1
గోలీలాటలు గుర్తున్నాయా! తాటిబుర్రలు గుర్తున్నాయా!
కాలువ ఈతలూ కొండఫలాలూ కోతికొమ్మచ్చులూ
గోటిబిళ్లలూ దాగుడుమూతలూ జెండాపై కపిరాజులూ
కప్పల పెళ్లిళ్లూ వానపాటలూ చలిమంటలూ
జడకుప్పెలూ తొక్కుడుబిళ్లలూ చిలకపచ్చ ఓణీలూ
శ్రీరాముడి పెళ్లిసంబరం ఏసుమఠం తిరునాళ్లూ పీర్లపండగా
ఆవకాయా పెరుగన్నమూ అరిసెలూ పేలపిండీ
ఉగాది పంచాంగమూ దసరా వేషాలూ దీపావళి దివిటీలూ
కాటికాపర్లూ హరిదాసులూ పేడకళ్లాపులూ ముగ్గులూ గొబ్బెమ్మలూ
ఆరు కిలోమీటర్ల దూరాన అక్షరాభ్యాసం చెప్పుల్లేని నడకా
పొలంగట్లూ పోలిగా పాటలూ నారుమళ్లూ వరికళ్లాలూ పత్తికోతలూ
అంతా ఒక సహజాతి సహజ ప్రకృతిసౌందర్య జీవలయ
2
పసిమొగ్గల చుట్టూ పంజరాలు
నిర్దయగా నిద్రను చిదిమేసే గుడ్ -మాణింగ్-లూ గుంజాటనలూ
తప్పనిసరి టాటాలూ బైబైలూ స్కూలుబస్సులో జాలిచూపులూ
పుస్తకాల శిలువలూ గాలిరాని గదులూ మైదానం లేని కార్ఖానాలూ
కూచున్నా నిలుచున్నా పడుకున్నా ఫస్ట్ ర్యాంకే ప్రథమ లక్ష్యం
తాతయ్య నీతికధల ఊసేలేని హోంవర్కుల సుడిగుండాలూ
అడపాదడపా కార్టూన్ నెట్-వర్క్-లూ మధ్య మధ్య లో చోటాభీం సాహసాలూ
ఇప్పుడు బాల్యమంటే కరకు ఆంక్షల కృత్రిమశ్వాస
3
నూనూగు మీసాల నూతన యౌవనాలు
ఊరిగౌరవానికి పట్టం కట్టే పట్టభద్రులూ
అవసరం తలెత్తిన ప్రతిసారీ తలలో పుట్టే నాలుకలు
వాలుజడలూ వయ్యారాలూ బావాబావా పన్నీరు గేయాలూ
వర్షపునీరంత స్వచ్చమైన ప్రేమలూ వాసంతమీరాల జలపాతాలూ
బంధాలకు బహురూపాలూ నిజమైన స్నేహానికి నిర్వచనాలూ
నిన్నటి యవనం ఒక పవిత్ర జీవనది ప్రవాహం
4
బైకులూ నల్లకళ్లద్దాలూ మోకాళ్ల దగ్గర చిరిగిన ప్యాంట్లూ
అత్యాధునికం మాటున ఆవులిస్తున్న ఆహార్యాలూ వాహ్యాళులూ
క్లబ్బులూ పబ్బులూ సినిమాలూ ఫ్యాషన్ షోలూ
ఖరీదైన కళాశాలల్లో ర్యాగింగులూ అధ్యాపకులపై అపహాస్యాలూ
యాసిడ్ దాడులూ లైంగిక దుశ్చర్యలూ వికృత పరాకాష్టలూ
లాభనష్టాల లెక్కింపుస్నేహాలూ హృదయాల మధ్య వంచనాశిల్పాలూ
ప్రేమ వెనక నమ్మకం వెనక కలవడం వెనక సమీకరణాల విశ్లేషణ
టీవీల పాపమెంత? సినిమాల పాతకమెంత? ఇంటర్నెట్ల వికారమెంత?
ఇప్పుడు యవనం ఒక ప్రేరేపిత ఉగ్రవాదం
5
కోడెపొగరు చివర్న కాస్తంత స్థితప్రజ్ఞత
భుజాల మీద అర్రుగాసిన బాధ్యతల భారం
భార్యాపిల్లలూ తల్లిదండ్రులూ అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ
ఉమ్మడి కుటుంబాలూ బాధల భాగహారాలూ ఉజ్వల ఊహాశిల్పాలూ
ఊరుమ్మడి భావిప్రణాళికలూ సమైక్య జీవన ప్రణవనాదాలూ
ఉద్యోగార్ధం తీరాలు దాటినా ఊరితో తెగని పేగుబంధాలూ ప్రేమగీతాలూ
మొన్నటి ప్రౌఢప్రాయం…ప్రాణసమాన ప్రణయకావ్యం
6
నేనెవరు! నాకెవరు! నాకేమిటి! అహం బ్రహ్మస్మి!
విచ్చిన్నమైన వలయాలూ కలలోనైనా కలవని చేతులూ
కరుణ మసిబారిన మనసులూ సన్నాహాలతో మమేకం కాని శరీరాలూ
సాఫ్ట్-వేర్ స్వర్గంలో మట్టిరేణువుల గురించీ మథనమా
డాలర్లవేటలో నేలబారు డగ్గుత్తికల గురించి అవలోకనమా
రాజకీయం రాజ్యం వరకె పరిమితం కాలేదు
ఓట్లు దాటి గేట్లు దాటి అపార్టుమెంట్లు దాటి ఆత్మల్ని చుట్టేసింది
నోట్లపండగలూ బ్యాంకుబ్యాలెన్సులూ డూప్లెక్సులూ
ఇప్పుడు ప్రౌఢత్వానికి పర్యాయపదం….ప్రాణాపాయ హెచ్చరిక
7
గతాన్ని తవ్వినప్పుడు గనులూ ఉంటాయి గాయాలూ ఉంటాయి
స్వీకరణ గురించే సమస్య అంతా
నిన్నమొన్నటిల్లోకి మునుగీతలూ పచ్చదనంలోకి పరకాయప్రవేశాలూ ఏదీ శాశ్వతం కాదు
నిప్పులు కురిసె నియంతృత్వమైనా చీకట్లు చిమ్మే నిశిరాత్రులైనా
వికారం ఎల్లకాలం జుట్టు విరబోసుకుని వికటాట్టహాసం చేయలేదు
ఏకాంతవాసద్వీపాలు ఎప్పటికీ వసుధైక ప్రపంచాన్ని కలగనలేవు
మంటలూ మారణాయుధాలూ మానవీయ ఉనికిని మాయం చేయలేవు
ఎప్పటికైనా భూయవనికపై అజరామరంగా అలరారేవి…
బంగారు బాల్యం! యజ్ఞఫల యౌవనం! ప్రాకృత ప్రౌఢం! బృహత్తర వృద్ధాప్యం!
ఇప్పుడు బాల్యమంటే కరకుఆంక్షల కృత్రిమశ్వాస – ఈ పంక్తిలో కవితాభివ్యక్తి బలంగా, హృద్యంగా
వచ్చింది. బాగుంది.
Dear Elanaaga garu,
Mee nunchi abhinandana andukOvadam chaalaa santhosham. Dhanyavaadaalu.
regards
M.V.Rami Reddy
muvvaramu@gmail.com
+91 9866777870
Very good poem.
Dear Ram Nalla garu,
Thank you very much for your encouragement.
regards
M.V.Rami Reddy
“భూయవనికపై అజరామరంగా” జీవనజగన్నాటకాన్ని ప్రదర్శించిన అద్భుతకవిత!
ఎంవీ రామిరెడ్డిగారిలో ఒక నూతన షేక్స్పియర్ని దర్శింపజేసిన అందమైన కవిత!
~రత్నశిఖామణి
Dear Ratna SikhaamaNi garu,
Mee abhimaanaaniki dhanyavaadaalu. Meeru raasina vaakyamlO “JEEVANAJAGANNATAKAM” anE padam adbhutangaa undi.
regards
M.V.Rami Reddy
muvvaramu@gmail.com
rami reddy garu—sixer sir
excellent one
——————-
buchi reddy gangula
Thank you very much for your positive words Buchi Reddy garu.
regards
M.V.Rami Reddy
muvvaramu@gmail.com
Sir, very very good poem, when I read the poem, I remember my olden days, Once again congrats and best of luck sir.
Balakrishna.chittari
Rami Reddy Garu,
After reading your poem, I went back 30 years and re-collected the childhood days.
Its really excellent!!!!!!!!
Keeping writing………………
Best Wishes
Damodar Reddy
Thank you very much Balakrishna.
regards
M.V.Rami Reddy
Thank you very much Damodar Reddy garu.
regards
M.V.Rami Reddy
Dear Sir,
You made me to recall my childhood memories.
Thanks
Vamsee
జీవనజగన్నాటకాన్ని ప్రదర్శించిన అద్భుతకవిత!
ఎంవీ రామిరెడ్డిగారిలో ఒక నూతన అందమైన కవిత!