మెత్తని మబ్బుల్లో చిక్కబడిన వాన
సుడులు తిరుగుతూనే ఉంది
దాపెట్టిన పరిమళాన్ని మోస్తూ
నిశ్శబ్దం
పరిసరమంతటా పరచుకుంటోంది
వీచేగాలికి రాలిపోక
పొద్దున పూచిన పూలగుత్తులు
అటూయిటూ ఊగుతున్నాయి
కొమ్మమీది ఒంటరి పక్షి
బేలగా రెక్క సర్దుకుంటోంది
వానకురిస్తే,
నిశ్శబ్దం బద్దలవుతుంది కదూ?
పూలు రాలిపోతాయి కదూ?
పక్షి కచ్చితంగా కూలిపోతుంది కదూ!?
దాచిపెట్టిన పరిమళాన్ని మోసే నిశ్శబ్దం
ఎంతో సున్నిత సందిగ్ధం… బాగుంది
కవిత చాలా బాగుంది