నుడి

నుడి – 24 ఫలితాలు, జవాబులు, వివరణలు

నవంబర్ 2017

పాఠకులకు నమస్కారం.

ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ముగ్గురు. వారు:

1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.

2. రవిచంద్ర ఇనగంటి

3. పి. సి. రాములు

ఒక తప్పుతో పూరించినవారు ఒకరు. వారు:

1. శుభ

విజేతలకు అభినందనలు. ఇక కొన్ని ఆధారాలకు జవాబులు, వాటికి వివరణలు చూద్దాం.

 వా  ర్ధ  క్యం  X  కూ  X  ఉ  వి  ద
 స్త  X  X  ప  డు  తూ  X  X  య
 వ  డ  దె  బ్బ  X  కా  లా  పా  నీ
 మై  X  X  ము  ను  లు  X  X  య
 న  మా  జు  X  డి  X  క్షా  మ  ము
 X  న  X  ఆ  కా  రం  X  ల  X
 ట  వ  లు  X  ర  X  ఆ  య  మ
 ట  X  X  ఏ  ము  క  X  X  న
 మా  య  వ  ల  X  రా  మ  దా  సు
 ర  X  X  కి  చ  లు  X  X  లా
 కూ  ల  రు  X  ర్చా  X  వె  ల  గ

1 అడ్డం: దీనికి జవాబు వార్ధక్యం. ఎలా అంటే, సగం = అర్ధ. అందులో సగం = ర్ధ. ‘ర్ధ’ను ‘వాక్యం’లో చేర్చితే వార్ధక్యం వస్తుంది. తొంభై ఏళ్లకు వచ్చేది వార్ధక్యమే కదా!

3 అడ్డం: దీనికి సమాధానం ఉవిద. నావిక కేంద్రం = వి (నావికలోని మధ్య అక్షరం). ఉత్తరాది (ఉత్తర అనే పదంలోని మొదటి అక్షరం) = ఉ. దక్షిణాది = ద (దక్షిణ లోని మొదటి అక్షరం). ఉద ల మధ్య ‘వి’ చేరితే వచ్చే ఉవిద = స్త్రీ.

9 అడ్డం: ఖరీదు చేయటం = కొను(ట). నులుముకొను మైనస్ కొను = నులుము. దీన్ని తారుమారు చేస్తే మునులు వస్తుంది. అదే జవాబు.

19 అడ్డం: ఏ వదనం = ఏ ముకము. అసంపూర్ణం అంటున్నాం కనుక, చివరి అక్షరాన్ని తీసేస్తే ఏముక ఏర్పడుతుంది. ఏకము = ఒకటి, ముఖ్యమైనది. ఏకము తారుమారైతే వచ్చే ఏముక ఇక్కడ జవాబు.

25 అడ్డం: తూర్పునుండి పడమరకు అంటే కుడినుండి ఎడమకు అన్న మాట. ‘ఆస్తిపరులకూ’ను రివర్స్ చేస్తే కూలరుపస్తిఆ వస్తుంది. సగం (చివరి మూడక్షరాలు) నష్టమయ్యాయి కనుక, కూలరు మిగుల్తుంది. అదే జవాబు.

1 నిలువు: శ్లాఘ(న)ము = స్తవము. శ్లాఘమై= స్తవమై. ఇది ‘వాన’లో దూరితే వాస్తవమైన ఏర్పడుతుంది. వాస్తవమైన = నిజమైన కాబట్టి, వాస్తవమైన జవాబు.

5 నిలువు: పబ్బము = పండుగ. పబ్బము = భోజనం. పబ్బము = మహోత్సవం. కనుక, పబ్బము జవాబు.

12 నిలువు: నవ = దురద. మా + నవ = మానవ = మనుషులకు సంబంధించిన. కనుక మానవ అన్నది జవాబు.

14 నిలువు: రుతి, రుతము అంటే శబ్దం. మా శబ్దం = మారుతము. మలయ తర్వాత మారుతము వస్తే ఏర్పడే ది (మలయ మారుతము) కమ్మగాడ్పు / తెమ్మెర. కనుక, మలయ అనేది సమాధానం.

16 నిలువు: దీనికి జవాబు టటమారకూ లేక టరమాటకూ. రెండూ కరెక్టే.

18 నిలువు: ‘గలాసు’ను తిరగేస్తే సులాగ వస్తుంది. దీన్ని ‘మన’ కింది రాస్తే వచ్చే మనసు లాగ = హృదయం వలె. కనుక, మనసు లాగ అనేది జవాబు.

24 నిలువు: కొన = చివర. చర్చలోని చివరి అక్షరం ర్చ. అది సాగితే చర్చా ఏర్పడుతుంది. చర్చా వేదికలో వేదిక ముందు చర్చా ఉంటుంది కదా. అందుకే అదే జవాబు.

**** (*) ****