ఏక స్వర స్వరపేటికేమో కోకిలది
పంచమం ఒక్కటే పాడుకుంటున్నది
పంచకళ్యానిదీ ఒకే రాగం –పరుగు రాగం
పక్ష ద్వయం మీది పక్షి గానం ఒక్కటే –పవన గానం
నాదేమో ఒంటరి కోయిల సోమరి కంటం !
వసంతం వదలివెళ్ళినా
కలకూజితాన్ని కల కంటూనే వున్నాను
జవనాశ్వం పారిపొయినా
కల్యాణి రాగం పాడుకుంటూనే వున్నాను
పక్షాలు విప్పి విశ్వ విహాయసంలో
ప్లవన సంగీతమయి తేలి పోతున్నాను
కాని…..కాని…నేను –
సహసమాజ సేవాస్వర సమ్మేళనంలో
ప్రజాపాట కాలేకపోతున్న శుద్ధ శాస్త్రీయాన్ని
ఋతువు మారినా మారని ఋజు రుతు గీతాన్ని
కళ్ళకు గంతలు కట్టుకున్న గాలిపాటను
మనవాడు మహా ఘటికుడు
చేతికి పదేసి వేల్లున్నాయని దశకాలు పాడుకుంటాడు
రెండేసి చేతులతో పంచపదులను మీటు తుంటాడు
నాకు రెండైనా లేవు వోకల్ కార్డ్స్
ఒక బైనరీ గీతమైనా రాసుకునేవాన్ని!
ఒక డిజిటల్ దృశ్యమైనా పాడుకునేవాన్ని!
అప్పటికీ ఇప్పటికీ నేను ఏకాకి స్వరాన్నే
మొనాటనీ మధురిమకు మొహం మొత్తి
నేనిపుడు
ఏక్ తారను వెదుక్కుంటున్న చరమ చరణాన్ని!
ఏక తారను మోస్తున్న ఆఖరు ఆకాశాన్ని!
నాగరాజు రామస్వామి గారూ,
మీ కవిత చాలా నిగూఢంగా ఉన్న ‘Soli’loquy. కోయిలమీద, పంచకళ్యాణిమీద, పక్షాలమీద చేసిన ఒంటరితనపు చమత్కారం బాగుంది. కాకపోతే కొన్ని అక్షరదోషాలే ఇబ్బంది పెట్టేయి… ఉదా. సోమరి కంటం; పదేసివేల్లు; వాన్ని.
అలాగే, ప్రజాపాట అన్నప్రయోగం… అదేచరణంలో శుద్ధశాస్త్రీయాన్ని అనడంతో కొంచెం ఎబ్బెట్టుగా ఉంది.
అయితే, మీకవిత అంతటికీ హైలైట్ అందులోని ఈ చరణాలు:
“నాకు రెండైనా లేవు వోకల్ కార్డ్స్
ఒక బైనరీ గీతమైనా రాసుకునేవాన్ని!
ఒక డిజిటల్ దృశ్యమైనా పాడుకునేవాన్ని!
అప్పటికీ ఇప్పటికీ నేను ఏకాకి స్వరాన్నే
మొనాటనీ మధురిమకు మొహం మొత్తి
నేనిపుడు
ఏక్ తారను వెదుక్కుంటున్న చరమ చరణాన్ని!
ఏక తారను మోస్తున్న ఆఖరు ఆకాశాన్ని!”…
ఉపమానాలలో సమకాలీనతతోపాటు, మీ కవిత ఆంతర్యాన్ని చెప్పకనే చెబుతున్న ఈ మాటలు రసవత్తరంగా ఉన్నాయి. మనఃపూర్వక అభినందనలు.
అభివాదములతో
ns మూర్తి గారికి నమస్సులు.మీరు సూచించిన పద ప్రయోగాలను దృష్టి లో ఉంచుకొని ముందు ముందు జాగ్రత్త పడుతాను.అయితే కొన్ని అచ్చు తప్పులు పడడానికి నేను వాడిన softwear కు నేనింకా పూర్తిగా అలవడక పోవడమే కారణం. మీ hearty అభినందనలకు నా హృదయ పూర్వక అభివందనాలు.best regards.నాగరాజు రామస్వామి.
okaanoka chintananu kavitveekarinchina theeru adbhutangaa vundi.padaalaku praana pratishta chesaaru.murthi gaarannatlu kavita rasavattaram .
thummuri
Chalaza chaala kruthagyathalu….ramaswamy.n
పోయెం లో పదప్రయోగాలు, వ్యక్తీకరణలు బాగున్నయి. కొత్త ఫీల్ కలిగించింది. కవితాధోరణి అకట్టుకునేవిధంగా వున్నది. సంతోషం.
రామారావు గారికి నమస్సులతో. మీ సహృదయ అభినందనలకు నా నమస్కారాలు.Thanks and Regards.నాగరాజు రామస్వామి.