కవిత్వం

నేల దిగే నక్షత్రం!

15-నవంబర్-2013

ఆమె ఆకుపచ్చ గీతమై
అడవి గుండెల్లో ఒదుగుదామనుకుంది.

వాన చినుకులా
సముద్రమంత ప్రేమలో కరుగుదామనుకుంది.

ఆకాశమై అతను కవ్విస్తే
చుక్కలా చెక్కిలిని ముద్దాడుదామనుకుంది.

అతడు

అడవి కాడు
వసంతం.

సముద్రమూ కాదు
ప్రవాహం.

ఆకాశమైనా అయి ఉంటే
నక్షత్రమై నేల రాలేది కాదేమో!