కళ్ళలో నిలవని దుఃఖం
గుండె దోసిట్లో
శూన్యమైన మనసు మబ్బు
కుండలా నిశ్చలంగా
మౌనపు రంపపు కోతకు
ఎద గురవుతూ
దేహం నిలువెల్లా గుంజకు
కట్టినట్టుగా రెక్కలు తెగిపడి
కలవని కూడలి మధ్య
ఆగిన నడక
తెరమీద నలుపు తెలుపు
అలల నీడలు
ఉగ్గబట్టిన శ్వాస నిట్టూర్పు
ఆఖరి చరణం
దాహపు నది గొంతులో
క్షణ క్షణం ఇగిరిపోతూ
ఇసుక పరచుకున్న రాదారి
మధ్యలో తెగిపడి
అసంపూర్ణ వాక్యాన్నిపద్యం
చేసే విఫలయత్నం…
దాహపు నది గొంతులో
క్షణ క్షణం ఇగిరిపోతూ…… manchi bhaavana
ఎందుకో తెలియదు
మీ దాహపు నదిలో నాకు ఏమాత్రం దాహం తీరలేదు
బహుసా అసంపూర్ణ వాక్యాన్నిపద్యం చేసే విఫలయత్నం చేసానేమో
కలవని కూడలి మధ్య చిక్కుకుని ముందుకు సాగలేక ఆగిపోయానేమో
థాంక్యూ బాలసుధాకర్ మౌలి గారు, వెంకటేశ్వర రావు గారు..