ప్రపంచం తలుపులన్నీ తెరిచే ఉన్నాయి
నువ్వు కొన్ని తెరిచుంటావు
నేను కొన్ని తెరిచాను
మనిద్దరం కలిసి ఎన్ని తెరిచామో
తతిమావి ఎవరెవరు తెరిచారో
ఎవరు తెరిస్తేనేం
ఆలోచనల తాజాదనాన్ని నింపుతూ
రేపటి కిటికీలను తెరుస్తూ
సందేహాల గాలికవి
కొట్టుకుంటూనే ఉన్నాయి
నీలోను
నాలోను
సందేహాల గాలికవి
కొట్టుకుంటూనే ఉన్నాయి
నీలోను
నాలోను…
- సందేహంలో వున్న బాధని చెప్పకుండా భలే దాటేసారు కదా మీరు?!
Nice poem sir!
very nice poem having deep depth