నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు
గాలి నిన్ను కూచోనివ్వదు
నీ అరచేతులు చాలనప్పుడు లోలోన
దిగాలు ఒక్కసారిగా అసహనంగా
ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం
నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
భయ దృశ్యం అల్లుకుంటూ
నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా
అల్లుకుంటూ అచేతనంగా
ఈ కాంతి రేఖల రాక పోకల
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు
చిక్కనవుతున్న చీకటి పాట
గాలి అలలనలా కోస్తూ
అచేతనంగా అభావమౌతున్న
రూపం ధూప కలికమవుతూ
నీ ఒక్కడివే ఈ గదిలో
ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ…
super
Thank you Rajasekhar gaaru..
దీపాల పండగనాటికి సందర్భోచితంగా రాసి దాంట్లో మీ దైన పధ్ధతిలొ దు:ఖపు నీడలని ఇమడ్చటం కవితా సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేసింది. అభినందనలు వర్మగారూ
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు వాసుదేవ్ గారు..
మీ పదాల కాంతి రేఖలు….వెలుగులు విరజిమ్ముతున్నాయి…
U r not only a man of success…but a man of value…
U deserve these words sir….
ధన్యవాదాలండీ..
మంచి పద్యం చక్కటి నిర్మాణం – బాగుంది వర్మా!
మీ మాట స్ఫూర్తినిస్తుంది నారాయణస్వామి సార్.. ధన్యవాదాలు..
నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా
అల్లుకుంటూ అచేతనంగా
ఈ కాంతి రేఖల రాక పోకల
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు…
వర్మ గారికి: మరొక మంచి కవిత మీ నుంచి రావడం సంతోషంగా వుంది. మీరు చూపిస్తున్న పరిణతి ఎంతో బాగుంది. ఆ పైన పేర్కొన్న నాలుగు లైన్లు నాకు నచ్చాయి.
Thank you Ravikiran gaaru..
నిజంగా ప్రమిదని అందులో వెలిగే దీపపు రేఖని ఇంకో కోణం నుండి చూపెట్టారు…Beautiful
ధన్యవాదాలు మోహన తులసి గారు..