కాళ్ళకింది భూమి కదిలిపోయే భూకంపం ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా?
నీడలా కొమ్ముకాసే ఆకాశం భళ్ళున ముక్కలై పోయి శరీరాన్ని గాయాల కూడలి చేయడం ఎన్నడైనా అనుభవం లోకి వచ్చిందా? ఒక గుడ్డి నమ్మకంతో పీల్చే ప్రాణ వాయువు మరుక్షణంలో విష పూరితమై నాసికల్ని భగ్గున మండించడం ఏ రోజైనా అనుభవం లోకి వచ్చిందా?
1992వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఒక సంఘటన ఈ దేశం లోని ముస్లింలకు అట్లాంటి గగుర్పొడిచే అనుభవాన్ని మిగిల్చింది. ఈ దేశాన్ని లౌకిక రాజ్యంగా నడుపుకుందామని ఈ దేశ ప్రజలు చేసుకున్న ఒక చారిత్రక ఒడంబడిక ఇచ్చిన విశ్వాసానికి ప్రమాదం సంభవించిన చీకటి రోజు అది. అది ఎంతటి చీకటి రోజుగా పరిణమించిందంటే, స్వాతంత్రానంతర దేశ చరిత్ర మొత్తం ‘ఆ చీకటి రోజుకు ముందు – ఆ చీకటి రోజు తరువాత’ గా మారిపోయింది.
అయితే, చరిత్రలో ఇది ఆకస్మికంగా ప్రత్యక్షమైన రోజా?! కానే కాదనీ, అసలు ఈ దేశంలో స్వాతంత్రం ఉదయించిన 1947 వ సంవత్సరంలోనే 06 డిసెంబర్ 1992 చీకటి రోజుకు బీజం పడిందనీ, ఆ మాటకొస్తే ముస్లిములను ఈ నేలకు పరాయివాళ్ళను చేసే కుట్ర శతాబ్దాలుగా జరుగుతున్నదే అని సత్యాగ్రహంతో తన పద్యం ‘నాకే జన్మభూమీ లేదు’ లో చెబుతున్నాడు కవి అఫ్సర్!
బహుశా, ఒక్క తెలుగు భాషలోనే కాదు – అన్ని భారతీయ భాషలలో, బాబ్రీ మజిద్ కూల్చివేత నేపథ్యంలో వెలువడిన అత్యంత శక్తివంతమైన పద్యాలలో అఫ్సర్ రాసిన ‘నాకే జన్మభూమీ లేదు’ పద్యం ఒకటనుకుంటాను.
వ్యక్తిగత దుఃఖాన్ని పద్యం చేయడం కన్నా, ఒకానొక సందర్భంలో అనేక రాజకీయ, చారిత్రక కారణాలతో ముడిపడి వున్న ఒక సామూహిక సామాజిక దుఃఖాన్ని పద్యం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలు! అయితే, కవి ఆ సామూహిక సామాజిక దుఃఖాన్ని తన అనుభవంలోకి తీసుకున్నప్పుడు ఆ పద్యం ఆ బాధిత సమూహాలకవతలివాళ్ళని కూడా కదిలిస్తుంది.
అఫ్సర్ పద్యాలలో ఒక పసి లక్షణం మనల్ని చాలాసార్లు కట్టిపడేస్తుంది. అది వ్యక్తిగత దుఖమైనా, సామాజిక దుఖమైనా, దానిని పద్యం చేసినపుడు, ఆ దుఖానికి కారణమైన వాళ్ళ పట్ల తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేయడంకన్నా, ఒక చిన్న పిల్లవాడు అలకను ప్రదర్శిస్తూ ఫిర్యాదులు చేయడం లాంటిది అఫ్సర్ పద్యంలో కనిపిస్తుంది. కొన్ని సార్లు ప్రత్యక్ష ఆగ్రహ వాక్యాల కన్నా ఈ అలక వాక్యాలే సున్నిత మనస్కులైన చదువరులకు తీవ్రంగా గుచ్చుకుంటాయి.
‘నాకే జన్మభూమీ లేదు’ అన్న శీర్షికతో పద్యాన్ని ఎత్తుకోవడంలోనే మనకు ఈ సంగతి తెలిసిపోతుంది.
నాకే జన్మభూమీ లేదు – అఫ్సర్
శూన్యం తల కింద
నేనేదో ఒక అవయవాన్నినేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
47 దగ్గరే ఎలా విరిగానో
మీరెవరూ చెప్పలేదుగా
దేవుడి అంగాంగాన్నీ
కోసుకుని పంచుకునీ
లేదంటే, దోచుకునీ
వెళ్లిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగానేను శరీరం లేని నీడని
లేదంటే, ఏ గోడ మీంచో
రహస్యంగా పారేయబడిన ఆత్మనిదేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదుఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలను
కుంకుమ చేతులు కోసుకెళ్లి పోయాయి
అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడుతున్న నా దేహమ్మీద సమాధి కడుతోందిరెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు
నా వొళ్ళు వొక అల్ కబీర్నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయి నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను
నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలియదునిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రవాసిని
నాలో సగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమనినా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాడిని
అగ్ర రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాడినిశవమయి దాక్కోవడానికి వున్నా లేకున్నా
తల దాచుకోవడానికి చారెడు నెల చాలంటాను
ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో ఆంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటానునలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించమంటానునా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.
విభజించి పాలించే నా శత్రువులారా,
నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు
తీవ్రమైన కత్తిపోట్లకు గురైన బాధితుడు ఇరుకు గల్లీలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ చెప్పిన మాటల్లా ‘శూన్యం తల కింద నేనేదో ఒక అవయవాన్ని’ అని ఆకస్మికంగా పద్యం మొదలవుతుంది. ఆ తరువాత, ఆ బాధితుడు కాసింత స్థిమితపడి తన గోడుని వెళ్ళబోసుకున్నట్టు ఒక్కొక్క పొరనే విప్పుతూ సాగుతుంది ఈ పద్యం.
బాబ్రీ మజిద్ విధ్వంసం పైన ప్రముఖ మరాటీ కవి ఆనంద్ గైక్వాడ్ రాసిన పద్యం రోడ్ల మీది చెత్తను ఊడ్చి వేసే ఒక దళితుడికి, ఖుల్ఫీ ఐస్ క్రీం అమ్ముకునే ఒక ముస్లిం యువకునికి నడుమ సంభాషణగా సాగుతుంది. డిసెంబర్ 6 వ తేదీన ఎదురుపడిన తన దళిత మిత్రుడిని ‘ఇవాళ నువ్వు ఖుల్ఫీ తినడం లేదా?’ అని ముస్లిం యువకుడు అడిగినపుడు ‘ఇవాళ బాబా సాహెబ్ నిర్వాణ దినం’ అని బదులిస్తాడు. ‘మరి నువ్వెందుకు ఇవాళ ఖుల్ఫీ బండి నడపడం లేదు?’ అని తిరిగి ఆ దళిత మిత్రుడు తన ముస్లిం మిత్రుడిని అడిగినపుడు ‘ఇవాళ బాబ్రీ మజిద్ ను ధ్వంసం చేసిన రోజు’ అని అతడు బదులిస్తాడు. ఇక్కడ సంభాషణను ఆపివేసి, ఆ మరాటీ కవి పద్యాన్ని ఇట్లా ముగిస్తాడు – ‘ భయానక నిశ్శబ్దం వీధిని ముంచెత్తింది / మిత్రుల చుట్టూ వాతావరణం ఖుల్ఫీ డబ్బాలా గడ్డ కట్టుకుపోయింది’.
అఫ్సర్ రాసిన ఈ తెలుగు పద్యం చదువుతూ ముందుకు సాగినపుడు శరీరమంతా అట్లాంటి గడ్డకట్టిన గగుర్పాటుకు లోనవుతాము. ‘దేవుడి అంగాగాన్నీ కోసుకునీ పంచుకునీ’ అని చెప్పడంలో దేవుడి ఒక్కో అంగంలోంచి ఉద్భవించిన కుల సమూహాలుగా దేశ ప్రజలను విభజించిన మనుధర్మ శాస్త్రాన్ని నిష్టూరమాడడంతో పాటు, ఈ విభజనలో తనకు ఏ స్థానమూ ఇవ్వని కుట్రని ఈసడించుకోవడం కూడా ధ్వనిస్తుంది. ఈ కుట్ర వల్లనే, తనను ఆకస్మికంగా 47 దగ్గర పరాయిని చేసి, ‘గోడ మీంచి విసిరేయబడిన ఆత్మని చేశారు’ అని వాపోతున్నాడు.
పద్యాన్ని కొంత దూరం పరోక్షంగా చెప్పిన కవి, ‘ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలను / కుంకుమ చేతులు కోసుకెళ్లి పోయాయి / అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా / రెపరెపలాడుతున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది’ అన్న పంక్తుల నుండి 6 డిసెంబర్ 1992 తన జీవితంలో తీసుకు వచ్చిన పెను మార్పుల గురించి ప్రత్యక్షంగా ఏకరువు పెడుతున్నాడు.
‘కుంకుమ చేతులు’ అని అనడంలోనే తన జీవితాన్ని అతలాకుతలం చేసిన శక్తుల ప్రస్తావన తెచ్చాడు. ‘అక్కడెక్కడో’ ‘ఇక్కడెక్కడో’, ‘నా దేహమ్మీద సమాధి కడుతోంది’ అనడంలో గోపురాల కూల్చివేత అంతిమ లక్ష్యం ఏమిటో వివరిస్తున్నాడు. అందుకే, ఆ వాక్యాలకు కొనసాగింపుగా ‘నా వొంటి మీది చల్లని మాంసాన్ని/ఎవరెవరో అపహరిస్తున్నారు’ అనీ, ‘బొంబాయి నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను’ అనీ అంటున్నాడు.
మరింత ముందుకు వెళ్లి, తన చుట్టూ జరిగే రాజకీయాలను కూడా ప్రస్తావిస్తూ ‘నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని / నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలియదు’ అంటాడు.
ఈ పద్యంలో గమనించవలసిన మరొక అంశం- ముస్లిం సంప్రదాయాల పరోక్ష ప్రస్తావన.
‘నాలో సగాన్ని చీకట్లో ముంచి / ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని’ అంటున్నాడు. ‘శవమయి దాక్కోవడానికి వున్నా లేకున్నా / తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను’ అంటున్నాడు.
పద్యమంతా తన వేదనని వివిధ సంగతులతో ప్రస్తావించిన కవి, చివరలో ‘నలభై ఏడుతో కాదు / నాతో నన్నే భాగించమంటాను’, ‘నన్నెవరూ రెండుగా చీల్చలేరు’ అన్న వాక్యాలతో తనను ఈ దేశ పౌరుడిగా, సాటి మనిషిగా చూడమని చెబుతున్నాడు.
పద్యం చదవడం పూర్తి చేసిన తరువాత, భారత రాజ్యాంగ విలువల్ని విశ్వసించే సున్నిత మనస్కుడైన ఈ దేశ పౌరుడిగా ‘ప్రతీ 6 డిసెంబర్ నాడు చదవ వలసిన పద్యం ఇది’ అని మీరు భావిస్తే, అందుకు ఈ పద్యం రాసిన కవిని బాద్యుడిగా ప్రకటించవలసి వుంటుంది!
**** (*) ****
డిసెంబరారు మళ్ళీ రాకూడదని అనుకుంటూ ఉంటా. కాని, కాలం అనేది మన చేతుల్లో లేదనీ యింకే చేతుల్లోనో అది బందీ అని గట్టిగా తెలిసిపోతూనే వుంది.
బహుశా యీ కవిత డిసెంబరారు మీద వచ్చిన తొలి కవితల్లో వొకటి. యిందులో ఆలోచనలూ ఆవేశాలూ కొంచెం రఫ్ గా వుంటాయి కూడా.
అలాంటి కవితని మనసుకి దగ్గిరగా తీసుకొని, యింకో మనసు తలుపు తెరిచేంత సున్నితంగా విశ్లేషణ చేసిన చిరకాల మిత్రుడు కవిత్వ ప్రేమికుడు Vijayakumar Koduri కి షుక్రియా!
చాల మంచి పోయెమ్. చాల చక్కనైన పదునైన విశ్లేషణ -
బాబ్రీ సంఘటన జరగక ముందు, తరువాత కష్మీర్‌లో 438 దేవాలయాలు మతోన్మాద శక్తులచే ధ్వంసం చేయబడ్డాయి. వాటి గురించి తెలుగునాట దాదాపు 70 ఏళ్లుగా మాధ్యమాలలో అత్యధిక శాతంగా పరిఢవిల్లుతున్న ఎడమ, ఎడమాతి ఎడమ, లేదా వామ, అతివామ, మహావామ పాత్రికేయులు, భావజాల సానుభూతి సంపాదకులు, మతమైనారీటీ యోధులు తమ జీవితకాలంలో ఒక్క వాక్యం, లేదా పదం అయినా వ్రాసారా? కనీసం విన్నారా? చదివారా? సిక్యులర్, లిబ్ టార్డ్, ప్రెస్టిట్యూట్ మాధ్యమాలు ఏ రోజైనా వీటి గురించి ఒక్క సానుభూతి పదమైనా వ్రాసాయా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే 70 ఏళ్లుగా మన వైఫల్యానికి కారణం, ప్రజలలో ప్రాచుర్యం లేకపోవడానికి కారణం అర్థమవుతుంది. ఒకవైపే చూడడం మొదలుపెడితే కొంతకాలానికి ప్రపంచం పాక్షికంగా తప్పితే కనబడడం మానేస్తుంది. దాడి రెండోవైపు నుండి మొదలయితే చచ్చి ఊరుకుంటాం. ఈ దౌర్భాగ్య స్థితి కేవలం తెలుగునాట మాధ్యమాల్లోనే వుంది. ఇలాంటి వాదనలకు ఉత్తరాది మాధ్యమాల్లో అయితే సామాన్యమైన పాఠకుడు కూడా తగిన, సరియైన సమాధానం యిస్తారు. ఈ సంవత్సరం మతోన్మాద శక్తులచే ధ్వంసం చేయబడ్డ, చంపబడ్డ హిందూ మనుష్యుల గురించి ఏనాడైనా ఎవడైనా ప్రస్తావించారా? సంచనలమే తమ రక్తం, తమ ప్రాణంగా అఘోరిస్తున్న మాధ్యమాలన్నీ వాటి గురించి పతాక శీర్షికలలో ఎందుకు వ్రాయవంటే తమని కూడా హిందూత్వ అని ముద్రవేస్తారన్న పిచ్చి భయంవల్ల. ఎవరికయినా ఆసక్తి వుంటే కేవలం ఈ సంవత్సరంలోనే హిందువల హననం జాబితా యిస్తాను.
208 Hindu temples destroyed in various acts of vandalism since two decades
Srinagar, March 27: Nearly 208 Hindu temples have been destroyed in various acts of vandalism in the last two decades. However, none of the mosques have been destroyed in such acts of vandalism. Notably, Jammu and Kashmir government on Thursday while replying to the question of BJP MLA in state parliament said that in the last two decades of militancy in Jammu and Kashmir, nearly 208 Hindu temples have been destroyed in various acts of vandalism. “Of the 438 temples in the Valley, 208 had been damaged over the years,” it said.
The government further said, “A total of 63 hectares of land were under the 436 temples in Kashmir. There was no case of encroachment on these lands so far.” “In south Kashmir Kulgam district nearly 85% of the 754 structures have been damaged,” government added.
Notably, Srinagar ranks first with 57 temples being destroyed with Anantnag, coming close to second having 56 temples being destroyed by militants. Interestingly, the authorities have kept shut on the cause of such destruction and have been cautious in not blaming the entire episode of vandalism on the militants.
On the other hand, Sanjay Tickoo of Kashmiri Pandit Sangarsh Samiti (KPSS), a body of Kashmiri Pandits disputed the government figures, claimed that around 550 temples were damaged and 50,000 canals have been encroached upon.
The List of Hindu Temples attacked in Jammu and Kashmir by terrorists:0020
Hindu Temples attacked, stoned, bombed or burned by Kashmiri Muslims and terrorists inKashmir in Independent India. Data from newspapers noted once in a while. The noted period is from 1986.
SRINAGAR: Ganpatyar temple, Shrinagar – Stoning and Arson.
Bhairav temple, Maisuma – Stoning and Arson.
Temple in front of Gurudwara at Amiradadal ransacked
Shiv temple, Jawaharnagar – stoning and arson.
Bhairav Mandir, Karan Nagar – ransacked and Carpet burned.
Shiv temple near secretariat – stoning and arson.
Shiv Mandir, Chota Bazar-Local Muslim rioters attacked the temple and police resorted to firing to disperse the Muslims.
Narayan Math Mandir in Tulsi Bagh – arsonand stoning.
ANANTNAG DISTRICT: Gautam nag mandir at Sarnal – set on fire –heavy damage; 3 out of four rooms destroyed.
Shivalay Mandir, Nai Basti – heavy stoning, and temple ransacked
Temple at Wanpoh on Khanabal-QazigundRoad – set on fire – heavy damage.
Another temple at Vanpoh – set on fire –heavy damage.
Temple at Aishmuqam – Idol and temple ransacked.
Temple at Dhanbogund, Kulgam – set on fire– heavy damage.
Navgam temple, Shangas – Heavy stoning –heavy damage.
Achhabal temple near Navgam – Heavy stoning – heavy damage
Temple in Lokbhavan village of ThanaQazigund –ransacked.
The second temple in Lokbhavan village ofThana Qazigund –ransacked.
The third temple in Lokbhavan village of ThanaQazigund –ransacked.
Forth temple in Lokbhavan village of ThanaQazigund –ransacked.
Harish Chandra Seva Mandir, Beejbehara -idols destroyed ransacked the temple
Devi Mandir, village Karebal Beejbehara –Idols damaged and temple ransacked.
Shivalay Mandir, Janglat Mandi, Anantnagtown –ransacked and heavy damage.
Temple of Dyalgam – ransacked and heavy damage.
Temple at Fatehpura village, QazigundTehsil – Temple was seton fire – heavy damage.
Temple at village Siligam, Thana Aishmuqam – ransacked.
PULWAMA DISTRICT: ShivMandir at village Koil, Thana Pulwama – arson and looting.
Temple at village Trisal, Thana Pulwama –destroyed Idols, stole microphone. Boundary wall was broken.
BARAMULLAH DISTRICT: Kali Mandir in Jamla Kadal Mohalla, Sopore–arson.
Fatapura temple, Sopore -stoning. ANANTNAG DISTRICT
Chandi Puiarl temple, VYosu ThanaQazigund) – Arson and looting.
BADGAM DISTRICT: Sharda Devi temple, Yalkot (Thana 8adgam)– arson and one part of the temple burned.
Shiv Temple, Sanghampura – (Thana Biru) –building damaged.
Shiv Mandir, Magam (Thana Vodura) – arsonBARAMULA DISTRICT
Temple in Bandipore – stoning, and arson.
Temple in Bandipore – arson
SRINAGAR DISTRICT: 1. Ram Mandir, Maharajganj, Shrinagar – arson and looting.
Shiv Mandir, Sarafkadal, Shrinagar – stoning and arson.BARAMULLA DISTRICT
Shiv Mandir, Bandipur – arson and looting -Heavy damage.
Shri Raghunath Mandir, Baramulla – Bomb explosion in MandirPULWAMA DISTRICT
Shiv temple, Shopian – Temple burned downand fully destroyed; heavy damage.
Local tempIe in Tral – Arson and looting -Heavy damage.
ANANTNAG DISTRICT: Devi Mandir, Anantnag – arson and looting.
DODA DISTRICT: Basaknag mandir, Bhadrawah – arson and looting.
Shri Ram mandir’s Hall, BarbarshahShrinagar – Bomb explosion.
Shiv Mandir Chota Bazar, Srinagar, Mandirburned looted and fully damaged.
Shri Raghunath Mandir, Srinagar – arson and looting.
Building of Ramkrishna Ashram, Chota Bazar, Srinagar-arson
PULWAMA DISTRICT5: Suchcha Nath Mandir, Shopian – arson looting and burning– heavy damage.BADGAMDISTRICT
Shri Ram Mandir, Badgam – destroyed; idols looted – heavy damage.
Rama Mandir, Udhampur – heavy damage.
DODA DISTRICT: Supernag Temple – Idols looted and temple burnt.
Siv Mandir Kiratwar – explosion on 2nd Nov. -minor damage.
Buichhal Mandir – explosion on 10th Nov. -heavy damage.
Temple in Kulharad village – arson burning and looting, heavy damage.
Temple in Bharat village – arson and looting- heavy damage.
SRINAGAR DISTRICT 1: Arya Samaj Mandir and School, Srinagar -Bomb explosion on 10th Feb.
Raghunath Mandir, Srinagar – arson and looting.
Arya Samaj Mandir and School Wazir Bagh, Srinagar –Bomb explosion on 21st July -heavy damage.
Shri Ram Mandir, Babarshah Shrinagar -Conference Hall attacked with rocket on2nd Sept.
Shitalnath Mandir, Srinagar – arson and looting on 18th Nov. heavy damage.
ANANTNAG DISTRICT: Lakshmi Mandir, Bijbehara – arson and looting on 4th August – Heavy damage.
BARAMULLA DISTRICT: Sharda Mandir, Kalusa,
Andipur-arson and looting. Heavy damage.
KUPWARA DISTRICT: Handura Mandir – Idols destroyed and many Idols were taken away.
ANANTNAG DISTRICT: Nagbal Mandir, Anantnag – Bomb Explosion.
Shri Raghunath Mandir, Anantnag – BombExplosion, – minor damage.
Shri Raghunath Mandir, Anantnag – Grenade thrown.
SRINAGAR DISTRICT:
Shri Raghunath Mandir, Srinagar – arson and looting of seven houses of Hindus and two temples.
Shri Raghunath Mandir, Shrinagar–arson and looting.
Karafali Mohalla, Srinagar – Stoning, Arson and looting.
Temple in Anantnag – Stoning, Arson and looting.
Temple in Srinagar – Arson and looting.
Temple in Kulgam, Anantnag – Stoning, Arson and looting.
Shiv Mandir, Sherpore Kund – Stoning, Arson and looting.
Temple at Karichhama – Tang Marg, Baramulla – Stoning, Arson and looting.
Temple in Baramulla on Kungar Tang Road -Stoning, Arson and looting.
Shri Vishnu Temple, on the Bank of RiverJhelum Stoning, Arson and looting.
Kuvi Utraso Temple Anantnag – Stoning, Arson and looting.
Temple of Chitergund, Anantnag – Stoning, Arson and looting.
Temple of Bana Mohalla, Srinagar- Stoning, Arson and looting.
Karfali Mohalla, Shrinagar – Stoning , Arson and looting.
Samshan Bhoomi Temple, Karannagar, Srinagar – Stoning , Arson and looting.
Narsingh Bagh – Shadipur Temple, Ganderbal, Srinagar – Stoning, Arson and looting.
Nandkishore Temple, Sumbal, Baramulla -Stoning, Arson and looting.
Temple of Pahalgam, Anantnag. Stoning, Arson and looting.
Temple, Verinag, Anantnag. Stoning , Arsonand looting.
Second Temple Verinag, Anantnag. Arson and looting.
Third Temple, Verinag, Anantnag. Stoning, Arson and looting.
Fourth Temple, Verinag, Anantnag. Arson and looting
Fifth Temple, Verinag, Anantnag Arson and looting.
Sixth Temple, Verinag, Anantnag. Arson and looting.
Temple in Tragaon, Kupwara – Arson and looting.
Temple in Pattan, Baramulla – Arson and looting.
ప్రియమైన శ్రీనివాసుడు గారు, మీతో విభేదించటానికి లేదూ వాదించటానికి అనుమతినివ్వరా ?
బాబర్, మొఘల్ చక్రవర్తుల పాలనలోని మంచి విషయాల గురించి కాక కేవలం రాజకీయం అయిన పురాతన మసీదు గురించే
ఎందుకు ప్రజలను ఉద్రేకపూరితులను చెయ్యాలి.? వాడ వాడా గుళ్ళల్లో, భక్తుల గుండెల్లో నిలిచియున్న రామ్ లల్లా, మర్యాద రామకు
రక్తంతో అపవిత్రం అయిన చేతులతో గుడిని కట్టాలా?
‘నన్నెవరూ రెండుగా చీల్చలేరు’ అన్న కవి అఫ్సర్ గారిలాగే, వాళ్ళనాన్న కౌముది గారూ అన్నారు, మన జాతిపిత బాపూజీనూ అన్నారు.
మనిషిని సాటి మనిషి నుండి వేరుచేస్తున్న మతాలూ, ప్రార్ధనా మందిరాలు, కర్మకాండలకు అనవసర ప్రాధాన్య మివ్వకుండా … మనశ్శుద్ది, జ్ఞానమార్గము, ఆధ్యాత్మిక మార్గము వైపు మానవజాతిని నడిపించాల్సిన అవసరం లేదా ?
హిందూత్వ౦ అంటే మతోన్మాద౦ అని అపవాదుకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిమీదా లేదా?
స్వాతంత్రం వచ్చి ఇన్నియేళ్లు అయినా ఇంకా అనేక అవకతవకలతో, అసమానతలు, దోపిడీలతో సతమమవుతున్న సమాజాన్ని సమసమాజ మార్గం వైపు నడిపించాలా వద్దా ?
ధన్యవాదాలతో,
ప్రియమైన రామయ్యగారూ, బాబర్, మొఘల్ చక్రవర్తులేకాదు కదా? నేటి మోడీ పాలనలోని మంచివిషయాల గురించిగాక ప్రతి సంఘటననీ రాజకీయం ఎందుకు చేస్తున్నారండీ? ఇక్కడ రాజకీయం గురించి కాదు నేను మాట్లాడింది. కష్మీర్‌లో 438 దేవాలయాలను కూల్చేసినప్పుడు రాని కన్నీరు గత 25 ఏళ్లుగా ఒక పురాతన మసీదు కూల్చేస్తేనే ఎందుకు వచ్చిందని? దానిగురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమని? మీకు సబా నక్వీ అనే జర్నలిస్టు తెలిసేవుంటారు. ఆవిడ కరడుగట్టిన బిజెపి వ్యతిరేకి. ఆవిడ మసీదు గురించి ఏమన్నదో ఒక్కసారి చదవండి. ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది. సమసమాజం వైపు నడిపించే క్రమంలో ధ్వంసమైన 438 దేవాలయాలను మరచిపోదామని మీరు నాకు సందేశమిస్తే నేనేం చేయగలను? 438 దేవాలయాలను కూల్చేసినప్పుడు రెండుగా చీల్చబడని దేశం బాబరీ మసీదు కూల్చేస్తే చీలిపోతుందా? పైన నా వ్యాఖ్య చదివిన మీరు కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమీ అనుకోవద్దు రామయ్యగారూ, నేటి ఆంధ్రజ్యోతిలో తిగుళ్ల కృష్ణమూర్తిగారు ఇలాంటి ఒకవైపు చూసే ఎడమ మేధావుల గురించి అద్భుతమైన వ్యంగ వీచిక విసిరారు. దాన్ని సమర్పించుకుంటున్నాను, అవధరించండి….
దైవ– భావ– జాలం
31-12-2017 00:10:04
లౌకికవాదం లౌకికవాదం అంటూ దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను చెడగొట్టిన కమ్యూనిస్టులు, ఇప్పుడు ఆ పార్టీ తన కళ్లముందే బాగుపడడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏచూరి వారు… కాంగ్రెస్ లౌకిక వాదాన్ని మరిచిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. ‘కలిసుందాం రా’ అన్న కమ్యూనిస్టుల మాట, ఇప్పుడు కాంగ్రెస్‌కు… ‘కాలిపోదాం రా’ అన్న ప్రేమోన్మాది పిలుపులా వినిపిస్తోంది. దాంతో రాహుల్ ‘సత్రం భోజనం– మఠం నిద్ర’ అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని ఆలయాలు తిరుగుతూ రాజకీయ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటున్నాడు.
శుభమా అని బోడక్కకు దండం పెడితే నా లెక్క నువ్వుండు బిడ్డా అంటూ తలమీద చెయ్యేసి నిమిరి మరీ అప్యాయంగా ఆశీర్వదించిందట! ముసిల్ది తొంబైయేళ్లు బతకాలన్నదా? లేక తనకూ మొగడు లేకుండా కావాలన్నదా? మనసుకు పట్టక ముటముటలాడిందట కొత్త పెళ్లి కూతురు. కనుమరుగవుతున్న కమ్యూనిస్టుల ధోరణి కూడా ఈ మోటు సామెతలాగే ఉంది. పాపం రాహుల్‌గాంధీ! కుక్కమూతి పిందెలా మారిన కాంగ్రెస్‌కు, చివరాఖరి నెహ్రూ కుటుంబ వారసుడు… పార్టీ రాలిపోకుండా నిలబెట్టడానికి గుళ్లూ గోపురాలు తిరుగుతుంటే, లాజిక్కుల లెఫ్టిస్టులు తగుదునమ్మా అని లాపాయింట్లు లాగుతున్నారు. అంత గొప్ప కాంగ్రెస్‌కు అధ్యక్షుడవుతున్న యువకుడు.. తనకు తాను జందెం వేసుకునే బ్రాహ్మణుడనని అనడం ఏమిటి? ముమ్ముమ్ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఎప్పుడైనా తన కులం గురించి చెప్పుకున్నాడా? లౌకిక కుటుంబానికి చెందిన వారసుడు… గుళ్లూ గోపురాలు తిరగడం ఏమిటి? సోనియాగాంధీ ఎప్పుడైనా ఇలా చేసిందా? అనేక మతాల రక్తం ప్రవహించే ఆధునిక నాయకుడు తాను శివభక్తుడినని ప్రకటించుకోవడం ఏమిటి? ముత్తాత సోషలిస్టు జవహర్లాల్ నెహ్రూ ఆత్మ ఏమనుకుంటుందో పట్టించుకోడా? అన్నవి వామపక్షీయుల ఆమాంబాపతు అభ్యంతరాలు!
కారల్‌మార్క్స్ గురించి తప్ప, కాలకంఠుడి గురించి భక్తిశ్రద్ధలతో శోధించలేదు కనుక ‘వామా’చారులకు దైవతత్వం అంతగా అంతుబట్టలేదు. ఆమూలాగ్రం అర్థం కాలేదు. కష్టాల్లోనే మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇంకా చెప్పాలంటే… తనను మరిచిపోయిన వారికి, ఆ విషయం జ్ఞాపకం చేసేందుకే దేవుడు కష్టాలు కలిగిస్తాడన్నది ధర్మసూక్ష్మం. దేశాన్ని ఏలిన కాంగ్రెస్, రాహుల్ శకం నాటికి పట్టుమని నాలుగంటే నాలుగే రాష్ట్రాలకు పరిమితమై, మోదీ బాధతో అష్టకష్టాలు అనుభవిస్తున్నది. నానాటికీ తీసికట్టు నాగం భొట్టు అన్నట్టే తప్ప పార్టీ ముందుకెళ్లే పరిస్థితే లేదు. ఇందుకు కారణం ఆ దేవదేవుడే! ఆ విషయాన్ని రాహుల్ సరిగ్గా గుర్తించాడు. ఇంకా చెప్పాలంటే ‘ఇంట్లో నిత్యం శివపూజలు’ చేస్తాడు కనుక ఆ భోళా శంకరుడు, దైవ ప్రేరితంగా రాహుల్‌కు జ్ఞానోదయం కలిగించాడు. అందువల్లే రాహుల్ గుజరాత్ ఎన్నికల్లో మోదీకి దీటుగా అనేక దేవాలయాలను దర్శించాడు. దేవుడు కమ్యూనిస్టుల్లా కాదు కదా! నమ్ముకున్న వారికి ఎన్నడూ ద్రోహం చేయడు! అందుకే తనను బాగా నమ్మిన మోదీని గెలిపించి, బాల భక్తుడైన రాహుల్‌ను గెలిపించినంత పని చేశాడు. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త ఊపిర్లూదాడు. గుజరాత్లో రాహుల్ 27 గుళ్లను సందర్శిస్తే, ఆ ప్రాంతాల్లోని 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. దేవుడి మహిమకు ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?! కనుకే రాహుల్ రేపటి కర్ణాటక ఎన్నికల కోసం అప్పుడే మఠాలు, గుళ్లు తిరగడం మొదలుపెట్టారు. దేవదేవుడి దయ వల్ల అక్కడ గెలిచినా గెలవొచ్చు!
‘చెరపకురా చెడేవు’ అని సామెత! ‘చెరపకు.. రా చెడుదాం’ అన్నది ఎర్ర సామెత! మనం బాగుపడడంలో ఒక సంతృప్తి ఉంటుంది. ఎదుటివాడిని చెడగొట్టడంలో ఎక్కువ సంతృప్తి ఉంటుంది. తాను నష్టపోతే వచ్చే బాధకన్నా, ఎదుటివాడూ తనలా అయితే కలిగే ఆనందం ఎక్కువ! రాజకీయాల్లో రెండో రకం వాళ్లే ఎక్కువ! లౌకికవాదం లౌకికవాదం అంటూ దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను చెడగొట్టిన కమ్యూనిస్టులు, ఇప్పుడు ఆ పార్టీ తన కళ్లముందే బాగుపడడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏచూరి వారు… కాంగ్రెస్ లౌకిక వాదాన్ని మరిచిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. అయితే ‘కలిసుందాం రా’ అన్న కమ్యూనిస్టుల మాట, ఇప్పుడు కాంగ్రెస్‌కు… ‘కాలిపోదాం రా’.. అన్న ప్రేమోన్మాది పిలుపులా వినిపిస్తోంది. దాంతో రాహుల్ ‘సత్రం భోజనం– మఠం నిద్ర’ అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని ఆలయాలు తిరుగుతూ రాజకీయ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటున్నాడు. ముస్లిం ఓట్లు అనే కాంగ్రెస్ పుట్టలో మోదీ వేలు పెడితే, హిందూ ఓట్లు అనే బీజేపీ బుట్టలో తానెందుకు చేయి పెట్టకూడదని దేవుని సాక్షిగా ప్రయతిస్తున్నాడు. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది కదా!
గుడ్డెద్దు గుంపులో ఉండొద్దు అనుకుంటదట. అంతా తానే మేయొచ్చని! మొండెద్దు మందలో ఉండాలనుకుంటదట. ఊపుకునేందుకు తోకుండదు కనుక, ఈగలు దోమలు మిగతా పశువుల మీద కూడా వాలి తనకు బాధ తగ్గుతుందని! లెఫ్ట్ పార్టీలు రెండో రకం. పనికిరాని విదేశీ సిద్ధాంతాలు అమలు చేయడానికి తన బలం చాలదు కనుక, మంది బలం కావాలి. ఇత్తేసి పొత్తుగూడాలంటే బకరాలు ఉండాలిగా మరి! కాంగ్రెస్‌కేమో అసలు సంగతి తెలిసిపాయె! అందుకే లెఫ్టిస్టులు తెలంగాణలో 31లతో, దేశంలో అనేక పార్టీలతో విస్తృత ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసి మతతత్వ బీజేపీని ఎదిరిస్తారట! అంతమంది లేకపోతే మోదీని పడగొట్టేందుకు తొడగొట్టే వీలే లేదట మరి! కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా పేపర్లలో కాలాలకు కాలాలు నింపే పేరుగొప్ప కమ్యూనిస్టుల బలం అదీ!
‘‘కమ్యూనిస్టులకు దేశభక్తి నేర్పుతారా? అని సురసురలాడుతున్న సురవరం, మార్క్సిజం సైన్స్ అంటూ మళ్లీ పాతపాటే పాడుతున్నారు. ఇండియన్ సోషల్ సైన్సెస్ ఏనాడో మారిపోయిన సంగతిని గుర్తించడం లేదు! విప్లవ ప్రజాతంత్ర వామపక్ష ప్రజాస్వామిక శక్తుల వీరోచిత ఐక్యత గురించి పిడికిలి బిగించి ప్రవచిస్తారు. కానీ సీపీఐ సీపీఎంలో కలవదు! వందలాది లెఫ్ట్ ముఠాల్లో ఒకదాని పొడ మరొకదానికి గిట్టదు. రెండు వేల ఏళ్ల నాటి మను– స్మృతి నుంచి సమాజం ఏనాడో బయటకొచ్చినా లెఫ్టిస్టులు ఇంకా అక్కడే ఉన్నారు. ‘అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద మతవాద శక్తులు’ అని గంపగుత్త విమర్శతో సరిపెట్టే ఈ మేధావులు… ఇప్పుడు సమాజంలో అగ్రకులాలేవో, దళితుల మీద దాడులు చేస్తున్నది ఏ కులాల వారో, వారిమీద తమ పోరాట పంథా ఏమిటో తేల్చి చెప్పలేరు. మహానుభావుడు అంబేడ్కర్ విగ్రహాలు పెట్టి, ఇదే దళితులకు చేసే అతి పెద్ద సేవ అని నమ్మించే హిపోక్రటిక్ పార్టీల్లాగ, కమ్యూనిస్టులది మంకుపట్టు సిద్ధాంతాల, పడికట్టు పదాల, చారిత్రక తప్పిదాల సింబాలిక్ పోరాటమే! జాతీయ వాది అంబేడ్కర్ తన జీవితాంతం కమ్యూనిస్టుల్ని వ్యతిరేకించగా, ఇప్పుడు అంబేడ్కర్ వాదుల తరఫున కమ్యూనిస్టులు పోరాడతారట! విదేశీ సిద్ధాంతాలతో 40 ఏళ్లుగా దేశీ మార్గాన్ని డీవియేట్ అవుతూ, వక్రభాష్యాలతో సమాజాన్ని డీవియేట్ చేస్తూ వస్తున్న కమ్యూనిస్టులకు.. ఇప్పుడు ఉత్తర కొరియా ‘వామపక్ష ప్రజాతంత్ర విప్లవ ప్రజాస్వామిక నియంత’ కిమ్ రూపంలో సరికొత్త స్ఫూర్తిదాత దొరికాడు. కేరళలో పోస్టర్లు వేసుకుని ఊరేగిస్తున్నారు. హతవిధీ… హ్యాట్సాఫ్!! కిమ్ భజన కాదు కామ్రేడ్స్.. భరతమాత భజన చేయండి. కాదంటే కనీసం రాహుల్లా… ఈ దేశపు దేవుళ్లనైనా నమ్ముకోండి! కేరళ మంత్రి కె సురేంద్రన్లాగానో, నారాయణలాగానో… భార్య పేరు చెప్పో, భక్తి పేరు చెప్పో గుళ్లకు వెళ్లి మనస్ఫూర్తిగా ఒక దణ్నం పెట్టుకోండి చాలు! గెలిచిపోతారు! మీరు మన గుళ్లను మరిచినందుకే, జనం మిమ్మల్ని మరిచిపోయారు!
చివరాఖరు: కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు, ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్‌లో జిషా అనే దళిత విద్యార్థినిని అత్యాచారం చేసి చంపేశారు. యథాప్రకారం వామపక్షీయులు ‘అగ్రకుల బ్రాహ్మణీయ హిందూ మనువాద’ దురహంకారాన్ని చీల్చి చెండాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను, కేంద్రంలో మోదీనీ దునుమాడారు. ఎన్నికలైపోయాయి. లెఫ్ట్ ఫ్రంట్ గద్దెనెక్కింది. కేసు కూడా తేలిపోయింది. ఇంతకూ, ఆ నేరం చేసిందెవరంటే… బంగ్లాదేశ్ మూలాలతో, అస్సాంలో స్థిరపడ్డ, కేరళ వలస వచ్చిన, అమిర్ ఉల్ ఇస్లాం అనే కార్మికుడు! అద్గదీ సంగతి!! చాలా.. ఇంకా చెప్పాలా?!
కృ.తి.
kruthi1972@gmail.com
ప్రియమైన శ్రీనివాసుడు గారు,
నేటి యువతరం, భావి భారత పౌరులు, ప్రపంచ పౌరులు కోరుకుంటున్నది ఎల్లలు లేని దేశం;
తారతమ్యాలు, దోపిడీ లేని సమ సమాజం. ఇప్పుడు నడుస్తున్న ‘Knowledge Era’
ఆ దిక్కుకే మనల్ని నడిపిస్తుంది.
సమ సమాజం సాధించటానికి ఆత్మ బలిదానాలతో పోరాటం చేసిన వాళ్ళ పార్షిక వైఫల్యానికి,
ప్రజలలో ప్రాచుర్యం లేకపోవడానికి కారణాలను ఆత్మవిమర్శ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు.
పంథాను మరింత మెరుగు పరుచుకుంటారు.
కులం, మతం, ప్రాంతం, వర్గం లాంటి సంకుచిత్వాల ద్వారా కాక మానవత్వం ద్వారా
జాతిని ముందుకు నడిపించగలవారు కుడి ఎడమల ఎటున్నా విజయం సాధిస్తారు.
బీబీ అక్కా, భాషా భయ్యా అంటూ వరసలు కలుపుకుంటూ ఆప్యాయంగా మెసిలిన లోకాన్ని
చూసిన నాకున్న కొద్దిపాటి శక్తితో నేను మీతో సంవాదించటానికి ప్రయత్నించాను.
ధన్యవాదాలతో,
ప్రియమైన రామయ్య గారూ, మీరు చూసిన కొద్దిపాటి ప్రపంచమే కాదు, దాదాపు 30 ఏళ్ల క్రితం కష్మీర్‌లో 450000 కష్మీరీ హిందువులను (అన్ని కులాలవారు, దళితులతో సహా) జినోసైడ్ (జాతి హననం) కూడా చేసిన ప్రాంతం కూడా మన దేశంలోనే వుంది. వారిలో చాలాభాగం జమ్ములో, ఢిల్లీ చుట్టుప్రక్కల 8 x 8 గుడారాల్లో బ్రతుకుతున్నారు. వాళ్ల గురించి ఈ 30 ఏళ్లల్లో ఒక్క మాట కూడా మాట్లాడని మీ కులం, మతం, ప్రాంతం, వర్గం సంకుచితత్వం ఏమాత్రమూ లేని మానవత్వం ద్వారా జాతిని ముందుకు నడిపించగలవారు, మరియు బీబీ అక్కా, భాషా, భయ్యా అంటూ వరసలు కలుపుకుంటూ ఆప్యాయంగా మెసిలిన లోకంలోని మీకు తెలిసినవారు, ఉదారవాద, మానవతావాదులు అందరూ ఈ లోకంలో సమసమాజం స్థాపిస్తారని మీరింకా భ్రమల్లోనే వున్నందుకూ మీకు నా ప్రగాఢ సానుభూతి. ఈసారి కూడా మీరు ధ్వంసమైన 438 దేవాలయాల గురించి మాట్లాడలేదు. దాన్ని బట్టి మీరు ఎటున్నారో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను…. నెనరులతో… శ్రీనివాసుడు.
ప్రియమైన శ్రీనివాసుడు గారు,
ఆఫీసు పనుల మీద నేను జమ్మూ, కాశ్మీర్, లడ్డాక్ ప్రాంతాలకు వెళ్లాను.
కానీ అంత మాత్రానే నాకు ఆ ప్రాంత సమస్య పట్ల సరైన అవగాహన కలిగిందని అనను.
ఏ మతం, ఏ ప్రాంతంకు చెందినవారైనా సామాన్యమానవుల ఆకాంక్షలు ఒకే విధంగా ఉంటాయని తెలిసింది;
దుష్ప్రచారపు హోరుతో నిజానిజాలను ఎంత వక్రీకరించటానికి ప్రయత్నించినా.
ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ కె. బాలగోపాల్ గారి
” కశ్మీర్ పై బాలగోపాల్ ” http://kinige.com/book/Kashmirpai%20Balagopal
విశ్లేషణను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా.
నిత్యం అల్లర్లు, హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న కశ్మీర్లో ధ్వంసమైనది 438 దేవాలయాలు మాత్రమేనా,
లేక అంతకన్నా ముఖ్యమైనది మరేవీ లేదా అని ఆలోచిద్దాం.
ధన్యవాదాలతో.
ప్రియమైన రామయ్యగారూ, నిత్యం అల్లర్లు, హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న కశ్మీర్లో ధ్వంసమైనది 438 దేవాలయాలు మాత్రమేనా,
లేక అంతకన్నా ముఖ్యమైనది మరేవీ లేదా అని ఆలోచిద్దాం, అన్నారు. నేను పైన వ్రాసిన వ్యాఖ్యలు మీరు పూర్తిగా చదవలేదనుకుంటాను. 450000 మంది కష్మీరీ పండిట్లు దాదాపు 30 ఏళ్లుగా 8×8 గుడారాల్లో బ్రతుకున్నారు. జాతిహననం జరిగిన ఈ దారుణం కన్నా ముఖ్యమైనది ఏదైనా వుంటుందని నేను అనుకోవడంలేదు. 438 దేవాలయాల ధ్వంసాన్ని మీరు ఎంత అల్పంగా మీరు తీసుకున్నారో, అదే సమయంలో ఏ ప్రార్థనలూ నిర్వహించని ఒక మసీదు అత్యంత ప్రధానం అని మీరు భావిస్తున్నారో నాకు అర్థమయింది. ఇక మీలాంటివారితో చర్చ సాగించడం అనేది (అదే సమయంలో మీరు కూడా నా గురించి ఇలాగే అనుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు) సత్యాన్వేషణకు సహకరించదని నాకు అర్థమయింది. పై పుస్తకం బాలగోపాల్ వ్రాసేనాటికి బహుశా ఆయన కూడా 450000 మంది పండిట్లు 30 ఏళ్లపాటు గుడారాల్లో గడుపుతారని తన మేధతో ఊహించివుండకపోవచ్చు. అంతమాత్రాన ఈ కఠోర, దారుణ వాస్తవాన్ని మీరు విస్మరించనక్కరలేదు. మీకూ నేను ఒక పుస్తకం, కొన్ని వెబ్ సైట్లు గురించి వివరాలిస్తున్నాను. మీకు ఫేస్ బుక్ ఖాతా వుంటే చెప్పండి. ఇంకా వివరాలిస్తాను. కేవలం తెలియనితనం వల్లనే మీరు ఈ వాదన చేస్తున్నారని నా అవగాహన. 438 దేవాలయాల గురించి, 450000 మంది పండిట్లు గురించి ఒక్క సానుభూతి పదమైనా ఉచ్చరించలేని మీతో నేనిక సంభాషించలేను. క్షమించండి మీరే కాదు మీరు అనుసరిస్తున్న, మీరు నమ్ముతున్న వారెవ్వరూ తెలుగు మాధ్యమాలలో ఒక్క పదం కూడా ఎన్నడూ వ్రాయలేదు.
ట్రూత్ ఎబౌట్ కష్మీర్ వీడియో
https://www.youtube.com/watch?v=FhiXbwPKN9Y
సుషీల్ పండిట్….
https://twitter.com/neelakantha?lang=en
https://www.facebook.com/sushil.pandit.520
కష్మీర్ చరిత్ర విడియో
https://www.youtube.com/watch?v=6M6xCZ-GpWI
కష్మీరీ పండిట్ల జాతి హననం గురించి సాధికారిక వాస్తవ పుస్తకం.
అవర్ మూన్ హాజ్ బ్లడ్ క్లాట్స్
https://www.scribd.com/document/241986756/Our-Moon-Has-Blood-Clots-by-Rahul-Pandita
https://www.quora.com/What-is-your-review-of-Our-Moon-Has-Blood-Clots-book
http://www.haloofbooks.com/our-moon-has-blood-clots-the-exodus-of-the-kashmiri-pandits-by-rahul-pandita-book-review/
https://www.researchgate.net/publication/261857707_Kashmiri_Pandits_The_lost_identity
జాతిహననానికి గురైన కష్మీరీ పండిట్ల జాలగూళ్లు… ఇవి చదివితే కష్మీర్‌లో పరిస్థితి మీకు తెలుస్తుంది.
http://ikashmir.net/
http://koshur.org/music/home/rhs_menu/menu1b.html
” ఏ ప్రార్థనలూ నిర్వహించని ఒక మసీదుని అత్యంత ప్రధానం అని భావిస్తున్నారో ” …
అని ప్రశ్నిస్తున్న ప్రియమైన శ్రీనివాసుడు గారు! లేదు మిత్రమా, నేనలా భావించటం లేదు.
హక్కుల సూరీడు డాక్టర్ కె. బాలగోపాల్ గారికి కాశ్మీర్ సమస్య పట్ల ఉన్న అవగాహనను దయచేసి తక్కువగా అంచనా వెయ్యకండి.
438 దేవాలయాల కూల్చివేత, 450000 మంది కాశ్మీరీ హిందూ పండిట్లు గురించి మాత్రమే సానుభూతి చూపాలా?
లేక కశ్మీర్ సమస్యను సమూలంగా అర్ధంచేసుకోవాలా? కాశ్మీరీ పండిట్లది కానీ, కాశ్మీరీ ముస్లిమ్స్ ది కానీ రక్తం ఎందుకు చిందాలి
అనే నా బాధ.
ధన్యవాదాలతో.
***438 దేవాలయాల కూల్చివేత, 450000 మంది కాశ్మీరీ హిందూ పండిట్లు గురించి మాత్రమే సానుభూతి చూపాలా?** బహుశా ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్య నేనెక్కడా వినలేదు రామయ్యగారూ. ఇలా అంటూనే కష్మీరు పండిట్ల రక్తం ఎందుకు చిందాలి? అని మీరు బాధపడుతున్నారు. ఇంతకన్నా ద్వంద్వ ప్రమాణాలు ఏవైనా వున్నాయా?
ఈ ౩౦ ఏళ్లలలో మీరు ఎవరి భావజాలాన్నియితే అనుసరిస్తున్నారో వారు, మరియు సిక్యులర్, లిబ్ టార్డ్, ప్రెస్టిట్యూట్, అవార్డ్ వాప్సీ తొట్టిగ్యాంగ్ మేధావులు తమ జీవితాల్లో ఒక్క మాటయినా సానుభూతిగా బాధతో కష్మీరీ హిందువుల గురించి మాట్లాడారా? వాళ్లల్లో ఒక్కరినయినా వెళ్లి ఓదార్చారా? అదే సమయంలో ఎన్ని లక్షల వాక్యాలు, ఎన్ని వేల ఇంటర్వ్యూలు ముస్లింల గురించి యిచ్చారు? మీ దగ్గర లెక్కలేమైనా వున్నాయా? దీన్ని బట్టి ఎవరు రేసిస్టులో మీకు అర్థమవుతుందా?
బాలగోపాల్ గారికున్న అవగాహన మాత్రమే పరమం అని మీరు నిశ్చయం చేుసుకుంటే ఇక మీరు ఎవరితోనూ చర్చించవలసిన అవసరంలేదు. అక్కడే ఆగిపోండి. నేను ఇచ్చినవేవీ చదవనక్కరలేదు.
ఒకవైపే చూడడం, మాట్లాడడం అనేది మీరు మానుకోనంతకాలం నేను చెప్పేవేమీ మీకు అర్థం కాదు. కష్మీరీ పండిట్ల జాతి హననానికి కారణం కష్మీరీ ముస్లిం తీవ్రవాదం అనే వాస్తవం మీకు అర్థమయ్యేటంతవరకూ విషయం మీకు అర్థం కాదు.
ఇలా కొన్ని వేల వ్యాఖ్యలు ఇద్దరమూ చేసినా ప్రయోజనం లేదు. సాగుతూనే వుంటుంది. ముందుగా నేనడిగిన పై ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు కొనసాగించండి.