కవిత్వం

దహనం

డిసెంబర్ 2013

1
పరిచయం కాని, ఒక సమయం కోసం,
కలలకనడానికి చాలా కాలంముందటే,.
ఒకానొక ఆదిమ అవలక్షణం,.
చిగురులేయడం మొదలుపెట్టినట్లుంది.

2
ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ పోతున్నప్పుడు,
ఎవరో నన్ను, తడుతున్నట్లు,తడుముతున్నట్లు
ఎడతెగని అనుభూతి అవస్థ
ఎక్కడెక్కడినుంచో చీల్చుకొస్తూ,.

3
దృశ్యాలు,దృశ్యాలు విడిపోతున్న జీవితాన్ని,
అక్షరాలతో కుడుతున్నకొద్ది,
చిరుగు పెరిగి, చిరాకు పుడుతున్నట్లు,
పూర్తిగా ఓ లోయై కూరుకుపోతున్నట్లు.

4
నిజానికిది సందర్బం కాదు,
అక్షరాలకో, వాక్యాలకో, రాత్రులకో
అలా, అంకితమైపోవడానికి.
కాని ఎందుకో వాటికోసమే,
సమయం కాలిపోతుంటుంది, ఇలా కాలుస్తూ.