కొట్టి, తిట్టి హత్తుకొని ఏడుస్తుంది,
మా ఆవిడ మహా ఖిలాడి..
***
బంధాలన్నీ సమాంతరాలే,
అన్నిట్ని ఖండించే తిర్యగ్రేఖ, మా ఆవిడ..
***
సమాజానికి తానో అబల,..
నాకే, మా ఆవిడ మహాబల..
***
ఒక్కమాట – పది సమాధానాలు,
అందులో స్పెషలిస్ట్,.మా ఆవిడ,.
***
కణకణమంటూ గరిటె చప్పుళ్లు,
వంటిట్లో మా ఆవిడ ఆడధీర,.
***
ఉరుముల మెరుపుల వడగండ్లవానే,
కన్నెర్రచేస్తే, మా ఆవిడ,.
Bhaskar kondreddigaaru పరిస్థితులను తెలిసి మసలు కోవడం ఉత్తమ పురుషుల లక్షణం.
అభినందనలు.
మీకవిత ప్రారంభములో నడిచిన దారినే నడపాల్సింది.ఆమెలోనిప్రేమను ఎంతచక్కగా చెప్పారు.
ఇక్కడ ఈ పోయెమ్ అవసరం లేదేమో ? సీరియస్ గా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకు ఇంట్లంటి హాస్య ప్రధాన కవిత్వం పట్ల అంత మంచి అభిప్రాయం ఉండక పోవడం సహజమే.
brilliant.
రామకృష్ణ గారు, ధన్యవాదాలు,.నిజానికిది సరదాగా రాసాను, ఫన్ డగ కోసం,.ఇక్కడ రావడం నాకు ఆశ్చర్యమే,.
లింగారెడ్డి గారు ధన్యవాదాలు,.నిజమే, సీరియస్ పొయెట్రీ మధ్యన వుండాల్సిది కాదేమో,.
నారాయణ స్వామి గారు, ధన్యవాదాలండి,,..
అమ్మాయితనం,ఆడతనం ………………ఆపై ఎప్పుడూ “అమ్మతనం”….ఇదే ఎప్పుడైనా ఏ ఆలితనమైనా….బాగా చెప్పారు సర్ “ఫన్” గా కూసింత “పిన్” గా మరింత “పెన్” గా….
పద్మ గారు ధన్యవాదాలండి.
భాస్కర్ గారు, గ్రీటింగ్స్ అఫ్ ది డే. Mee dwipadalu so realistic and also andariki anubhavaikamekada.. regards. RP
Rajendra Prasad .మ గారు , ధన్యవాదాలండి,.