కవిత్వం

అడవిలో తప్పిపోయి

26-ఏప్రిల్-2013

అడవిలో తప్పిపోయిన నేను
ఓ చీకటి కొమ్మను విరుచుకొచ్చాను
దాని గుసగుసలను నా దప్పి పెదాల మీద అద్దుకున్నాను
అది విలపిస్తున వానగొంతుకో
పగులు వారిన ఘంటికో
చిరిగిన హృదయమో కావచ్చును
ఘోర శిశిరాలు నోరునోక్కిన
మంచు కమ్మిన మసక చీకటి ఆకుల కేక కావచ్చును
దూరం నుండి నాకది
పుడమి దాచిన అగాధ రహస్యంగా తోచింది
కలలు కంటున్న ఆ అడవి లోంచి మేల్కొని
హేజెల్ పూరెమ్మ నా నాల్క కింద పాట పాడింది
నేను వెనుక వదలి వచ్చిన నా మూలాలు
ఒక్క పెట్టున నాతో మొరపెట్టుకున్నట్టు
కదలి పోతున్న దాని పరిమళం
నా చేతనామస్తిస్కం లోంచి పైకి ప్రాకింది
నా బాల్యం తో పాటు నేను కోల్పోయిన నా భూమి…
అంతే,ఆగిపొయాను
ఆ తిరుగుబోతు సౌరభం నన్ను క్షత గాత్రున్ని చేసింది

మూలం: ప్లాబో నెరూడా (లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ )
తెలుగు సేత: నాగరాజు రామస్వామి.