మేధో హృదయమా
ఒకసారి అలా నడిచొద్దాం రా..
కరుడుగట్టిన క్రౌర్యంలో
మానవతా రేఖలు వెతుకుతున్న మహోన్నత్వమా..
త్వరగా చెప్పులు తొడుగు
అక్కడ రహదారి నెత్తురోడింది
మానవ దేహాలు ముక్కలయ్యాయి
మానవత్వ తీవ్రవాదికి
ఎరుపులో ఆనందపు మెరుపులు
***
ఎక్కడున్నాడో వెతకండి
పట్తుకుని ఇంత కారుణ్యపు వెన్నముద్దలు తినిపించాలి
కన్నీళ్ళతో చాయ్ చేసి విగత జీవుల దేహాల రొట్టె ముక్కలందించాలి
గ్రద్దలకు హంసల తొడుగు తయరు చేశారా..
మృత్యుహుంకారం లో పెనుగులాడే అమాయకత్వం
భళ్ళున బద్దలై మండిన రావణ కాష్టం
ఎన్ని పదాలు బంధించగలవు
ఆ విహ్వల ఆత్మల ఆర్త నాదాల్ని…
***
ఎడైనా
ఏమైనా
వాడూ మానవుడే
నేనో.. మానవతా వాదిని
దౌష్ట్యమైనా
కంకాళాలను కౌగిలించే కాఠిన్యమైనా
నేనో.. మానవతా వాదిని
అవును..
మరి వాడో..
వాడూ మనిషే
అమానుషుడు..పాపం
అణువణువునా మానవత్వం ఆదమరిచిన వాడు
నా నేత్రాలు నిద్ర నటించట్లేదు
త్వరగా పిలవండి
బోధించాలి వాడికి శాంతిని
ఎందుకంటే వాడూ మానవుడే… అమానవుడు..
వాడూ మనిషే… పాపం అమానుషుడు!
జయశ్రీ నాయుడు గారు….ఒక భొది వృక్షాన్ని వ్రేళ్ళతో సహా పెకలి౦చుకొచ్చి ఒక్కో అమానుషిడిని దాని నీడలో కూర్చోబెట్టి భొదిసత్వ౦ భోది౦చాలి. మార్తాడనే ఒక ఆశాభావాన్ని ఎ౦త చక్కగా చెప్పారు. కళేబరాలను మరిగిన వాడు. కత్తుల పదునును రుచి చేసిన వాడు. మార్తడనే మీ నమ్మక౦ చాలా బావు౦ది. ఒక సాహసోపేతమైన విభిన్న కవిత……చిన్నగా శా౦తి మ౦దిరాల్లోకి వెళ్తున్నట్లు ఉ౦ది మీ కవిత చదువుతు౦టే…….సురేష్ సి.వి.
Thank you Cv Suresh garu.. నమ్మకం నుండే ఆశైనా జీవితమైనా.. తప్ప్దు ఆశనిరాశల సంఘర్షణ..
నిజమే వాడు మానవుడే అమానుషుడే అటు వైపు నెట్టబడి వాడి చెప్పులు తీసినవాడెవడో వాడికీ బోధి వృక్షం కిందకు ఆహ్వానిద్దాం..
బాగుంది మీ ధర్మాగ్రహం జయశ్రీ గారు..
” ధర్మాగ్రహం” — వర్మగారు.. బాగుంది మీరిచ్చిన పదం.. నిజమే.. సామాన్యుడిది ఎప్పుడూ ధర్మాగ్రహమే..
అందుకే కుంటికాలి ధర్మానికన్నా రెండుకాళ్ళ రాబందుల అధర్మానికే రక్తార్పణాలవుతున్నాయి సామాన్య జీవితాలు.
ఎక్కడున్నాడో వెతకండి
పట్తుకుని ఇంత కారుణ్యపు వెన్నముద్దలు తినిపించాలి
కన్నీళ్ళతో చాయ్ చేసి విగత జీవుల దేహాల రొట్టె ముక్కలందించాలి!
బోధించాలి వాడికి శాంతిని
ఎందుకంటే వాడూ మానవుడే… అమానవుడు..
వాడూ మనిషే… పాపం అమానుషుడు!
ఎంత బాగా వ్రాశారు!!
హింసకు వైద్యం శాంతిని బోధించాలి అని చెప్పటం
గొప్ప భావన!
Thank you Rajasekhar garu
చాలా బాగుంది… భారతదేశంతో పాటు చైనా,శ్రీలంకలలో బోధివృక్షం కనుమరుగై చాలా కాలమైంది. మీ కవిత మళ్ళీ బోధివృక్షానికి బీజం నాటేవిధంగా వుంది… మీ ఆశ ఫలించాలని కోరుకుందాం.
Vivekanand garu.. thank you
@ అణువణువునా మానవత్వం ఆదమరిచిన వాడు @
చాలు వేలకొట్ల ఆదమరచిన అమానుషత్వాలను మేలుకొలపడానికి!
దుర్గమాంద మృత్యు దుర్గశిఖరం మీద ప్ర్రానోధయవిజయకేతనం ఎగుర వేయడానికి.
@ అణువణువునా మానవత్వం ఆదమరిచిన వాడు @
చాలు వేలకొట్ల ఆదమరచిన మానవత్వం మేలుకొలపడానికి!
దుర్గమాంద మృత్యు దుర్గశిఖరం మీద ప్ర్రానోధయవిజయకేతనం ఎగుర వేయడానికి.