కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలను
నలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని…
గాలిపటాన తోక చివర అతికించి
నల్లని ఆకాశాన ఎగురవేద్దామని…
తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ
కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది…
ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని
వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ….
రాతిరంతా కురిసిన వాన
తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ…
రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని
ముక్కున కరచి కుంటుకుంటూ…
చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ…
నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ…
Baagundi
నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ…
చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ…
నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ……….అవును నిన్న కూడా అదే జరిగింది సర్హద్దులో. బాగుంది వర్మాజీ
ధన్యవాదాలు సత్య సార్, డా.కాసుల లింగారెడ్డి సార్..
చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ….. Ee lins adbuta maina udveganni kaliginchay Varmaji
మీ సహానుభూతికి అభివందనాలు నరేష్ కుమార్జీ.
ఈ ముఖపుస్తకరూపంగా మిమ్మల్నెరిగిన వ్యక్తిగా మీ సాహితీ ప్రస్థానమంతా మితో తిరిగినవాణ్ణే మిత్రమా…మీకవిత్వంలొ మార్పులనీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నవాణ్ణె. ఈ కవిత మిమ్మల్ని మనసున్న కవిగా నిలబెడుతుంది. నిండుమందారంలా వికసించిన కవిత వర్మాజీ..అభినందనలు
మీ ఆత్మీయ అభినందనలు నాకెప్పుడూ స్ఫూర్తిదాయకం వాసుదేవ్జీ… ధన్యవాదాలు..
మంచి కవిత్వం. తూటా అన్న పదాన్ని దాని కింది పంక్తిలో చేర్చితే ఇంకా బాగుంటుందేమో.
అభినందనలు.
మీ సూచన పాటిస్తాను సార్. ధన్యవాదాలు..
poem is good .
Thank you kandukuri anjaiah gaaru..
బాగుంది.
ధన్యవాదాలు రమాసుందరి గారూ..
చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ
తూటా దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ…
అద్బుతమైన వాక్యాలు మిత్రమా
మీదైన శైలిని స్థిరీకరిస్తూ
ధన్యవాదాలు బొల్లోజు బాబా గారు.