కవిత్వం

మరో ఇంటికి…

29-మార్చి-2013

1.
గుబురు ఆకు కొమ్మల్లో నుంచి
ఎగిరి
దగ్డ వనానికి ప్రయాణం-

ఎంత వొదిలి వొచ్చినా
ఇంకా కొంత
తగిలే ఉంటూంది-

2.
సర్దుతున్నా కొద్ది
మరింత వెలితి-

3.
పాత ఇల్లు
కొత్త ఇల్లు ల మధ్య
చాలా వైరుధ్యం-
మరింత గందరగోళం-

గడప గడప కీ
గెంతే కొంటె పిల్లి లా
కాలం గడుస్తూ వుంది-

వెలిసి పోయిన
పాత రంగులు కనిపించ కుండా
ఇక్కడ మళ్ళీ కొత్త రంగులు
అద్దుకోవాలి-

4.
అలవాటయిన చెరువు నీంచి
అపరిచయపు ప్రవాహం లోకి
గెంతినట్లుగా వుంది.

 

(painting: Mandira Bhaduri)