వాకిలికి ఈ నెల నుండి విరామం ప్రకటిస్తున్నాం. మీ అందరి సహకారం వల్లనే ఈ ఐదేళ్ళలో వాకిలి ఒక నమ్మకమైన రచయితల బృందాన్ని, వైవిధ్యాన్ని ఆదరించే ఒక మంచి పాఠక బృందాన్ని ఏర్పరచుకోగలిగింది. వాకిలిని కొనసాగించలేకపోతున్నామే అన్న దిగులైతే చాలా ఉంది కానీ మళ్ళీ ఎప్పటికైనా ఈ వాకిట్లోకి తిరిగిరాకపోతామా అన్న నమ్మకం కూడా లేకపోలేదు. పత్రికలో ఇప్పటివరకు ప్రచురించబడిన రచనలు ఇక్కడే పదిలంగా అందరికి అందుబాటులో ఉంటాయి.
వాకిలిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలతో…
సెలవు.
వాకిలి సంపాదక బృందం
దుర్మార్గమబ్బా!
అయ్యో అనుకున్నానండి. మీ కారణాలు మీవి అనుకున్నా..
త్వరలో పత్రిక కొనసాగాలనే ఆసిస్తూ అభిలషిస్తూ..
బాధతో..
This is shocking Ravi garu!
I wish it comes back soon .
with best regards
అత్యంత ఆశ్చర్యకరం. త్వరలో కొనసాగింపుకోసం ఎదురు చూస్తున్నాను.
స్వల్ప విరామం కావాలని కోరుకుంటున్నాను! మళ్ళీ కలుద్దాం!
పాఠకుల మనోభావాలకు విఘాతం కలిగిస్తూ, వాకిలికి అంతర్జాల పత్రికకు విరామం ప్రకటిస్తున్న
బాధ్యతా రాహిత్యాన్ని తీవ్ర పరుషపదజాలంతో గర్హిస్తున్నాము.
సంపాదకులు పత్రికకు ట్రస్టీలు గా వ్యవహరించకుండా, అది తమ సొంత ఆస్తిగా భావిస్తూ
ఏకపక్షంగా ( పాఠకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ) తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని
పాఠకులెవ్వరూ సమర్ధించలేరు.
పత్రికకు తమ రచనలు అందిస్తూ భాగస్వామ్యులైన వారు నోరుమెదపలేని అమాయకులు.
పత్రిక నడపటానికి కావలసిన ఓనరులేవిటో, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలేవిటో వివరిస్తూ
సంజాయిషీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.
తరతరాల పిల్లలు పదికాలాలు పాటు విద్యనభ్యసించటానికి ఉపయోగపడుతున్న ఓ విద్యాలయాన్ని
ఇలా అర్ధాంతరంగా మూసేస్తే మనకెలా ఉంటుంది?
బాధ్యతాయుతంగా నాలుగు కాలాలు నడపాల్సిన ఓ అంతర్జాల సాహిత్య పత్రికను
తమ తీరికవేళల్లో రాసుకునే బ్లాగు స్థాయికి దిగజార్చే హక్కు సంపాదకులకు ఎవరు ఇచ్చారు?
ఇలాంటి సంక్షోభాలతో ఇప్పటివరకూ మూతపడిన పత్రికల సంపాదకులందరూ
తమ అనుభవాలను కలబోసుకుంటూ ఓ ఐక్య సంఘటన శక్తిగా ఎందుకు మారకూడదు?
“ ఆంధ్రజ్యోతి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్ల, కొ.కు. నాయనాల వారసులెవ్వరూ ఇక్కడలేరు.
నీహద్దుల్లో నువ్వుండు “ అని కసురుకోగల మీ జన్మ హక్కును మీరు సద్వినియోగం చేసుకోవలసిందిగా
మీకు విన్నవించుకుంటూ ….
~ ఓ నేలక్లాసు పాఠకుడు
( త్రిపుర గారి బెంగుళూరు బెమ్మ రాచ్చసుడు )
బహుశా మంచి కథలు,కవితలూ రచయితల నుండి రావడం లేదని నిర్వాహకులు అనుకొనివుంటారు. రచనా తాము తమనిజమే. చేయి తిరిగిన రచయితల నుండి రచనలు రావాలంటే వారికి హరిశ్చంద్రుని వెల ఇవ్వాల్సివుంటుంది. సినీ రచయితలు మాత్రమే గొప్ప రచయితలుగా చెప్పవచ్చు. వారికి ఇతర రచనలు చేసేంత సమయం వుందకపోవచ్చు.
కనుక వాకిలి పత్రిక నిర్వాహకులు తమకు అందిన రచనలు ఎలావున్నాగానీ వాటిని ప్రచురించాలని నా విన్నపము. విశేష అనుభవముగల పాఠకులు వ్యాఖ్యాన రూపంలో ఇచ్చే సూచనల వల్ల రచయితలు తమను తాము ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు.
అరె ! వెబ్ పత్రికలన్నీ ఇలా మూతపడటం బాధాకరం . తిరిగి కొనసాగుతుందని ఆశిస్తూ ..
ఇలా అర్ధాంతరంగా వాకిలికి విరామాన్ని ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం. పత్రిక తిరిగి కొనసాగాలని కోరుకుంటూ …
ద్వారము మూయబడియున్నది. ఇది అనుకున్నదే అయినా, కాస్త ముందుగా వచ్చింది. పోనీలెండి.
ప్రియమైన శ్రీ రవి వీరెల్లి గారు,
నిరాపేక్షతో, నిస్వార్ధంతో, సాహితీ సేవాదృక్పథంతో ( ఊపిరాడని నిత్యజీవన బాధ్యతల నుండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ) మీ బృందం ఇన్నాళ్లు చేసిన దానిని తేలికగా తీసిపారెయ్యటం లేదు.
కానీ వాకిలి పత్రికకు విరామం ప్రకటించటం మీ సమస్యలకు పరిష్కారం కాజాలదు.
పత్రికను మాసపత్రికగా కొనసాగించండి.
ప్రతిభావంతులైన సాహితీవేత్తలను మీ టీమ్ లో సభ్యులుగా ఆహ్వానించండి.
( బెజవాడ పి.సత్యవతి అక్కయ్య గారు, ల.లి.త గారు, సుజాత గారు, కొల్లూరు శోమశంకర్ గారు, అంటూ నాలాంటి
నేలక్లాసు పాఠకుడే ఎందరెందరో పేర్లు ప్రస్తావించగలడు. అలాంటప్పుడు మీకెందరు తెలిసుంటారు )
ఆర్ధిక ఒనరులు సమకూర్చుకోవాలంటే పెద్దల సలహా, సహాయాలు అర్ధించండి.
( వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ, వందల కోట్లాది రూపాయలు పన్నులు గా చెల్లిస్తున్న పత్రికాధిపతులు,
మీడియా బేరన్ లను ఈ అంతర్జాల రంగాన్ని ఆడుకోవటానికి ట్రస్టీలుగా రమ్మని ఎందుకు ఆహ్వానించకూడదు. )
వాకిలి అంతర్జాల పత్రికను తిరిగి కొనసాగించవలసినదిగా ప్రార్ధిస్తూ . . .
( ఇంతకు ముందు రాసిన నా దుడుకు, పరుష వ్యాఖ్యానాలతో స్వాతి తల్లికి . . . బండ్లమూడి స్వాతి కుమారి కి మనక్షోభం కలిగించినందుకు సభామూలకంగా క్షమార్పణలు తెలియజేసుకుంటూ )
~ ఓ నేలక్లాసు పాఠకుడు
( త్రిపుర గారి బెంగుళూరు బెమ్మ రాచ్చసుడు )
అరె
రవిగారూ!ఇదేంటీ .. ఇంత షాకింగ్ న్యూస్!ప్లీజ్ మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి !
ఒకే మంచి ఆలోచన ఇంత కాలం మిమ్మల్ని, మీ మీతో నడిపిస్తున్న ఈ తరుణంలో మీ నిర్ణయం బాధాకరం.మీ ఇబ్బందులు మీకు ఉండవచ్చు, కాపీ ఎంతోమంది పాఠకులకు ఇది ఆశనిపాతం.కావున మరొక సారి ఆలోచించండి.వీలయితే “p pustakam.net ” లా కొనసాగితే బావుంటుంది……ఒకే తెనుగు అభిమాని.