ఉదయ పుష్పం
రేకులు విచ్చుకుంటూ
కిటికీలోకి తొంగి చూస్తుంది.
ఆకాశం పారేసుకున్న పాత ఉత్తరాలు
చెల్లా చెదురుగా కనిపిస్తాయ్
వాటిలోనే ముఖం పెట్టి
నా నిద్రని తుడుచుకుంటాను.
కాలం దాచేసుకున్న వాసనలేవో
వేసవి గాలితో చెయ్యికలిపి
ప్రేమగా పలకరిస్తాయేమో
లిప్తకాలం రెప్పలకింద
ఆ పాత నేను
అంతలోనే
అల్లరి బాలుడిలా సూర్యుడు
నారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసి
నింగివైపు పరుగుదీస్తాడు
బధ్ధకాన్నొదిలిన చెట్లకూ, చిలుకలకూ
గడియారపు మెటికల విరుపులకూ
ప్రేరణనిస్తూ
తత్వవేత్తలా ఆకాశం
గంభీరంగా మారిపోతుంది.
nice
“ఆకాశం పారేసుకున్న పాత ఉత్తరాలు”, “కాలం దాచేసుకున్న వాసనలూ”, “నారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసిన సూర్యుడూ”……కవితా వస్తువునెంచుకోవటం సులభమె.తీరా రాయటం మొదలుపెట్టాక చదివించడానికి కావల్సిన పనిముట్లేవో ఇంకా తెలీయని మాలాంటి కవులకి ఈ కవిత ఓ చక్కని ఉదాహరణ.అభినందనలు ప్రసూనగారు
బధ్ధకాన్నొదిలిన చెట్లకూ, చిలుకలకూ
గడియారపు మెటికల విరుపులకూ
ప్రేరణనిస్తూ
తత్వవేత్తలా ఆకాశం
గంభీరంగా మారిపోతుంది. చాలా బాగుందండి
kavita nachchinanduku mee andariki thanks andi.
“అంతలోనే అల్లరి బాలుడిలా సూర్యుడు నారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసి” – There u go….! beautiful Pras!
వేకువ దృశ్యం మనోహరంగా ఉంది.
“కాలం దాచేసుకున్న వాసనలేవో
వేసవి గాలితో చెయ్యికలిపి
ప్రేమగా పలకరిస్తాయేమో
లిప్తకాలం రెప్పలకింద
ఆ పాత నేను…”
చాలా నచ్చేసింది