“मुद्दत हुई है यार को मेहमाँ किये हुए
जोश-ए-क़दह से बज़्म चराग़ाँ किये हुए ”
ఈ గజల్ తాలూకూ మూడు వర్షన్స్ ఇక్కడ వినచ్చు: http://nindapuran.wordpress.com/2008/03/30/muddat/
ఇది ‘Ghalib (1961)’ అనే పాకిస్తానీ చిత్రంలోని ఒక గాలిబ్ గజల్. ఈ చిత్రంలో నాయికగా నటించటమే కాక, ఈ గజల్ కు గాత్రాన్ని అందించారు అప్పటి ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయని ‘నూర్జహాన్’. ఈ గజల్ లోని ఒక షేర్.. “जी ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन / बैठे रहें तसव्वुर-ए-जानाँ किये हुए” . ఇవే వాక్యాల్ని “మౌసమ్(1975)” చిత్రంలో “दिल ढूँढता है” పాటకు పల్లవిగా వాడుకున్నారు ప్రముఖ కవి గుల్జార్. ఆయన ఈ చిత్ర దర్శకుడు కూడానూ. ఈ కాలమ్ కోసం నేను ఎంచుకుంటున్న పాటలు చాలావరకు గుల్జార్ రాసినవే కావడం యాదృచ్ఛికం ! పాటను ఎంచుకున్నాకా, అరే.. ఇదీ గుల్జార్ రచనే అని నేనే ఆశ్చర్యపోతున్నా చాలాసార్లు అప్రయత్నంగా నేను హమ్ చేస్తూ ఉండే ఆప్తగీతం ఇది.
“మౌసమ్” సినిమా కథకు స్కాటిష్ నవలాకారుడు ఏ.జె.క్రోనిన్ రాసిన “The Judas Tree” నవల ఆధారం. పరీక్షల నిమిత్తం డార్జిలింగ్ వెళ్ళిన వైద్య విద్యార్థి అమర్నాథ్, చందా అనే స్థానిక వైద్యుడి కుమార్తెను ప్రేమిస్తాడు. తిరిగి వచ్చి వివాహం చేసుకుంటానని వెళ్ళినతను మళ్ళీ పాతికేళ్ల తరువాత ధనికుడిగా ఆ ఊరు వస్తాడు. చందా గురించి వెతికి, ఆమె విషాదగాథనూ, మరణాన్ని గురించీ తెలుసుకుని విచారిస్తాడు. చందాకి కజిలీ అనే కూతురు ఉందని తెలిసి, ఆమె కోసం వెతుకుతాడు. కజిలీని ఎలాంటి వాతావరణంలో చూస్తాడు? ఆమెను ఆ వాతావరణం నుండి అమర్నాథ్ తప్పిస్తాడా? తన కథను కజిలీకి చెప్తాడా? తనతో తీసుకువెళ్తాడా? అందుకు కజిలీ ఒప్పుకుంటుందా? అన్నది మిగిలిన కథ. అమర్నాథ్ పాత్రలో సంజీవ్ కుమార్ మెప్పిస్తాడు. చందా, కజిలీ – ఈ రెండు విభిన్న పాత్రల్లో షర్మిలా టాగూర్ అసమానంగా నటించింది. 23వ జాతీయ చలనచిత్రోత్సవంలో రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచింది “మౌసమ్”. ఈ చిత్రంలో తన నటనకు వెండి కమలాన్ని అందుకుంది షర్మిలా టాగూర్.
పాతికేళ్ల తరువాత అమర్నాథ్ డార్జిలింగ్ తిరిగి వచ్చినప్పుడు, ఆ పరిసరాల్లో తిరుగుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు అతడ్ని చుట్టుముడతాయి. ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది. బరువు-బాధ్యతా లేని కౌమారంలో ప్రకృతిలో మమేకమౌతూ బధ్ధకంగా గడిపిన రోజుల్నీ, గత స్మృతులనీ నెమరేసుకుంటాడు అతను. శీతాకాలపు లేత ఎండలు, వేసవి వేడి గాలులు, గడ్డ కట్టించే చలికాలం.. అంటూ ఋతువుల స్వభావాలను వర్ణిస్తాడు. ఈ పాటలో అతని అంతర్వాణి విన్నప్పుడల్లా మనమూ అదే అనుభూతికి లోనవుతాము.
చిత్రంలో ఈ పాటకు రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకటి భూపిందర్ ఒక్కరే పాడగా, రెండవది భూపిందర్ లతాతో కలిసి పాడారు. హిందీ చిత్రాల్లో తాను స్వరపరిచిన గజల్స్ ద్వారా ఎక్కువ ప్రఖ్యాతి గడించిన సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఈ సాహిత్యానికి తగ్గ బాణీని తనదైన శైలిలో అందించారు. కానీ చిత్రం విడుదలై విజయాన్ని చూసే సమయానికి మదన్ మోహన్ లేరు! పాటని మన నాస్టాల్జియాకి దగ్గరగా తెచ్చేంతటి ప్రత్యేకత భూపిందర్ గళానికుంది. మరి ఈ పాట వాక్యార్థం చూద్దామా..
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन (౨)
बैठे रहें तसव्वुर-ए-जानाँ किये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…
ఆ తీరికైన రేపవళ్ల కోసం మరలా మనసు వెతుకులాడుతుంది
తీరుబడిగా కూర్చుని ప్రేయసి ధ్యాసలో గడిపిన ఆ రోజుల కోసం..
ఆ తీరికైన రేపగళ్ల కోసం మరలా మనసు వెతుకులాడుతుంది..
जाडों की नर्म धूप और आँगन में लेट कर (౨)
आखों पे खींचकर तेरे दामन के साये को
औंधे पड़े रहे कभी करवट लिये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…
శీతాకాలపు లేత ఎండలో, ముంగిట్లో పడుకుని
కళ్ళపై నీడగా నీ కొంగును లాగి పట్టుకుని
బోరగిలానో.. ఒత్తిగిల్లో.. పడి ఉండే
ఆ తీరికైన రేపవళ్ల కోసం మరలా మనసు వెతుకులాడుతుంది..
या गर्मियों की रात जो पुरवाईयाँ चलें(౨)
ठंडी सफेद चादरों पे जागें देर तक
तारों को देखते रहें छत पर पड़े हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…
లేదా, వేసవిరాత్రుళ్ళలో ఆ తూర్పుగాలులు వీచినపుడు
చల్లని తెల్లటి దుప్పట్లపై నడిరేయి పొద్దుపోయే దాకా మేల్కొని
డాబాపై పడుకుని చుక్కల్ని చూస్తూ గడిపిన
ఆ తీరికైన రేపవళ్ల కోసం మరలా మనసు వెతుకులాడుతుంది..
*** *** ***
ఈ గీతాన్ని ఇక్కడ చూడచ్చు:
ఇక్కడ వినవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు:
నాకు చాలా, చాలా…చెప్పలేనంత ఇష్టమైన పాట తృష్ణ గారు. కానీ భూపిందర్ సింగ్ సోలో వెర్షన్ మాత్రమే అంత ఇష్టం
ముఖ్యంగా
या गर्मियों की रात जो पुरवाईयाँ चलें, ठंडी सफेद चादरों पे जागें देर तक, तारों को देखते रहें छत पर पड़े हुए
ఈ లైన్స్ భూపిందర్ గొంతులో విన్నప్పుడు ఎండాకాలం సెలవులు, వెన్నెల రాత్రుళ్ళు,వేపచెట్టు ఆకుల గలగలు, చిన్నగా రేడియోలో పాటలు, అప్పుడే విచ్చుకున్న సన్నజాజి పూలు వాసనలు, అన్నీ నన్ను కమ్ముకుంటాయి.
మామూలుగానే(as usual) చాలా మంచి పాటని ఎంచుకున్నారు
@Mahek: thanks mahek నాకు బాగా ఇష్టమైన పాటల కన్నా ఎక్కువగా ఈ పాటని హమ్ చేస్తూంటానండి నేను. బహుశా ఆ తీరికైన పాత రోజులపై ప్రేమ వల్లనేమో..! బరువు బాధ్యత లేని ఆ పాత రోజులు, జీవితపు విషాదాన్ని ఎరుగని అమాయకత్వం ఎంత అందమైనవో కదా !
जाडों की नर्म धूप और आँगन में लेट कर (౨)
आखों पे खींचकर तेरे दामन के साये को
औंधे पड़े रहे कभी करवट लिये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…
శీతాకాలపు లేత ఎండలో, ముంగిట్లో పడుకుని
కళ్ళపై నీడగా నీ కొంగును లాగి పట్టుకుని
బోరగిలానో.. ఒత్తిగిల్లో.. పడి ఉండే
ఆ తీరికైన రేపవళ్ల కోసం మరలా మనసు వెతుకులాడుతుంది..
మంచి పాట కి చక్కటి అనువాదం చెప్పారు తృష్ణ గారూ.తెలిసో తెలియకో ఈ పాటలన్నీ వినేస్తుంటాం కానీ ఇలా పరిచయం చేసినప్పుడు ఆహా దీని కధా కమామీషు ఇదా అని ఆశ్చర్యపోతుంటాం.మీ ధారావాహిని ఇలా సాగిపోనీండి మాలాంటి వారికోసం
Thank you for this series తృష్ణ గారు
చాలా చక్కగా రాశారు తృష్ణ గారు.నాకు ఈ సినిమా,పాటలు చాలా ఇష్టం..:-)
@pappu gaaru,thanks a lot !
@kumar gaaru,my pleasure..thank you.
@nagini gaarU,అవునండి.. సినిమా కూడా వెంటాడుతుంది..thank you!
తృష్ణ గారూ, పైన Mahek గారి కామెంట్‌ని నా పేరుతో మళ్ళీ ఇంకోసారి చదువుకోండి, ప్లీజ్
ఈ పాటకి జీవం భూపేన్‌దా స్వరం… పాట పూర్తయినా ఆ వెదుకులాట నించి అస్సలు బయటకి రాబుద్ది కాదు..
థాంక్యూ, ఇంకొక మంచి పాటకి!!
@nishi; thanks a lot nishiji
ఎంత మంచిపాట!రాత్రివేళ చెవిదగ్గరగా రేడియోపెట్టుకుని ఇలాంటిపాటలు విటుంటే వేరే స్వర్గం ఎక్కడుంటుంది?గుల్జార్,భూపిందర్‌సింగ్,సంజీవ్ కుమార్ ప్రాణంపోసారు ఈపాటకి!మీ అనువాదంవల్ల పాటని మరింతగా ఎంజాయ్ చేయగలుగుతున్నా!
@indira: ఒకటా రెండా..ఎన్ని రాత్రులు.. స్వర్గమక్కడే.. ఆ నిన్నల్లోనే.. thanks indira gaaroo !
ఎవరికి నచ్చదు ఈ పాట! భూపేంద్ర మళ్ళీ మళ్ళీ తనని కలవరించేలా పాడాడు. అసలు ఆ అభుత తత్వం భూపీ గొంతులోనే ఉంది.
ఆ రెండో వెర్షన్ కూడా నాకు ప్రాణం అండీ! వెన్నెల్లోనూ,ఏకాంతంలోనూ, ఆలోచనల్లోనూ, నిశ్శబ్దంలోనూ, రహస్యంగా వెంటాడే పాట, వేటాడే స్వరం అది.
Thanks for a very nice and beautiful song..
thanks sujata gaaru.
ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి మీరు చేసిన అనువాదం అంత గొప్పగా వుంది నా ఆశీస్సులు
@jawaharlal,sr.citizen: ధన్యవాదాలు.