“सजनरॆ झूठ मत बोलॊ, खुदा कॆ पास जाना है
न हाथी हैं न घॊडा हैं, वहां पैदल ही जाना है ”
అంటారు శంకర్ దాస్ కేసరీలాల్. ఆయన కలం పేరే “శైలేంద్ర”.
ఈ పాట, ఇంకా.. “छॊटी सी यॆ दुनियां, पह्चानॆ रास्तॆं हैं, कहीं तॊ मिलॊंगॆ तो पूछॆंगॆ हाल”,
“यॆ मॆरा दीवानापन हैं.. या महॊब्बत का सुरूर”,
“आवारा हूं “,
“मॆरा जूता है जापानी”,
“दीस्त दॊस्त ना रहा प्यार प्यार ना रहा”,
“हर दिल जॊ प्यार करॆगा वो गाना गायॆगा”,
“मुड मुड कॆ ना दॆख मुड मुड कॆ”,
“टूटॆ हुयॆ ख्वाबॊं नॆ हम कॊ यॆ सिखाया हैं..”,
“प्यार हुवा इक्रार हुवा है”,
“आज फिर जीनॆ की तमन्ना है..”,
“गाता रहॆ मॆरा दिल..तु हि मॆरि मंजिल”,
“क्या सॆ क्या हॊ गया बेवफा तॆरॆ प्यार मॆं..” మొదలైన పాపులర్ సాంగ్స్ రాసి, హిందీచిత్రరంగంలో ఒక విలక్షణగీతరచయితగా తనదైన ముద్ర వేసుకున్నారు శైలేంద్ర. శైలేంద్ర రచించిన “अनाड़ी” చిత్రంలోని ఓ గీతాన్ని గురించిన కబుర్లు ఈనాటి చలువపందిరి చెప్తుంది.
శైలేంద్ర, శంకర్-జైకిషన్, రాజ్ కపూర్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో అద్భుతమైన పాటలూ, సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఒక చిత్రం “अनाड़ी (1959)”. అనారీ సినిమాలో మొత్తం ఏడు పాటలు. ఇందులో “బన్ కే పంఛీ గాయే ప్యార్ కా తరానా” పాట తప్ప మిగిలినవన్నీ శైలేంద్ర రాసినవే. ‘దిల్ కీ నజర్ సే’, ‘వో చాంద్ ఖిలా వో తారే హసే’, ‘బన్ కే పంఛీ’ (ఈ పాట ఒక్కటి హస్రత్ జైపురి రాసారు), ‘తేరా జానా’, ’1956, 1957, 1958..’, ‘సబ్ కుచ్ సీఖా హమ్నే’, ‘కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్..’ అన్నీ వేటికవే అన్నట్లుంటాయి. “సబ్ కుచ్ సీఖా హమ్నే నా సీఖీ హోషియారీ” పాటకి సాహిత్యానికి శైలేంద్రకూ, పాడినందుకు ముఖేష్ కూ రెండు ఫిలిం ఫేర్ అవార్డ్ లు వచ్చాయి. ఈ ఏడు పాటల్లో “కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్” పాటను గురించే ప్రస్తుతం నే చెప్పబోయేది..
హృషికేశ్ ముఖర్జీ చేతుల్లోంచి జారిపడ్డ మరొక ఆణిముత్యం “అనాడీ” చిత్రం. చిత్ర కథ అంతా రాజ్ కుమార్ అనే పేద యువకుడి చుట్టూ తిరుగుతుంది. రాజ్ నీతీ,నిజాయితీ గల సీదాసాదా యువకుడు, పేదవాడు. రాజ్ నీతీనిజాయితీల వల్ల అతను ఎలా లాభపడ్డాడు, ఎలా వంచిపబడ్డాడు, ఎలా ఇబ్బందుల పాలైయ్యాడు, తనకెదురైన ఇబ్బందుల్లోంచి చివరికి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ చిత్ర కథ. హృషీదా సినిమాల్లో ప్రధానాంశాలు సామాజిక విషయాలు. ప్రత్యేకత ఏమిటంటే సమకాలీన సమాజంపై వ్యంగ్యాన్ని హాస్యంగా చిత్రికరించడంలో ఆయన దిట్ట. అంతేకాక ప్రధానాంశం ఎక్కడో అక్కడ సంగీతంతో ముడిపడి ఉంటుంది. హృషిదా సినిమాలన్నింటిలో పాటలన్నీ ప్రఖ్యాతి చెందినవే. ఆయన తీసిన ఆనంద్, అనురాధ, అనుపమ, గుడ్డీ, చుప్కె చుప్కె, గోల్ మాల్, నమక్ హరామ్, మిలీ, అభిమాన్ మొదలైన సినిమాలన్నింటిల్లో సంగీతానికీ,పాటలకీ పెద్ద పీట వేసారు హృషీదా.
ఇక ఇవాళ్టి పాట “కిసీ కి ముస్కురాహటోం పే..” విషయానికి వచ్చేస్తే, ఈ పాట సినిమా మొదటిభాగంలో ఉంటుంది. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న రాజ్ కు సహాయం చేయదలచి, ఒక పెద్దింటి పనిమనిషిగా తనని రాజ్ కుమార్ కి పరిచయం చేసుకుంటుంది కథానాయిక ఆరతి. నిజానికి ఆమే యజమాని. ఆ సంగతి తెలియని రాజ్ తనకు ఆమె యజమాని ద్వారా ఇప్పించిన డబ్బులని ఆమెకే తిరిగి ఇచ్చివేస్తాడు, ఇంటికి పంపించుకోమని. తాను ఇబ్బందుల్లో ఉండి కూడా చేతికివచ్చిన డబ్బుని మరొకరికి దానం చేసిన అతని ఔదార్యాన్ని చూసి ఆరతి ముగ్ధురాలౌతుంది. ఆ సందర్భంలో, మరొకరికి సహాయపడ్డాననే ఆనందంతో ఆరతి ఇంటి నుండి బయటకు వెళ్తూ రాజ్ ఈ పాట పాడతాడు. తన గొంతు విషాద గీతాలనే కాదు హుషారైన పాటలనీ పలికించగలదని కూడా నిరూపిస్తాడు ముఖేష్. చాలావరకూ రాజ్ కపూర్ పాత్రలకు అతికినట్లు సరిపోతూండేది కూడా ముఖేష్ గళం. శంకర్-జైకిషన్ అందించిన బాణీ వినేవాళ్ళ హుషారుని పెంచుతుంది.
“జీవితాన్ని ఇలా జీవించాలి, నా దృష్టిలో జీవించడమంటే ఇదే” అంటూ సాగే ఈ పాట చక్కని మానవతా విలువలని గుర్తుచేస్తూ, ఈనాటి సమాజంలో ప్రతివ్యక్తీ ఇటువంటి విలువలను పాటించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజేస్తుంది. తనలాంటి మనసున్న పేదవారందరి తరఫునా పాడుతున్నట్లుగా ఈ గీతాన్ని ఆలపిస్తాడు రాజ్. మరి ఈ పాట వాక్యార్థం చూద్దామా…
పాట వాక్యార్థం:
ప: किसी की मुस्कुराहटों पे हो निसार
किसी का दर्द मिल सके तो ले उधार
किसी के वासते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है..
మరొకరి చిరునవ్వులకై త్యాగం చెయ్యగలగడం
మరొకరి బాధని వీలైతే పంచుకోగలగడం
మరొకరి కోసమై మనసులో ప్రేమను నింపుకోవడం
జీవించడమంటే ఇదేమరి..
1చ: माना अपनी जेब से फ़कीर हैं
फिर भी यारों दिल के हम अमीर हैं
జేబు చూస్తే బికారులమే అయ్యుండచ్చు
అయినా మిత్రులారా, మనసున్న సంపన్నులం మేము
मिटे जो प्यार के लिए वो ज़िन्दगी
जले बहार के लिए वो ज़िन्दगी
ప్రేమ కోసం బలైపోవడమే జీవితమంటే
వసంతం కోసం జ్వలింస్తూండేదే జీవితమంటే
किसी को हो ना हो हमें तो ऐतबार
जीना इसी का नाम है..
ఎవరికున్నా లేకున్నా, నాకు నమ్మకమే
జీవించడమంటే ఇదేనని..
2చ: रिश्ता दिल से दिल के एतबार का
जिंदा है हमीं से नाम प्यार का
మనసుకీ మనసులోని నమ్మకానికీ మధ్య బంధం,
ప్రేమనే మాట సజీవంగా ఉన్నది మావల్లనే
के मर के भी किसी को याद आयेंगे
किसी के आंसुओं में मुस्कुराएंगे
మరణించినా ఒకరి జ్ఞాపకాల్లో జీవిస్తాం
ఒకరి కన్నీళ్లలో చిరునవ్వుగా మిగిలిపోతాం
कहेगा फूल हर कली से बार-बार
जीना इसी का नाम है..
పువ్వు ప్రతి మొగ్గతో పదే పదే చెప్తూనే ఉంటుంది
జీవించడమంటే ఇదేనని..
ఈ పాటను ఇక్కడ చూడవచ్చు: http://www.youtube.com/watch?v=gS6HA2_wrrE
ప్రేమ కోసం బలైపోవడమే జీవితమంటే
వసంతం కోసం జ్వలింస్తూండేదే జీవితమంటే
..baaagumdamDi! chakkani anuvaadam!
@ఆర్.దమయంతి: ధన్యవాదాలు దమయంతిగారూ.
‘మరణించినా ఒకరి జ్ఞాపకాల్లో జీవిస్తాం
ఒకరి కన్నీళ్లలో చిరునవ్వుగా మిగిలిపోతాం”
అద్భుతమండీ,ఇంత గొప్పగా రాయడ ఆయనకే చెల్లిందండీ.మరొక్క మంచి పాట పరిచయం చేసారు ధన్యవాదాలు తృష్ణగారూ
@పప్పుగారూ,అవునండి. మానవతా విలువల గురించి ఎన్నో చక్కని గీతాలని శైలేంద్ర మనకి అందించారు.
ధన్యవాదాలు.