సదువు సంధ్యల నుంచి
కాలీ దొరికినప్పుడల్లా
పారాగాన్ చెప్పులు ఇంటిదగ్గరే వదిలేసి
పొలం గట్ల నడిచినంతసేపూ
నన్నెవరో స్పర్శిస్తున్నట్టే ఉండేది
కొబ్బరి తాడి చెట్ల తలల మీదనుంచి
నేరేడు బాదం చెట్ల గుబురులోంచి
మావిడి తోటంతా చుట్టోచ్చి కూడా
సజీవంగానే సహజంగానే పలకరిస్తుండేది పైరుగాలి
కీటకాలని లార్వాలని చంపడంకోసం
నాటిన బంతిపూల మొక్కలు
పెంచిన ఆముదం చెట్లు
స్వచ్చంగానే సహజంగానే ప్రవర్తిస్తుండేవి
ఒకపక్క పొలంలో మేస్తున్న గేదెలు
మరోపక్క ధాన్యం రాశి పట్టడం చూస్తుంటే
తాతయ్యని చూస్తునట్టే ఉంది
ఈయన వ్యవసాయం చేసినంత కాలం
చిన్ని కృష్టుడికి వెన్న తినిపిస్తునట్టే
ముసలి ఎద్దుకి ఎప్పుడు దాహమేస్తుందో
పెయ్య దూడకి ఎప్పుడు ఆకలేస్తుందో
ముసలాయనకి ఏలా తెలిసేదో గానీ
ఒక్క రోజూ కొనుగోలుకి కటికోడు ఆ పాక దగ్గరికి రాలేదు
అక్కడే పుట్టిన ఆఖరి గేదె కాలం చేసి
కొన్నాళ్ళకి కాళీ ఐ కూలబడ్డ దూళ్ళపాక
పక్క నుంచి ఇంటికి నడుస్తూ తాతయ్య
ఆఖరి శ్వాస విడవటం సహజమే కదా!
సహజంగా మరణించడమంటే
సహజంగా జీవించామనడానికి సాక్ష్యమే కదా!
కవిత చాలా బాగుంది వర్మ.నీలోని పరిణామ క్రమంకు ఈ కవిత నిదర్శనం(keep it up
ధన్యవాదాలు రాజారాం గారు మీ సలహాలు సూచనలు మరిన్ని అవసరం నాకు ధన్యవాదాలు.
చాలా సహజంగా రాశారు వర్మ గారు … మంచి కవితలు ప్రచురిస్తున్నందుకు వాకిలి సంపాదకులకు ధన్యవాదాలు
ధన్యవాదాలు కాశీ గారు సహజంగా మన స్నేహం మన జీవనం వర్ధిల్లాలని కోరుకుంటూ..మీ వర్మ.
కవిత బావుంది వర్మ గారు.
ధన్యవాదాలు సోదరా మీవంటి సహృదయులతో మిత్రత్వమే నన్నిక్కడి వరకూ తీసుకువచ్చింది.
నాలాంటి కొత్త చిన్న కవులను కూడా ప్రొత్సహిస్తున్న వాకిలి సంపాదక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు
Your mark varma gaaru.excellent.
ధన్యవాదాలు తిలక్ గారు
చదువుతుంటే మానాన్నగారు కనులముందు మెదిలారు.
సహజంగా మరణించడమంటే
సహజంగా జీవించామనడానికి సాక్ష్యమే కదా! ముగింపు అద్భుతంగా వుంది సార్.. అభినందనలు..
ధన్యవాదాలు కెకూబ్ వర్మ గారూ …. ఇది మీ తోలి అభినందన చాలా ఆనందంగా ఉంది