మాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొని
గొంతు దాటని స్వరమేదో మూగగా ఆలపిస్తూ..
పారుతున్న నదీ పాయ ఒక్కసారిగా
ఇసుక తిన్నెలోకి జారిపోతూ
అరచేతుల గుండా ప్రవహించిన
విద్యుత్ వేలి చివరనే ఆవిరవుతూ
ఒక్కో క్షణం వానలో తడిసిన
మట్టి గోడలా కరిగిపోతూ..
ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత
నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత
ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు..
ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత/ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత
ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయ త/చాలా బాగుంది మంచి అనుభూతిని మిగిల్చిన కవిత కెక్యుబ్ వర్మగారు…
Thank you Renuka Madam..
అందమైన అక్షరమాల….మీ కవితా హేల
Thank you Padmarpita garu..
baagundi
Thank you Sir..
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత
నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత
ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు..
hrudayaspandaniki tagina askhsara roopam.. chaala baagundi.
Thank you Sairam garu..
chala pedda bharaanni chini maatallo
Thank you Subbalakshmi garu..
ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు.. ee vaakyaalu naaku vipareethangaa nacchaayi….. KOLUVU anadam – kavitha vysaalyaanni choopindi
meeku nachchinanduku dhanyavaadaalandi balasudhakarmouli garu..
వహ్… సలాం సాబ్… ఏక్ దం సూపర్ కవిత…. హత్తుకుంది మనసుని….
రాతి బొమ్మల కొలువు కవిత చదివాక గుండె బరువెక్కింది. అద్భుతమైన వ్యక్తీకరణ.