు ఇంకా నరమాంస భక్షకులుగానే కొన్ని అడవుల్లో కేనిబాల్స్ లాగా మిగిలే వున్నారు.
ప్రకృతిలో ప్రతి జీవీ, వృక్షం, రాయి అంతా కూడా మానవ వాంఛలు తీర్చడానికే అన్న మానవ కేంద్ర ధోరణి ప్రబలి చివరకి నడిరోడ్డుపై ఆవుదూడని నరికి చంపే కేరళ ఆటవిక స్థాయికి దిగజారింది. ఈ గోవోన్మాద, బఱ్ఱోన్మాదాలకి కారణం మెదడులో పట్టిన ఆ పురాతన ముఱుగు. తల్లి కోతి నేర్పినదాన్ని మరచిన మానవ నాగరకత. ఆ నాగరకత పెంచుకున్నవారు ఎంతటివారైనా ఒక్కొక్కడి తల పగలగొట్టి చూస్తే ఆ ముఱుగు ఎంతో కొంత మిగిలేవుంటుంది. మన జ్ఞాపకాలని ఇంకా వెనక్కి తీసుకువెళితే ఆటవిక దశలో మనం తిన్న ప్రతి జంతువూ, పక్షీ, కీటకం కూడా గుర్తుకు వచ్చే అవకాశం వుంది. ( అది మన ఇప్పటి పరిణతి చెందిన మానసిక స్థితికి జుగుప్సగా అనిపించినా కూడా)
******************************************************************************
నేను ఈ అవగాహనకి రావడానికి కారణమైన కొన్ని వ్యాసాలు
రాధారాజన్ వ్యాఖ్య ( THE WIRE లోది)
In all these human-centric arguments the author has commodified a living being whose life has intrinsic sanctity too. There is no respect for the life or death of cows, cattle and buffaloes young or old. We are being asked to take it as given that they live and die only and only in our interest. That’s a slippery slope…… – RADHA RAJAN (POLYTICAL ANALYST AND CO – AUTHOR OF “NGOs: Activists and Foreign Funds Anti Nation Industry” by Krishen Kak and Smt Radha Rajan )
ఈ పశువద్ధ చట్టానికి వెనక వున్న జంతు సంక్షేమ ఉద్యమ కారిణి గౌరీ మౌలేఖీ ఇంటర్వ్యూ
The woman behind the new cattle sale law- Animal activist Gauri Maulekhi says the new law won’t curb people’s eating habits.
http://m.rediff.com/news/interview/the-woman-behind-the-new-cattle-sale-law/20170601.htm
‘సాక్షి’ వ్యాసం – పాడిసంతలైన పశువుల సంతలు
http://epaper.sakshi.com/c/19587642
ఈ క్రింది జాలగూడులో పశువధ, పశువులతో వ్యవసాయం ఇత్యాది విషయాలపై ప్రస్తుత నిషేధ వ్యతిరేక ఉద్యమాల నాయకులు, మేధావుల ఆలోచనలకు భిన్నంగా శాస్త్రీయమైన విశ్లేషణతో కొన్ని వ్యాసాలున్నాయి.
Animal Agriculture, Hunger, and How to Feed a Growing Global Population: Part One of Two
https://www.forksoverknives.com/animal-agriculture-hunger-and-how-to-feed-a-growing-global-population-part-one-of-two/
ఇంకా కొన్ని…
Exclusive: Sadhguru Jaggi Vasudev On Anger And Tackling Troll
http://www.ndtv.com/video/shows/reality-check/exclusive-sadhguru-jaggi-vasudev-on-anger-and-tackling-trolls-458882?livevideo-featured
Ernesto Che Guevara’s impressions of India, (including cow, agriculture) recorded after a visit in 1959.
http://www.frontline.in/static/html/fl2708/stories/20100423270805900.హెటం
http://www.firstpost.com/india/ban-on-cattle-sale-for-slaughter-can-we-stop-outraging-and-focus-on-regulating-animal-markets-3503673.html
చాలా బాగుంది సర్! తానిచ్చిన దారిని మరిచి పోయిన మానవున్ని గుర్తు చేశారు. తాను ఇపుడు చాలా నాగరికుడు అని ప్రగాల్బాలు కూడా!
నువ్వు బయలు దేరిన దారిని మరిచి పోతే పోవాల్సిన గమ్యం కనపడదు అనే నానుడుని గుర్తు చేశారు.
కొందరు వుంటారు. పద్యానికి దాని పాఠకుడిని మధ్య సైంధవ పాత్ర నిర్వహిస్తారు. పాఠకుడు వారిని దాటుకుని వెళ్లాలి. వీళ్లు డెమాక్రసీని వుపయోగించుకునే నియంతల అనుచరులు. వీళ్ల టెక్నిక్ చాల సింపుల్. లోకం లోని చెత్తనంతా పోగు చేసి పోస్తారు, పద్యం ముంగిట. యిక ఆ చెత్త అంతా చదువుకోడం మన పని. సైంధవులు… నియంతల అనుచరులుగా… వెళ్లి మరెక్కడో అదే పని చేస్తుంటాడు.
ఇంకా కొందరు వుంటారు. వారికి రూప శిల్పులు. ఆ చెక్కిన రూపం వెనక దాగివుండేది వారి పరిణతి చెందని మనస్తత్త్వం, అవగాహన లేని తాత్త్విక దారిద్ర్యం. వీరి విద్వేష పద్య వ్యూహాన్ని బ్రద్దలు కొట్టి, దాని వెనక దాగిన బఱ్ఱోన్మాదాన్ని బట్టబయలు చేసేందుకు ఎవరైనా వస్తే వ్యాఖ్యలతో ముద్రలు వేసి సైంధవ పోరాటం చేస్తుంటారు. వీళ్ళ టెక్నిక్ ఇంకా చాలా బాహాటం. ఎవరైనా తమలోని ఉద్దేశాన్ని ఏ మాత్రం పసిగట్టినా వారు చెప్పేదంతా చెత్త అని ఒక ముద్ర పడేస్తారు. తార్కికంగా ప్రమాణాలు చూపిస్తూ బఱ్ఱోన్మాదాన్ని ప్రశ్నిస్తే దాన్ని తార్కికంగా ఎదుర్కోవడం చేతగాక ముద్రలు వేసి ముఠాలు కడతారు. వీళ్ళు ఐకమత్యంతో సామూహిక పోరాటాలు చేయలేక ముఠాలు కట్టి ఎదుటివారికి ముఠాలు అంటగడతారు. ఆ సమాచారం అంతా నియంతలు వ్రాసింది, చెత్త అన్న ఈ నీచమైన ఆరోపణలోనే వీళ్ళ భావజాల దివాలాకోరుతనం మనకు తెలుస్తూవుంటుంది.
పైన చెప్పినదంతా నిజంగా చెత్తే అయితే ఈ కవిత ప్రచురించిన సంపాదకవర్గం నా వ్యాఖ్యను అంగీకరించకపోయి వుండవచ్చును. ఆ చెత్తంతా పద్యం ముందు వాళ్ళు అనుమతించారంటేనే మన పద్య స్థాయి, దాని వెనుక వున్న భావజాల స్థాయి ప్రజలకు అర్థం అవుతోంది. అలాగాక మనకు భజంత్రీ వ్యాఖ్యలే కావాలనుకుంటే ’నా కవితలకు వచ్చే వ్యాఖ్యలలో నాకు చెత్త అనిపించనివే ప్రచురించండి‘ అని సంపాదకవర్గానికి సూచించవచ్చును. ప్రపంచంలో భావస్వేచ్ఛని నిలువునా చంపిన నియంతలలో ప్రదానస్థానం ఎవరిదో సోవియట్ యూనియన్, చైనా, కంబోడియా, మంగోలియా, ఉత్తర కొరియా ఇత్యాది అనేకానేక దేశాలను చూస్తే మనకు తెలుస్తుంది. ఆ స్థాయికి మాలాంటి వ్యాఖ్యాతలు ఎదగడం అసాధ్యం.
చాలా బాగుంది సర్, తానొచ్చిన దారిని మరిచిన మానవుణ్ణి గుర్తు చేశారు. ఆ మానవునికి తానూ ఇపుడు గొప్ప నాగరికుడినని ప్రగల్బాలు కూడా! వచ్చిన దారిని మరిచి పొతే చేరాల్సిన గమ్యం ఉండదు. నాకు శ్రీ శ్రీ గారి కవిత ‘ అహింసా వాది’ గుర్తుకొస్తుంది.
వాకిలి సంపాదకులు ఈ నా వాక్యాను ఎందుకు ప్రచురించారో !