కవిత్వం

అతడామె

08-మార్చి-2013

నేను శబ్దవనాల మంచుసంచారానికి తీసుకొనిపోతానా
అతడు/ఆమె ముళ్ళవంకాయల గురించి మురిసిపోతుంటుంది/టాడు

నే సృజించిన రంగమాయల వగలు చెబుతుంటాను
అతడామె ఎనగర్ర బూజు దులపడానికి కాసె పోస్తుంటుంది

గడాఫీ సద్దాం శ్రీకాంతాచారి దిల్ సుఖ్ నగర్ స్వప్నలను అన్యాయంగా ఖతం చేశారని అరిచి రోదిస్తుంటాను
తల్లి సిద్దార్థ బొమ్మల గజ్జెల్ లాగులు తొడుక్కొని
మొగుడు సైదాగాడి కోటి కొత్త ఆడబిందెలు నెత్తిపై పెట్టుకొని
ప్రేయసి పైడి గజల్ కొరడాలతో కొట్టుకుంటుంటాను
అన్న అసురుడి అదృశ్యశూలాల్నిపొత్తికడుపుకింద పొడుచుకుంటుంటాను పొడుచుకుంటుంటాను
అద్దద్దద్దద్దద్ద అల్లల్లల్లల్లల్ల అశ్శరభశ్శరభ దశ్శరభశ్శరభ
కిందేడులోకాల్ని పైఏడులోకాల్ని కడుగుతుంటుంటాను కలిపికుడుతుంటుంటాను

IMAXలో దూకుడు దూకించు నన్ను
దినాం ఏదోఒకటి కొనివ్వు నాకు సెంట్రల్ లో
కం సె కం స్టుడియో ABN చూపించు
చెక్కా కనీసం కామించురా నన్ను
చర్మాలుచీల్చి తృప్తిపరుచురా నన్ను
నేను అత్యాధునికానంతర ఆదిశక్తిని
కన్జూమర్ కాళిరక్కసిని
అతడామె భూమ్యాకాశాలు బొర్లుతుంటుంది గొర్లుదున్నుతుంటుంది

నేను నా చెరసాలలో మరణించి మరుక్షణం మధుశాలలో జెన్మిస్తాను



9 Responses to అతడామె

  1. krishna kumari
    March 8, 2013 at 6:05 am

    మీ గురి తప్పిన పద్యం కవితా సంపుటి నుండి యిప్పటి లేటెస్ట్ పోయెం వరకూ అన్నీ చదువుత్తున్నాను. you are poet for poets. మీ కవిత్వం కవులకు కవిత్వం యెలా రాయాలో నేర్పుతుంది.నిద్రిస్తున్న పాఠకుడిని ఒక సారి మెల్లగా ఒక సారి చెంప చెల్లు మనిపించి లేపుతుంది. మీ ఒక్కొక్క పోయెం ఒక్కొక్క విభిన్న శైలిలో వుంటాయి.మీ నాటకాలు ముఖ్యంగా దొంగ సత్తెయ్య, ఆదిశక్థి, మూగవానిపిల్లనగ్రొవి,బలి…..మురిగిపొయి కంపుకొదుథున్న పరిషత్తు, యూనివర్సిటీ, పద్యనాటకాలకు…ఒక సరికొత్త వస్థువును, శైలిని ఇచ్చాయి. (మీరు )దర్శకుడు బ్రతికున్నాప్పుడె రెండు యూనివర్సిటీల్లొ మీ నాటకాల మీద M.PHIL చేయ్యడం తెలుగు జాతి గర్వకారణం. పై కవితలో వైవాహిక వ్యవస్తలోని అప్రజాస్వామికాన్ని, consumerism సృష్టించిన క్రూరమైన అమానవత్వాన్ని Native,regional,cultural imagesను fusion చేస్తూ classical catharsisస్థాయికి చేర్చడం వొక అద్బుతం.

  2. కృష్ణ
    March 8, 2013 at 12:02 pm

    ఔరా…ఔరా…ఔరా…

  3. SRINIVAS DENCHANALA
    March 8, 2013 at 6:54 pm

    ee AURA anedi abhinandano vyangyamo naaku ardham kavadam ledu. vaari email leda phone number ivvandi.

    • కృష్ణ
      March 9, 2013 at 6:49 am

      idi abhinandanae. you are my favourite poet. there is no need for communication between readers and writers except writings. i hope you will agree.
      bangalakhatam moksha gundamlOki dookutaanu….ok bye

      • SRINIVAS DENCHANALA
        March 9, 2013 at 12:13 pm

        kevvu keka. tamaru kadire krishnana andi…original kavulaku paathakulaku communication lekane kuhana kavulu, careerist kavulu, prabhutwa kavulu, vutta vachanam raasi kawitwam ani bukhayinche kavulu, kawitwam chachchi poyindani rechipoye kathakulu raajyameluthunnaru. mee lanti vaall support ivvala asalaina kavulaku kaavali. anyhow thanx.

  4. March 15, 2013 at 1:41 pm

    అన్నోయ్, జర జర కాస్త కాస్త కాస్తంతే కాస్తంతే ఆలస్యమైంది ఈ కవితకి స్పందించటానికీ ప్రతి స్పందించటానికీ. నీ శబ్దవనంలోని అతడామే శక్తి భయపెట్టింది.

    • srinivas denchanala
      April 16, 2013 at 12:09 pm

      Thanx Naidu…..nee maaya padala chalana chitraalu choosi na shakthi cool avuthundani ashiddam :)

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)