1
Jack Kerouac నన్ను వెంటాడే అమెరికన్ కవి. వచన రచయిత.
ఆ పేరు వినగానే అతనంటే వొక్కో సారి కేవలం కవి కాదనిపిస్తుంది నాకు. కవిత్వం రాసినా, వొట్టి వచనమే రాసినా, అతని వాక్యాల కింద వుండే చలనం వొక తాత్విక సారంగా ప్రవహిస్తుంది.
మొదట్లో కొంతకాలం ఆవేశంగా రాస్తాం కవిత్వం. అప్పుడు ఉద్వేగం ఉప్పెనై ముంచెత్తుతుంది. రాయకపోతే వొక రకమయిన వొంటరితనం బాధిస్తుంది. నిజమే! కానీ, ఆ ఆవేశం యెప్పుడో వొకప్పుడు ఆరిపోతుంది. ఆరిపోయిన తరవాత మనలోపలి నిప్పు కణమేదో రాలిపోయినట్టే వుంటుంది. వొక రాయలేనితనం లోపల గుబులు పుట్టిస్తుంది. Kerouac అలాంటి అనుభవాలెన్నో చూశాడు, అనుభవించాడు. అలాంటి సమయంలో అతనిలోపల చెలరేగే అలజడి –పులిపాటి గురుస్వామి వొక కవితలో చెప్పినట్టు- ‘కుతకుత వుడికే ఆ సముద్రం’ – అతన్ని చుట్టుముట్టేస్తుంది. అతనప్పుడు మన గురుస్వామిలాగే కచ్చితంగా ఇలా అనుకునే వుంటాడు:
సమాధానమొక సముద్రం లోపలి
అలజడే అయితే
లోలోపల కుతకుత లాడటమే
విస్ఫోటనం కంటే మేలు –
అలాంటి వొక స్థితిలో Kerouac ని ఎడ్ వైట్ అనే చిత్రకారుడు, స్నేహితుడూ తన స్కెచ్ బుక్ చూపించి, అడిగాడట – “why don’t you sketch in the street like a painter, but with words? – అని.
Sketching- ఆ ఆలోచన బావుంది కదా అనుకున్నాడు Kerouac. తన లోపల ఉడికిపోతున్న సముద్రానికి వొక భాష దొరికిందనిపించింది. ఆ స్థితిలో అతని తక్షణ వాక్యం: “నా లోపలి సంగీతం మేలుకుంది.”
అతనంటాడొక చోట: the sound in your mind/is the first sound/that you could sing.
మామూలుగా ప్రతి కవీ తను రాసిన వాక్యాల్ని వొకటికి పది సార్లు చెక్కుకుంటాడు. భావం పలికే దాకా వాక్యాల్ని తిరగరాస్తాడు. అలాంటి దశలో అతను కాసేపు కవి అనే స్థానం నించి పక్కకి తొలగి, పాఠకుడై, తనని తాని చదువుకుంటాడు. తన వాక్యాలలో తన ప్రతిబింబాన్ని తరచి చూసుకుంటాడు. తన భావనల ప్రభావాన్ని పరీక్షించి చూసుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళి తానే ఎడిటర్ అయి, వాటికి post-mortem చేసుకుంటాడు. మంచి కవిత తయారవడానికి ఇవన్నీ అవసరమే! కానీ, కొన్ని వేళల్లో జీవితం అనుకూలించదు. కవిత్వ రూపం విసుగు పుట్టిస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాడు కవి? తన పదాల్ని కూడదీసుకుంటాడు. తన భావాన్ని పరిమితమయిన/ తేలికపాటి రేఖల్లో వెతుక్కుంటాడు.
అలాంటి స్థితిని Sketching అని పిలిచాడు Kerouac. అలా వొక మెరుపు లాంటి ఆలోచన తరవాత్తరవాత -Joyce Johnson అనే సాహిత్య చరిత్రకారిణి చెప్పినట్టు- “a whole new movement of American literature (spontaneous prose and poetry)” అవుతుందని అతను వూహించనే లేదు. కానీ, వూహించనివి జరగడం వల్లనే కదా చరిత్రకయినా, జీవితానికయినా అంత అందం! అలాంటప్పుడు ఇలా కూడా అనిపిస్తుంది. మళ్ళీ గురుస్వామి మాటల్లోనే:
బహుళ ప్రేమల్లో
కలకలల వెలుగుల్లో
మెదలక పోతేనేమి?
అక్షరాల వెంట
చలనం ఉంటుంది
అది నీ ఆత్మ సారమే.
ఇటీవలి తెలుగు కవిత్వం చదువుతున్నప్పుడు మనం అలాంటి ఆకస్మిక క్షణాల spontaneous movement కి చేరువలో వున్నామని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న కవిత్వ వాక్యాలలోని spontaneity నన్ను కాసేపు ఆశ్చర్యంలో పడేస్తుంది. ఈ spontaneity లోని అక్షరాల వెంట – ఆత్మ సారం – వినిపిస్తుందా అని వొకింత సందేహంగా వున్నా, ఈ స్వరాల్లో వొక నమ్మకమేదో నన్ను ఆ సందేహాల్ని గడ్డిపోచల్లా అవతలకి విసిరెయ్యమంటోంది.
2
Sketching, spontaneity – ఈ రెండు భావనలకి ఇంకా కొన్ని విశేషణాలు జోడిస్తే, ఇవి సంకేతాల వంటి రేఖలు, మనసులోంచి పెల్లుబికిన సహజ వెల్లువ.
ఇప్పుడు వస్తున్న కొత్త కవిత్వానికి కొన్ని ఆనవాళ్ళు చెప్పమని ఎవరైనా అడిగితే నా మటుకు నాకు వెంటనే తట్టే రెండు లక్షణాలు ఇవి. ఈ రెండు మరీ కొత్త లక్షణాలా అంటే కాకపోవచ్చు. కానీ, ఎప్పుడూ పూర్తి కొత్తదనం అనేది వుండదన్నది నిజం. పాతలోంచి ఎంతో కొంత మనం అనుకునే కొత్తదనంలోకి తప్పక ప్రవహిస్తుంది.
ముందు ఈ spontaneity సంగతి చూద్దాం. చాలా కారణాల వల్ల తెలుగు కవిత్వం వొక అసహజమయిన “వృత్తి”గా మారింది. ముఖ్యంగా కవిత్వంలో భాష ఎలాంటి పని చేయాలన్న విషయం మీద మనకి కొన్ని అసహజమయిన భావనలు పేరుకుపోయాయి. అందులో వొకటి: కవిత్వ భాష అత్యంత గంభీరంగా వుండాలన్న భావన. కవిత్వపు తొలి మజిలీలో వున్న కవులు అనివార్యంగా ఈ భాషా బంధనాల్లో ఇరుక్కుపోయారు. మౌలికంగా బరువయిన పదాల సమూహమే కవిత్వ వాక్యం అనుకునే దాకా వెళ్లారు.
దీనికి భిన్నంగా, కవిత్వంలో శబ్దం కంటే నిశ్శబ్దం చేసే పనే ఎక్కువగా వుంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే కొందరయినా గ్రహిస్తున్నారన్న నమ్మకం కలుగుతోంది – ఈ మధ్య కనీసం పది పదిహేను మంది కొత్త తరం కవుల్ని చదువుతున్నప్పుడు! ఆ పదిహేను మంది గురించి తరవాత మాట్లాడతాను. ముఖ్యంగా ఇప్పుడు కెక్యూబ్ వర్మ, వంశీధర్ లాంటి కవుల కవితల్లో కనిపిస్తున్న Sketching, spontaneity అనే రెండు లక్షణాల గురించి మాట్లాడ్తాను ఈ సారి.
కుమార్ వర్మ (కెక్యూబ్ వర్మ) కవిత్వం కనీసం మూడేళ్ళ నించి చదువుతున్నా. ఈ మూడేళ్లలో వర్మ కవిత్వం చాలా మారింది. ముఖ్యంగా మొదట్లో అతని కవిత్వం కొంచెం గరుకుగా వుండేది. వొక విధమయిన భావజాలం పునాదిగా పెరిగిన తరంలో ఆ గరుకుతనం కొంత తప్పదు. చాలా తక్కువ మంది కవులు ఆ గరుకు పదాల బారి నించి తప్పించుకోగలిగారు. వర్మ చాలా విజయవంతంగా ఆ అడ్డంకిని దాటుకుంటూ తన వాక్యాలకు వొక కొత్త సునిశితత్వాన్ని నేర్పాడు. ఉదాహరణకి వేరే ఎన్నో కవితలు చూపించవచ్చు. కానీ, ఇప్పుడు మాత్రం ‘గాలి గోపురం’ కవిత తీసుకుంటా.
ఓ చిన్న పొరపాటో తడబాటో
ముక్కలై గుచ్చుకుంటుంది….
తీరం చేరనీయని
ఆవేదన మిగులుతుంది….
ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను సృష్టిస్తుంది….
నిలిచిన గాలి గోపురం
ఒక్కసారిగా ఒరిగి పోతుంది….
దిగులుతనం దీపపు సమ్మె క్రింద
నీడలా మిగులుతుంది….
కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది….
చినిగిన తెరచాపను అంటిన
కలల రెపరెపల రంగుల కాగితం…
ఎద తడపని వాన చినుకు
ఇగిరి పోయి బీడవుతుంది….
మళ్ళీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది నేస్తం…
ఈ కవితలో భావాన్ని గురించి నేనేమీ విడమరచి చెప్పక్కర్లేదు. వొక బరువయిన భావానికి అతి తేలికయిన స్కెచ్ గీస్తున్నాడు వర్మ. నాకు బాగా నచ్చిందేమిటంటే ముందుగా: ఎక్కడా భావ గాంభీర్యాన్ని భాషా గాంభీర్యంగా మార్చకపోవడం; తరవాత: ‘అలా’, ‘ఇలా’ అని బోలెడు ‘లా’లు పోలికలూ లేకుండా సూటిగా చెప్పడం. ఈ కవితని ఎంత పొడిగించినా ఎంతో కొంత అదనపు అందాన్ని, భారాన్ని సంతరించుకునే అవకాశం వుంది. కానీ, ఉద్దేశపూర్వకంగానే ఆ మాయకి దూరంగా రాయగలగడం వర్మ సాధించిన శిల్ప విజయం.
ఇదే వరసలో ఇంకా కొంచెం ధైర్యంగా నిలబడ్తాడు వంశీధర్. వంశీ కవిత్వం వొక షాక్ ట్రీట్మెంట్. కవిత్వ పరంగా ఎలాంటి మొహమాటాలూ లేవు తనకి- తను రాయాలనుకున్నది ఎట్లా అయినా సరే రాసేస్తాడు. తను రాయాలనుకున్నదే రాస్తాడు ఎవరెన్ని చెప్పినా! మనసుని disturb చేసే వొక అందమయిన నిట్టూర్పు వుంటుంది అతని వాక్యాల్లో! అదే వొక అనూహ్యమయిన spontaneity కి దారి తీస్తుంది. వొక మంచి స్నేహితుడు మన ముందు కూర్చొని మన మనసు లోతులు తరచి చూస్తూ మాట్లాడుతున్నంత సహజంగా వుంటాయి వంశీ ఆలోచనలు. అతనివి నిజానికి ప్రతి కవితా ఇక్కడ కోట్ చేయాల్సిందే కానీ, ఈ వొక్క ఉదాహరణ చూడండి.
తనే, నిజంగా, తనే..నా…
ఎనిమిదేళ్ళ క్రితం వొదిలి పోయిన
మంచువర్షం తిరిగి కురుస్తూ,
మంచిముత్యం మరల మెరుస్తూ,
ప్రేమలన్నింటికీ పెళ్ళవదు, అలాగే,
అన్ని పెళ్ళిళ్ళూ ప్రేమల్ని మరిపించలేవేమో,
“ఎలా ఉన్నావ్, పిల్లలూ? ఆయన?”
ఇలాంట్రోజొకటొస్తే చావాలనుకున్నా, కానీ,
తన్తో మాట్లాడాకా బ్రతకాలన్పిస్తూ,
దిగులు మొహంతో, వొణికే వేళ్ళతో,
నిన్నటి నా దేవత, శవంలా నేడు
-”బావున్నాను, పిల్లల్లేరు”
కాల్చిన గాయాల చేతిని చీరతో కప్పేస్తూ,
కూలిన ఆశల చెట్టుని, రాని నవ్వుతో, చిగురించేందుక్కష్టపడ్తూ,
నిజమేనా అన్న నా చూపుకి,
నిజంచెప్పాలనుకుంటూ,
-”వాడో శాడిశ్ట్, ఇంపొటెంట్,
పరిస్థితులకు భయపడి నిన్నొదులుకున్నందుకు…..”
ఎప్పుడూ ఏడవన్నన్నేడిపిస్తూ,
కురిసిన తన కళ్ళు,
-”చేసిన తప్పుకు, నన్ను చూడలేక,
జారిన నా కలల్ని తిరిగివ్వలేక,
అమ్మ, నాన్న, కాలంతో ఓడి పో..యా..రు..
నాకంటూ మిగిలింది నా నీడ, నాటి నువ్వు,
ఇన్నాళ్ళకు రాగలిగాను బంధాల బందీలోంచి,
నిన్ను నమ్మించాలని కాదు, నిజం నమ్ము,”
నల్లకోటు లేని న్యాయంలా నా తను,
“నాన్నా” పరిగెత్తుకొస్తూ, నాలుగేళ్ళ నా కూతురు
అమ్మ దగ్గరికెపుడు తీస్కెళ్తావ్ అన్నన్నడుగుతూ,
ఆశ్చర్యంగా, ఏమైందని కళ్ళతో అడుగుతున్న “తన”కి,
చూపులాకాశానికి చేర్చి బదులిస్తూ,
అదిగోరా అమ్మ అంటూ , “తన”ని చూపించిన్నేను..,
పాపని హత్తుకుని వెచ్చగా విచ్చుకున్న తన నవ్వు,
పాప బుగ్గ మీదుగా నా నుదుటిని తాకి వేడి చెమ్మ మిగిల్చి…
రాదనుకున్న వసంతం వరించినట్టు,
లేదనుకున్న సమస్తం స్వాగతించినట్టు…
ఈ కవితలో భావం స్పష్టమే. కానీ, ఈ కవిత నిర్మాణంలోకి వొక సారి చూడండి. అతి క్లిష్టమయిన విరోధాభాసని (paradox) చూపిస్తూ ఈ కవితలో వంశీ ప్రతి వాక్యాన్నీ వొక అనూహ్యమయిన కథనశక్తితో నిలబెట్టాడు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా పుడ్తుందన్న విస్మయం కలిగించేలా భాషకీ, భావానికీ మధ్య లంగరేశాడు. మొదటి కవితలో వర్మ పదునయిన వాక్యాలతో సాధించిన శక్తిని, ఈ కవితలో వొక కథ ద్వారా, సంభాషణ ద్వారా సాధిచాడు వంశీ.
ఇద్దరు సన్నిహితుల మధ్యా జరిగే సంభాషణల్లో కొంత వచనమూ, కొంత కవిత్వమూ కలిసి వుంటాయి. ఉద్వేగంతో సాగే వాక్యాల్లో తెలియని వొక లోతు వుంటుంది. అలాంటి సంభాషణని ఆసరా తీసుకుని, అసలు కవిత్వ వాక్యాన్ని కొత్తగా వూహిస్తాడు వంశీ. భావాన్ని ఎటు నించి నరుక్కు వస్తాడో తెలియనివ్వని వొక ఉత్కంఠని సృష్టిస్తాడు. ఆ కథనాత్మక ఉత్కంఠలోనే అతని కవిత్వ రహస్యం వుంది.
ఇలాంటి కవితల్ని వర్ణనలూ, అలంకారాలూ పెట్టి ఎంత దూరమయినా సాగదీయవచ్చు. కానీ, ఈ ఇద్దరు కవులూ అలా చేయలేదు. వాటిని అంత సాగదీయలేదు. కొద్ది పదాలలో లోతయిన భావాల స్కెచ్ గీశారు. ఆ స్కెచ్ లోనే అనేక వర్ణాల అనుభవ చాయల్ని చూపించారు.
3
పైన నేను చెప్పిన రెండు లక్షణాలు- Sketching, spontaneity- కవిత్వంలో సాధించడానికి జీవితాన్ని దగ్గిరగా చదవగలిగే సహనం వుండాలి. వొక తాజా కంటితో వాస్తవికతని చూసే ధైర్యమూ వుండాలి. అన్నిటికంటే ముందు, క్లిష్టమయిన భాష పట్ల వుండే విపరీతమయిన ఆకర్షణ తొలగిపోవాలి. లేకపోతే, రెండో వాక్యం పుట్టే లోగా మొదటి వాక్యం జారుకుంటుంది. వొక భావం చెప్పేలోగా ఇంకో భావం దారి తప్పుతుంది.
ప్రతి కవీ మనకి వొక శిల్ప రహస్యం చెప్తాడు,ఆ వాక్యాల వెంట నడిచే తీరిక మనకి వుంటే!
ఇతరుల అనుభవాల నించి నేర్చుకునే నిర్మలమయిన మనసు కవికి చాలా అవసరం. వాళ్ళ బలాల్నీ, బలహీనతల్నీ సమానంగా ప్రేమించే సమహృదయమూ అవసరం. ఎందుకంటే, మన అనుభవాల్లో ఎన్ని నిజంగా కవితలుగా మార్చగలమో గ్యారంటీగా చెప్పలేం. కొన్ని అనుభవాలు అవ్యక్తంగానే మిగిలిపోవచ్చు. కొన్ని వ్యక్తమయినా సంతృప్తి మిగలకపోవచ్చు. అన్నిటికీ మించి, మనసులోని ప్రతీదీ వాక్యం చేయడానికి జీవితం వొప్పుకోకపోవచ్చు. జీవితంలోకి వెళ్ళే కొద్దీ మనం ముడుచుకుపోతాం. అనుభవాలు కొన్ని తలుపుల్ని మూసేస్తాయి. బంధాలు కొన్ని భావాల్ని బంధించేస్తాయి. వాస్తవం విపరీతంగా బాధిస్తుంది. అప్పుడు కవి చేయగలిగింది వొక స్కెచ్ గీసుకోవడం! మొత్తం అనుభవంలోని సాంద్రతని వ్యక్తం చేయలేని నిస్సహాయత్వంలో రేఖామాత్రంగా ఆ అనుభవం చెప్పడం! అదే స్కెచింగ్ అని నేను అంటున్నాను.
అటు వంశీ గానీ, ఇటు వర్మ గాని ఇన్ని అరుదయిన వాక్యాల సమూహంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారంటే దానికి కారణం- ఆ ఇద్దరూ అటు జీవితాన్ని, ఇటు సాహిత్యాన్ని సహనంగా చదువుతున్నారు కనుకనే!
(వచ్చే “ఆనవాలు” – Abstract ని concrete చేస్తున్న ఆ ముగ్గురు కవయిత్రులు!)
ఇసక మీద స్కెచ్ బావుంది. చేరా గారిలా యువకవుల భాషతోపాటు కవితా నిర్మాణ పద్దతులు కృత్యాద్యవస్తలు మధ్యలో ప్రావాహం ఆగిపోతే పడే బాధలూ లోతుగా చెప్పారు అఫ్సర్.
Afsar sir gari vishleshanaku nochukunna kavitalu aa right ni sampaadinchaayi. Afsar garu cheppevidaanam enta sunnitam untundo anta sootigaanoo untundi. Meraj Fathima.
ఫాతిమా గారూ, షుక్రియా. సున్నితత్వం వున్న చోటే సూటిదనం వుంటుంది. కాదంటారా?
వసీరా బాబాయ్! నిన్ను మెప్పించిన ఈ రోజు నాకు భలే రోజు! చేరాగారంత దృశ్యము నాకు లేదు గాని, నాకు తెలిసినంతలో, అర్థమయినంతలో కొత్త తరం కవిత్వం గురించి మాట్లాడాలని వొక తపన. అంతే! ఎప్పటికప్పుడు చదివి కాస్త మొట్టికాయలు వేస్తూ వుండు!
అఫ్సర్,
కవితావేశం, తొలిరోజుల్లో కొండవాలునుండి జారే జలపాతంలాగ ఉన్నా, కొంతసేపటికి మైదానానికి చేరిన సెలయేటిలా మారక తప్పదు. అప్పుడు ఆ ఉద్ధృతి ఉండదు, తడబాటూ ఉండదు. నడకలో ఒక రకమైన ఠీవి,ఒక ప్రశాంతతా ఏర్పడతాయి.అందుకే ఏకబిగిని కవిత్వం వ్రాసే స్థితినుండి, కవిత్వాన్ని sketches (పాయలు పాయలుగా అనుకోవచ్చు)గా రాసుకునే స్థితి ప్రతి కవికీ వస్తుంది (ఆ మాటకొస్తే ప్రతి కళాకారుడికీ). అది ఒక లోపమూ, గుణమూ కూడా. ఈ విషయాలలో మీతో ఏకీభవిస్తున్నా.
“కవిత్వపు తొలి మజిలీలో వున్న కవులు అనివార్యంగా ఈ భాషా బంధనాల్లో ఇరుక్కుపోయారు. మౌలికంగా బరువయిన పదాల సమూహమే కవిత్వ వాక్యం అనుకునే దాకా వెళ్లారు.”
ఇందులో మీ పరిశీలనతో విభేదం లేకపోయినా, మీ interpretationతో ఏకీభవించలేక పోతున్నాను. ఎందుకంటే,ఇప్పటి సాహిత్యకారులకి భాషమీద ఉన్న సాధికారతకీ, అప్పటివాళ్ళకి భాషమీద ఉన్న సాధికారతకీ బాగా తేడా ఉంది. ఇక్కడ భాషా బంధనాలు లేకపోవడం, భాషమీద పట్టులేకపోవడం వల్ల వచ్చిన పరిణామమే కాని, భాషతెలిసి ఏ శ్రీశ్రీ లానో, ఏ తిలక్ లానో, కాన్షస్ గా సరళభాషలో వ్రాయడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. (ఇది ఒక రకంగా చెప్పాలంటే నేరారోపణే. శిక్షకి సిద్ధపడే ఈ మాట అంటున్నాను.)కనుక ఇప్పటి కవిత్వ భాష సరళంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అది ఒక అనివార్య పర్యవసానం. సమకాలీన అవగాహన, అంగీకారాలమేరకు సరళభాషే కవిత్వ భాష. ఒకప్పుడు అలాగ కాదు.కవులు కొంత భాషా,వ్యాకరణ పరిశ్రమ చేసిన తర్వాతగాని కవితావ్యవసాయం ఊసెత్తలేదు. దానివల్ల కవిత్వం జనసామాన్యానికి అందుబాటులో లేనితనాన్ని అనుభవించారు. అది తెలిసి, ఎరుకతో చేసిన పని. భాషాపరంగా సామన్యులకి అందుబాటులో ఉన్నా, కవిత్వం ఇప్పటికీ ఇంకా కవులచే, కవులకొరకు వ్రాయబడుతున్నది అనడం సత్యదూరం కాదు.
“కవిత్వంలో శబ్దం కంటే నిశ్శబ్దం చేసే పనే ఎక్కువగా వుంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే కొందరయినా గ్రహిస్తున్నారన్న నమ్మకం కలుగుతోంది “…
దీన్ని మీరు కవితాత్మకంగా చెప్పారని భావిస్తున్నాను తప్ప నేను Literal sense లో అన్నారని తీసుకోవడం లేదు. ధ్వని అన్న భావనలో నిశ్సబ్దం ఎక్కువ చెబుతుంది … అది ధ్వనికీ ప్రతిధ్వనికీ మధ్య ఉండే అంతరకాలంలో ఉండే నిశ్శబ్దం అని నా భావన. ఇది కేవలం విమర్శకులు తమ వ్యాఖ్యానలను సమర్థించుకుందికి వాడుకునే ఒక సాధనం. నాటకం లేదా రూపకంలో ఈ నిశ్శబ్దం ఖచ్చితంగా రసోత్పత్తికి దోహదం చేస్తుంది. కవిత్వంలో నిశ్శబ్దం (THE UNSAID), కొద్దిమంది Dramatic poems రాయగలిగే Robert Browning లాంటి ఏ కొందరికో తప్ప అందరికీ వర్తించదని నా అభిప్రాయం. అందుకనే మీ నిశ్శబ్దాన్ని ధ్వని అని అన్వయించుకుంటున్నాను. కనుక అదికూడా కొత్తదేం కాదు.
sketching అన్నది కవిత్వానికి కొత్త కాదు. ఒకప్పటి ఉపమాలంకారాన్ని, ఆధునిక కవిత్వంలో రూపకాలంకారం పక్కకి నెట్టేసినట్టు, ఒకప్పటి నైసర్గిక వస్తువుల తో చేసే స్కెచింగ్ ని, నేడు సమాంతర ప్రతీకలతో చేస్తున్నారు. అంతే తేడా. ఆయితే, ఆ ప్రతీకలను ఎన్నుకోవడంలోనే వ్యక్తిగత ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు ఉదాహరించిన డా. పులిపాటి గురుస్వామి గారి కవితలోని భాగాలూ, కె. క్యూబ్ వర్మ గారి కవిత నిస్సందేహంగా మంచివే. అలాగే, వంశీధర్ ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేస్తున్న “కథానిక కవిత” కూడా అద్భుతంగా ఉంది. మీ లాంటి వారి మెచ్చుకోలు, యువకవులకి మంచి ఉత్సాహాన్నీ ప్రోత్సాహాన్నీ ఇస్తాయనడంలో సందేహం లేదు.
మూర్తి గారు, మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు ఎప్పుడేం రాసినా నన్ను చాలా సేపు ఆలోచనల్లోకి తీసుకు వెళ్తారు. అందుకని,మీరు రాసే వ్యాఖ్యలు కేవలం సంతోషం తో పాటు మెదడుకి వ్యాయామం కూడా! భాష తేలికతనం గురించి నేను మాట్లాడాల్సింది ఇంకా చాలా వుంది. నాకెందుకో, శ్రీశ్రీ మహాప్రస్థానం కంటే ‘గదిలో..చీకటిలో’ బాగా నచ్చుతుంది. తిలక్ మిగతా కవితల కంటే ‘ఆర్తగీతం’ పోస్ట్మాన్ బాగా నచ్చుతాయి. ఆ కవితల్లో వాళ్ళిద్దరూ గొప్ప శిఖరాలు అందుకున్నారని నేను అనుకుంటా. అది కేవలం భాషకి సంబంధించిన సరళత్వమ్ కాదు. భాష లోతుల్ని ముట్టి రావడం! లోతుకు వెళ్ళే కొద్దీ భాష తేలికవుతుంది. వాల్ట్ విత్మన్ అన్నాడు కదా, simplicity is real complex- అని! ముందు ముందు ఈ తేలిక భాషా/భావన ల గురించి ఇంకా చెప్పాలని వుంది.
ఇక నిశ్శబ్దం ధ్వని అనే భావనల మధ్య మీరు చూపిన సామరస్యం నాకు నచ్చింది. అసలు ఆ విషయం మీద మీరు వివరంగా వ్యాసమే రాసినా బాగుంటుంది. ఈ మధ్య నేను reader response theory మరీ ఎక్కువ చదువుతున్నా. చదివే కొద్దీ నాకు ఉస్మానియాలో వున్నప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి సంస్కృత సాహిత్య సిద్ధాంత పాఠాలు గుర్తొస్తున్నాయి. ఈ పాశ్చాత్య సిద్ధాంతాలు అర్థం చేసుకోడానికి నాకు అవెంత ఉపయోగపడ్తున్నాయో చూస్తూంటే ఆశ్చర్యంగా వుంది.
Dear Afsar
nice analytical presentation
థాంక్ యు, రా …సత్యా!
ఇసుక మీద సముద్రం.. సూపర్.. కవిత్వం పురిటినొప్పుల గురించి బాగా రాసావు. ఇన్ని పురిటి నొప్పులు పడలేననే అంతర్ముఖంగా రాసుకుంటున్నాను. – శక్తి
Saahitii vanamloo
koluvu cheesthuu
sahtyapu lootulni
kolicheestunna
Afsarasudiki
Abhinandanalu.
లోతులని తడిమే విశ్లేషణ. లోతుని చూపించే విశ్లేషణ. రోజూ కనిపిస్తున్న ముగ్గురినే కొత్తగా చూపుతున్న సంశ్లేషణ. బావుంది అప్సర్ గారూ…
afsar sir..! mee visleshana adhbutham..! elantivi chadivinappudu rasevariki spoorthi thappakunda vasthundhi. entho opikagaa meeru chesina vishleshanaku salam..! meenundi elaantivi marenno vishleshanalu raavaalani aakanshisthunnanu..! guruswamy kavithvam baguntundhi. alage varmagaridhi vamsigaridhi rendu bagunnayi. mee vishleshanatho chadivithee marintha anubhuthi kaligindhi. vamsi gari kavitha kanneru theppinchindhi.. marosari meeku vandhanaalu.. santhisri
అఫ్సర్ గారు ఒక మంచిప్రయత్నం చేస్తున్నారు …కవిత్వం చాలామంది రాస్తారు …అదిమాత్రమే కవిత్వాన్ని బతికించదు …మీలాంటి అపార అనుభవం …విమర్శకు పూనుకొంటే ..విశ్లేషిస్తే తప్ప కవిత్వం కొత్తదారులు తొక్కలేదు ..అందుకనే మీరుచేస్తున్న మంచిప్రయత్నానికి స్వాగతం సుస్వాగతం …ఎందరిలోనో కవిత్వం పట్ల ఆశక్తిని అనురక్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను
అఫ్సర్ గారికి నమస్కారం. ఉదాహరణలతో లెక్క చేస్తే గుర్తుండిపోతుంది. అలా కవిత్వ పాఠకులకు Sketching, spontaneity అనే రెండు లక్షణాల గురించి సులభంగా, అర్థమయ్యేలా విశ్లేషించారు.గురుస్వామి,వర్మ,వంశీ గార్ల కవిత్వం మరింత శ్రద్దగా చదవాలన్న ప్రేరణ ఇచ్చారు. ధన్యవాదాలు.
అఫ్సర్ అన్న మీ ప్రసంశలు కొత్తతరం కవులకు గొప్ప ఉత్సాహాన్ని ,ప్రోత్సాహాన్ని ఇస్తాయి.ధన్యవాదములు
అఫ్సర్ గారు,
అద్భుతంగా వివరించారు. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో భాషా బంధనంలో ఇరుక్కు పోయి, కృత్రిమంగా కవిత్వ శిల్పాన్ని చెక్కడం కన్నా , మనసులోని భావాల్ని సహజంగా తేలికైన వాడుక భాషలో మనసుకు హత్తుకునేలా చెప్పడంలో భారం తగ్గి, భావం దగ్గరవుతుంది!
అఫ్సర్ జీ మీ అక్షరాలెప్పుడూ అద్భుత పాఠాలు.
ఉదయం పాఠాలు వినిపించి సాయంత్రలు ఇలా అంతర్జాలంలో అక్షర పాఠాలు నేర్చుకోవడం చాలా తృప్తి ఇస్తుంది. nsmurty గారి విశ్లేషణ మరో విజ్ఞానసముదాయం.
Really very happy to be a part of this literary walk with great minds ఆలోచనల పలకా బలపాలు ఎప్పుడూ సిద్ధ్హంగానే వున్నాయి.. ఓనమాలు దిద్దడానికి.. మళ్ళీ మళ్ళీ
dearest afsar,
kavitvanni asvadinchadaniki ee vislehana chala dohadapadutundi.. raase vaallaku manchioopu
మిత్రులు అప్సర్ గారు చక్కని కవితా విశ్లేషణతో నన్ను మరల మా విశాఖ సముద్ర తిన్నెలపై విహారము చేయించారు. చాలా బాగుంది ! అది సముద్ర ఘోష అని తలచే వారికి అందులో నిగూఢమైన భాషను విన్నాణులు గాబట్టి విశదీకరించ గలిగారు. అభినందనలు !
అఫ్సర్ గారు ఒక మంచిప్రయత్నం చేస్తున్నారు …కవిత్వం చాలామంది రాస్తారు …అదిమాత్రమే కవిత్వాన్ని బతికించదు …మీలాంటి అపార అనుభవం …విమర్శకు పూనుకొంటే ..విశ్లేషిస్తే తప్ప కవిత్వం కొత్తదారులు తొక్కలేదు ..అందుకనే మీరుచేస్తున్న మంచిప్రయత్నానికి స్వాగతం సుస్వాగతం …ఎందరిలోనో కవిత్వం పట్ల ఆశక్తిని అనురక్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను..
UR’S.. KHIZAR.
SEHABAASHH….
IT’S A GOOD PLOT FORM TO THE WRITERS WHO ARE THE VICTIMS OF TODAY’S MAGAZINES ..
THE TEAM WITH U IS ALSO GOOD GOOD .. KEEP IT UP FOR EVER.
లోతైన విశ్లేషణ, అఫ్సర్ గారూ!… అలాగని లోతులన్నీ మీరే చూపించకుండా రసజ్ఞులకు ఉత్సుకత కలిగించేలా విశ్లేషణా సామగ్రిని అందించి వదిలేసారు. ఎన్.ఎస్. మూర్తి గారి వ్యాఖ్య కూడా విజ్ఞానదాయకంగా ఉంది!
ఇసుక మీద సముద్రం.. సూపర్.. కవిత్వం పురిటినొప్పుల గురించి బాగా రాసావు. ఇన్ని పురిటి నొప్పులు పడలేననే అంతర్ముఖంగా రాసుకుంటున్నాను. బుద్ధుడు నన్ను మళ్ళీ బైటకు లాగుతున్నాడు.
తెలుగు కవిత్వంలో చాలాకాలంనుండి ఇలా కవుల కవిత్వాన్ని విశ్లేషించేపని జరగడంలేదు.ఎనభైల్లో చేరా,ఆ తర్వాత కొన్నాళ్ళు లక్ష్మేనరసయ్య ఇటువంటి పనినే చేసారు.అడపాదడపా అపుడపుడు కొంత జరిగినా ప్రామిసింగ్ కవిత్వాన్ని,కవులను విశ్లేషించేపని మాత్రం ఉంది.సౌబాగ్య కొంతమంది కవులగురించి పుస్తకాలుగా రాసి ప్రచురించారు.అఫ్సర్ ఇప్పుడు ఇలారాయడం బాగుంది.రాసిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంది.తెలుగుకవిత్వంలోకి దూసుకొస్తున్న కొత్తతరం కవులను ,వారి కవిత్వాన్ని గురించి రాయడంద్వారా ఒక నూతనోత్తేజాన్ని కవిత్వంలో నింపే అవకాశం ఉంది.అఫ్సర్ ఈ పని మధ్యలో నిలిపెయకుండా కొనసాగించాలి.
గురుస్వామి,కేక్యూబ్ వర్మ ఇప్పటికే కవులుగా ప్రూవ్ చేసుకున్న గుర్తింపున్నకవులు.వంశీధర్ రెడ్డి తనదైన ఒక కొత్త డిక్షన్ తో ,ఊహతో,కొత్త నిర్మాణ వ్యూహాలతో కవిత్వం రాస్తున్న కవి.ఈ ముగ్గురితో మొదలుపెట్టడం బాగుంది.జయహో!
అప్పుడెప్పుడో టి ఎల్ కాంతారావు గారు ఇలా కవుల కవిత్వాలని విశ్లెషిస్తూ రాశారు .మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు ఆ ప్రయత్నం చెస్తున్నారు .కు కవులు ..అ కవులు ..పొఇ మంచికవులు మీద్వారా పది మందికి పరిచయం కావాలని ఆకాక్షిస్తూ
Congratulationsqkeep up the good work
ఒక ముగ్గురు కవులను ప్రోత్సహిస్తు,.వారికి మరంతగా ఉత్తేజాన్ని,.ఇవ్వడానికి మీరు చేస్తున్నమంచి ప్రయత్నం అభినందనీయం,.అడగకుండానే కవిత్వం ఉప్పెనై ముంచెత్తే కొన్ని సమయాలుంటాయ్,.ఎంత ప్రాధేయపడినా ఒక్క అక్షరమైనా కనికరించని కాలాలూ వుంటాయ్,.మొదటన,మధ్యన,చివరన ఎప్పుడు ఎక్కువగా రాస్తాము అనేది,అనేక అంశాలపైన ఆధారపడి వుంటుందేమో,..నేను చాలా ఆసక్తి గా చదివే కవులు ఈ ముగ్గురూ,.. ఎలాంటి ఇబ్బంది పడకుండా తన భావాన్ని స్వచ్చంగా పరచడంలో పులిపాటి గురుస్వామి గారు నాకు నచ్చుతారు,..తన ఫీలింగ్ ను కొత్తగా చెప్పే ప్రయత్నంలో నిరంతరం సాధనలో మునిగి వుంటారేమో అనిపిస్తుంది వర్మగారి కవిత్వం చదువుతున్నప్పుడు,.ఇక వంశీ కవిత్వాన్ని చూస్తున్నప్పుడు,ఇంత డిఫెరెంట్ గా ఎలా ఆలోచిస్తాడో అని అప్పడుప్పుడు కుళ్లుకుంటూనే వుంటాను,.స్కెచింగ్, స్పాంటేనియిటి అనేవి కవిత్వ బాషలో ఏమిటో నాకు తెలియదు కాని,….అవి లేకుండా ఒక మంచి కవిత రాయడం మాత్రం అసాధ్యమేమో,..లీలగా ఓ భావాన్ని స్పృశించుకుంటూ,అసంకల్పితంగా అక్షరాలు జాలువారిపోతున్నప్పుడు, పుట్టుకొచ్చేదే కదా అసలైన కవిత్వం,. మూర్తి గారు చెప్పినట్లు శ్రీశ్రీ ,తిలక్,బైరాగి లాంటి వారు ఛంధోబద్దంగా పద్యాలు రాసి, ఆధునిక కవితవైపు తిరిగినవారు కాబట్టి వారికి పదాలమీద పట్టు సాధారణంగా ఎక్కువగానే వుంటుంది,.ఇప్పుడు కవులు భాష కంటే సరళంగా భావాన్ని ప్రదర్శించడం మీద దృష్టి పెట్టడం సహజమే,..భాష మీద సాధికారతవుంటే అది కవికి ఇంకా ఉపయోగంగా వుంటుంది,.కవిత్వంలో శబ్ధం,నిశ్శబ్ధం గురించి వివరించి వుంటే బావుడేదనిపించింది,.మీరు గీసిన స్కెచ్ కవులకా, కవిత్వానికా, ఆ లక్షణాలకా అనేది స్పష్టంగాలేదేమో అనిపించింది,..వారికి కొన్నిసూచనలను ఇస్తే అది కవులకు మేలు చేస్తుందేమో,.ఉదాహరణకు వర్మ గారి కవిత్వంలో తనం అనేది ఎక్కువగా జోడించబడుతుంది, వంశీ గారు అస్పష్టతను, కష్టమైన పదాలను కవితలో చోప్పించడాన్ని ఇష్టపడతారు,.,.ఇలాంటివేమైనా,మీ దృష్టికి వచ్చినవి..
అభిమానించే వ్యక్తిని సమీక్షించడం కొంచం కష్టమైన పనే,.వంశీ విషయంలో అది కనిపిస్తునే వుందనిపించిది,..నాకు తోచిన విషయాలను ప్రస్తవించాను సార్,.నా అజ్ఞానం కనిపిస్తే క్షమించండి,.మీ ఆనవాలు ఉజ్యలమై వెలగాలని ఆశిస్తూ,…
అన్నా అఫ్సర్ …
కవిత్వాన్ని తూర్పాల పట్టి తాలు గింజలు ఏరి చూపినవ్ . సరియైన గుడ్డ తో వస్త్రగాలం పట్టి అక్షరాల మెత్తదనాన్నిపట్టుకున్నావ్ .గొప్ప విశ్లేషన .కవిత్వపు బాయి లోతులకు పోయి అడుగునున్న మొరం ను అరచేతుల పట్టి చూపిచ్చిన వ్యాసం .అన్న ఈ పని ఇట్లానే నడువనీ ……..
అఫ్సర్ సార్!
ఏదో ఒక అతీత శక్తి అఫ్సర్ సార్ గారి వాఖ్యాల వెంబడి నడిపించింది. గందరగోళం లేని ప్రోజ్! ఒకటే నిర్ణయించుకున్నారనిపించింది. ఒక యువ (క్రొత్త) రచయిత తన కవితా వొరవడిని ఏ పట్టాల పైన నడిపించాలో ఒక చిన్న సైజు దృశ్యపాఠాన్ని చూపించారు. స్కెచింగ, స్పాంటేనిటి…వావ్! ఇవి కాక ఇంకేమైనా ఇతర ‘జీవం’ కవితారచనకు ఉందేమో చూడండి. చిన్నగా చేయి పట్టి నడిపించిన తీరు గమనిస్తే, ఒక మంచి లెక్చరర్ (ఎదురుగా లేకున్నా) తన వాఖ్యాల్లో దృశ్యాలను జోడించారు.
ఆయిన ఇంకొ ప్రయోగం కూడా చేశారు. ఒక పరిణితి పొందిన రచయితల కు ఇంకా ఉత్తేజాన్ని నింపే పని పెట్టుకున్నారు. ఏదో రాసుకున్నాం! కొన్ని కవితలయ్యాక సంకలనం వేసుకున్నాం! ఒక లిమిటెడ్ ప్రపంచంలో కవులు ఒకరినొకరు పొగడుకొవడం….ఇంకా కొందరు కొద్దిసేపు విమర్శించుకోవడం వంటి స్థితి లో కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో నిజంగా అఫ్సర్ సార్ గారు కవులను ప్రొత్సహించే ఒక యజ్ఞాన్నిమొదలుపెట్టారు. ప్రొత్సహించడమంటే ఏదో నాలుగు ముక్కలు ఆ కవిత లోనివి తీసుకొని అవి బాగున్నాయి అని చెప్పడం చేయలేదు. లోతైన విశ్లేషణ కు నడుం బిగించారు. కవిత రాసిన కవి కి కూడా, ఆ కవితలు ఎలా ఆ కవి లో అంకురించి ఉంటాయో? రాసిన కవి అంతరార్థం ఏమిటో? వగైరా అంశాలను ‘లేబిల్’ వేసారు. కమర్షియల్ మాటల్లొ చెప్పాలంటే కవితలకు ” బ్రాండింగ్” ఇచ్చేశారు.
ఇది అవసరం. కవిత జన్మ సార్థకత మయ్యే “మిషిన్” ను ఏర్పాటు చేశారు. పులిపాటి గారు, వర్మగారు, వంశీధర్ గారు అఫ్సర్ గారి విశ్లేషణ పై ఎలాంటి మానసికస్థితికి చేరుకొని ఆనందించింటారో కొలతలు వేయలేను కానీ, చదువుతున్న నాకేమో ఒక్కసారైనా అఫ్సర్ గారి విశ్లేషణ నా కవిత కు చేస్తే బావుంటుందని నా మటుకు నేను ఫీల్ అయ్యాను. ( నో హిపోక్రసి) …
అఫ్సర్ సార్ గారి ఈ వ్యాసం…రచయితలకు ఒక ఊతకర్ర. క్రొత్త తరం కవులకు ‘మగ్నాకార్ట’ . ఒక మార్గదర్శకం. ఒక పయొనిర్. ఒక చద్దిమూట. రచయితలను చేయిపట్టి నడిపించే ఒక “అఫ్సర్ ఆపన్న హస్తం”…………………..మీ సురేష్!
మిత్రమా అఫ్సర్, చాలా సంతోషం,
పని ఒత్తిడి వల్ల వెంటనే స్పందించలేకపోయాను. అవును వాకిలి వాళ్ళు పంపుతున్న సందేశాలు చూస్తూనే ఉన్నాను. దీనికి ఏదన్నా రాసేంత సమయం చిక్కడం లేదు.ఇలాగైనా రాస్తున్నాను.
పైన నీవ్యాసంలోని కొత్త దనం తెలుగు కవిత్వపు చదువరులకు అందవలసిందే. ముఖ్యంగా కవులకు.
విశ్వవిఖ్యాత ఎ.కె. రామానుజన్ గారు 1992లో ఆయన మనకు లేకుండా పోవడానికి కొద్ది రోజుల ముందే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అప్పటి మా డిపార్ట् మెంట్ లో ఒక నెల రోజులు కన్సల్టింగ్ ప్రొఫెసర్ (విజిటింగ్ కాదు) ఉన్నారు. దాదాపు ఆ నెల రోజులు మాకు జానపద విజ్ఞానంలోనే కాదు. చాలా ఇతర విషయాలలో చాలా విషయాలు చెప్పారు. అందులో ఒకటి తెలుగు (ఇతర భారతీయ భాషల) కవులు సోమరిపోతులు అని అన్నాడు. దానికి వివరణ కూడా ఇచ్చాడు. ఏమంటే కవిత రాసి తర్వాత దాన్ని చూచుకోరు. ఒకటికి నాలుగు సార్లు పారజూచి దాన్ని ఎడిట్ చేసుకునే అలవాటు దాన్ని తీర్చుకుని దిద్దుకునే అలవాటు లేదన్నాడు. అంతే కాదు ఏదో ఒక భవ్యకవితావేశంలో ఈ కవిత వచ్చింది. దీన్ని మార్చకూడదు అని అనుకుంటారని ఇంకొకరు మార్చమని సలహా ఇస్తే ఏ మాత్రం భరించలేరని రామానుజన్ అన్నారు. ఆయన మాటలు నాకు ఆనాడు చాలా బాగా నచ్చాయి. తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈనాడు మళ్ళీ నీ వ్యాసంలో ఈ భావనలు కనిపించాయి. కింద నీవు రాసిన పేరాలో కింది విషయాలు.
మామూలుగా ప్రతి కవీ తను రాసిన వాక్యాల్ని వొకటికి పది సార్లు చెక్కుకుంటాడు.
భావం పలికే దాకా వాక్యాల్ని తిరగరాస్తాడు. అలాంటి దశలో అతను
కాసేపు కవి అనే స్థానం నించి పక్కకి తొలగి, పాఠకుడై, తనని తాని చదువుకుంటాడు.
తన వాక్యాలలో తన ప్రతిబింబాన్ని తరచి చూసుకుంటాడు.
తన భావనల ప్రభావాన్ని పరీక్షించి చూసుకుంటాడు.
ఇంకా ముందుకు వెళ్ళి తానే ఎడిటర్ అయి, వాటికి post-mortem చేసుకుంటాడు.
మంచి కవిత తయారవడానికి ఇవన్నీ అవసరమే! కానీ, కొన్ని వేళల్లో జీవితం అనుకూలించదు.
కవిత్వ రూపం విసుగు పుట్టిస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాడు కవి?
తన పదాల్ని కూడదీసుకుంటాడు. తన భావాన్ని పరిమితమయిన/ తేలికపాటి రేఖల్లో వెతుక్కుంటాడు.
నువ్వు చెప్పిన ఈ విషయాల్ని తెలుగు కవులు తెలుసుకుంటే మంచిది. ఈ అలవాటు మన వారికి లేదు. తెలుగు కవులు వెనక్కు తిరిగి చుూచుకొని పదాల ఎంపికలను గురించి భావానికి భాషకు కుదిరిన జోడీ గురించి ఆలోచించే వారు లేరని నాకు అనిపిస్తూ ఉంది. ఇటీవల కొందరు కొత్త కవులు ఈ పని చేస్తున్నారు. కిరీటాలు పెట్టుకున్న కవులు తాము కిరీటాలకు దగ్గర అవుతున్నామనుకుంటున్న కవులు ఈ పని చేయడం లేదు. కొత్త కవులను ఈ రకంగా మనం ప్రోత్సహించడం చాలా అవసరంగా ఉంది. తెలుగులో చాలా సీనియర్ కవులు అనుకునే వారి ఇటీవలి కవితలు చుూస్తుంటే ఇక వారు రాయడం మానేస్తే మంచిది అని అనిపిస్తూ ఉంది. నీ వ్యాసంలో బాగున్న ఇంకొక విషయం ఏమంటే బరువైన భావానికి బరువైన భాష గురించి, ఇలాంటిదే ఒక పాయింటే దగ్గర నిరలంకారంగా కవిత్వాన్ని రాయడం గురించి ఒక సారి ెపేస్ బుక్ లో మన గుంపులో మాటల దెబ్బలాట జరిగింది గుర్తుందా.. భాష అనవసరపు గలగలలతో ఉంటే ఏడువారాల సొమ్ములే. ఇది గుర్తించాల్సిన విషయమే. ఏ కవితకు ఏ భాష వాడాలనే విషయం ఆయా కవుల పరిణతిని బట్టి రావాలిసిందే అంతే కాని పాటాలు చెప్పి నేర్పలేము. కుదరదుకూడా. ఏ పదాలతో ఎంత మంచి బొమ్మను పేర్చాడన్నదే చిత్రించాడన్నదే ముఖ్యవిషయం. ఈ రంగులతో వేయి అని ఈ రంగులుతో ఈ బొమ్మ వేస్తే బాగుంటుందని కాని చెప్పి బొమ్మవేయించలేము.
ఇక మరొక విషయం. నాకు నచ్చిన నా మంచి గురువులలో ఒకరు చేరా ఆయన దాదాపు పాతికసంవత్సరాల క్రితం అన్న మాట. ఏమంటే తెలుగు సాహిత్య విమర్శలో బాగా అరిగిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయిన పదం శిల్పం అనేది. దీన్ని వాడకుండా ఉంటే మంచిది అనీ గురువుగారు చేరా అన్నారు. తిరిగి ఈరోజు నువ్వు ఈ మాటను చాలా చోట్ల చాలా సార్లు చాలా వ్యాసాలలో రాస్తున్నావు. దీనికి మంచి ప్రత్యామ్నయాన్ని వాడదాం. ఏదా అని ఆలోచన చేద్దాం. మనం వ్యక్తీకరించే భావాలన్నింటిని ఈ పదం నిజంగా మోయలేక పోతూఉంది.
చాలా మంచి వ్యాసం రాశావు. తెలుగు కవులు చదవవలసిన వ్యాసం. రాస్తూ ఉండు. ఉంటాను
మిత్రుడు పులికొండ సుబ్బాచారి.
కవిత్వం….1992 లో తొలిసారి కలం పట్టినప్పుడు..కవిత్వమంటే “ఎదలో శూన్యాన్ని మధించడం” అనుకున్నా…ఏదో అల్లిబిల్లి అక్షరాలల్లుకుంటూ సాహిత్యంపై పాకుతున్న కవితా లతలా…కాలపు గాలికి …చిగిర్చిన మొలకనయ్యాను…చెదిరి రాలిపడ్డ చిరు పూవునూ అయాను…
“రగులుతోంది భారతం..రాకపోకల్లేని నీతినియమాలజూసి….”
“మౌనంలోకి పయనించా నిశ్సబ్దాన్నన్వేషిస్తూ…”
“మనసా నీవెక్కడ…నా మనసును చూపీయవూ…”
ఇలా ఎలా రాసినా కవిత్వమే అనేసుకున్నా…దాదాపు రెండు దశాబ్దాలా అంధకారంలో ఉన్న నాకు కవిత్వమంటే ఇలా ఉండాలీ అని నాకు తొలుత చెప్పకనే చెప్పిన దిగ్గజాలు అఫ్సర్ సర్ ఉటంకించిన కవిత్రయంలో ఇరువురున్నారు….వంశీ,కుమార్ వర్మాజీ…అటుపై పరిచయమైనవారే కవిసంగమం లోని సారస్వత పుతృలూ,వాగ్దేవీమణులూ…ఈ ఆర్టికల్ పై స్పందించే స్థాయి నాకుందో లేదో తెలియదు కానీ అఫ్సర్ సర్ అంటే రోల్ మాడల్ అనుకుని మరల (2012 లో) బలపం పట్టుకున్న ఏకైక పలక నా సాహిత్యం….శిలలాంటి భావాలను చిత్రిక పట్టి స్పందనలనే ఉలులతో కవితా శిల్పం చేస్తున్న అక్షర శిల్పుల వాకిల్లో అందరూ జక్కనలే….ఇటువంటి వ్యాసాల నడుమ ఎప్పటికైనా నావంటివారంతా సాహితీ శిల్పాలు సృజియించగలరనే ఆత్మ విశ్వాసం కలుగుతోంది…పరిచయమవసరంలేని పదాలను (పైన ఉదహరింపబడిన కవిత్రయం) సైతం ఇలా పరిచయించి కవిత్వ లోతులను ఆవిష్కరించిన అఫ్సర్ సర్ నమో నమః
“ఆనవాలు” – చాలా చక్కటి శీర్షిక, ప్రయత్నమూను.
అఫ్సర్జీ ఇతర కవుల్ని విశ్లేషణాపూర్వకంగా పరిచయించడం తెలుగు సాహిత్యానికీ మరీ ముఖ్యంగా అంతర్జాల పత్రికల్లో కవిత్వాన్ని వ్రాసేవారికీ, ప్రచురించేవారికీ దిక్సూచిగా పనిచేస్తుంది. ఇందులో సందేహం లేదు.
కవులు-విమర్శకుడు-పాఠకులు అనే కూడలికి “వాకిలి” వేదిక కావడం యాదృచ్ఛికమే గానీ కాకతాళీయం కాదు.
అఫ్సర్ గారికి, వారి ద్వారా ఆవిష్కృతులౌతున్న కవులకు, వాకిలి బృందానికి, పాఠకులకు అభినందనలతో…
–రఘు
అఫ్సర్ గారు కొత్త కవిత్వాన్ని గురించి మీరిచ్చిన sketch చాలా బాగుంది. మీరుకూడా ఒక కవి అయివుండడం కారణంగా spontaneity కనిపించింది.ఏ కవితకైనా ఈ sketching and spontaneity చాలా అవసరం అనుకుంటా. యిప్పటి కవులు enjoy చేస్తున్నంత భావ స్వాతంత్ర్యం , ఒక మాట లోనిగూడ్డంగా వుండే అర్ద్ధాలని వెలికి తీయాలనే తపన మునుపటి కవులలో కనిపించేది కాదు. దానికి చాలా కారణాలు. అలాగే ఒక భావాన్ని ప్రస్ఫుటంగా చెప్పేకన్నా కొన్ని చెప్పకండ reader imagination కె వదిలేస్తే ఎలా వుంటుంది అనేది ఎప్పుడూ ఆలోచించ లేదు. మాటల మద్ధ్యలో దొరికే అర్ద్ధమే నిజమైన అర్ధమని తెలుసుకున్నప్పుడు కవితలు చదవటం ఒక thrilling experience. What is left unsaid or laid hidden always teases a reader. అలానే spontaneity లో వుండే కొత్తదనం సహజత మరెక్కడా కనిపినచదు. గాలి గోపురం కవిత చాలా బావుంది. ఒక “చిన్న పొరపాటో తడబాతో” ఎన్ని విదా లుగా మనిషిని బాద్ధ పెట్టచ్చో అన్ని విదాలుగా కేక్యూబ్ వెర్మ గారు చెప్పారు. భావ చిత్రణ చాలా బావుంది. ఆ concrete images ఒక abstract thought ని మన కల్ల ముందర నిలబెట్టాయి. వచ్చే సంచిక కోసరం ఎదురు చూస్తాను.
కాళిదాసాదుల కవిత్వం, తెలుగులో ప్రబంధ కవిత్వం సొగసుల గురించి పెద్దలు, పండితులు రాసిన వ్యాఖ్యాన గ్రంథాలు చదువుకుని “ఇంత విషయం ఉందా!” అని అబ్బురపడేవాళ్లం. అటువంటి వ్యాఖ్యానాలు, అనువాదాలు అవసరం లేకుండానే తేలిగ్గా హృదయానికి హత్తుకుపోయే కవిత్వం వస్తోందిప్పుడు. అలాంటి మనసు కవిత్వానికి ఇంతటి మనోహరమైన పరిచయం!! ఒక క్రిటీక్ దృష్టిలోని సొగసు కవిత్వం మీదుగా పరావర్తనం చెందుతోంది. ఇంకా రానివ్వండి అఫ్సర్-జీ.
చాలా మంచి వ్యాసం అఫ్సర్ గారు. ఈ రోజుల్లో వస్తున్న తేలికపాటి కవిత్వం, పాఠకుడు కష్టపడకుండానే హృదయాన్ని స్పందింపజేసే పదజాలమే ఎక్కువమంది పాఠకులని కూర్చుకోవడానికైనా , వ్రాసిన కవితని వారి మనసులో చొప్పించడానికైనా కావలిసింది. ఈ ప్రక్రియని స్కెచ్చింగ్ తో పోల్చి చెప్పడం చాలా బావుంది.
Painting is silent poetry, and poetry is painting that speaks.
Afsar jee,
Your analysis of poetry is always authentic…informative and educating.
in this essay, ur stress on language… its simplicity and poetic usage is simply superb.
I wonder how u could write in such a lucid but vivid manner? It’s a result of a long cerebrated discipline, I think. I always welcome ur thoughts regarding the analysis of modern poetry.
afsar garoo idi chalaa manchi attempt kavulani visleshistoone variki soochy aprayangaa konni salhalanoo kooda istoo marinth avari kavitva sandratha penchukune avakasam kuda istunna rachana, kanee idi personal gaa maranantha varaku parvaledu objective analysis is very much necessary for any poet to know thy self and others whom he reads i think you are doing a good exercise …love j
గురూజీ నమస్తే…
రోజూ చదువుతున్న కవిత్వమేఅయినా..
ఇవాళ కొత్తగా కనిపించింది.నిజంగా..గురుస్వామి,వర్మ,వంశీ ..ఈ ముగ్గురి కవిత్వాన్ని ఇంత లోతుగా విశ్లేషించి పాఠకులకు
అందించిన మీకు ధన్యవాదాలు.. సాహిత్యంలో విమర్శ ప్రధాన భూమిక పోషిస్తుంది.విమర్శకుని చేతిలో పడితేనే.దానిపరిమళం మరింత గుభాళిస్తుంది.ఈవాస్తవాన్ని మీరు ఋజువుచేశారు..మొత్తానికి మీరు చేస్తున్న కృషి అమోఘం
కొత్తదనానికి మొహం చిట్లించుకొనే గుణం చాలామందిలో ఉంటుంది. Certificate లేకుండా ఒక కొత్త విషయం యొక్క గొప్పతనాన్ని గుర్తించే శక్తి చాలా తక్కువమందికి ఉంటుంది. ప్రశంసా పత్రాన్నిచ్చే శక్తి, స్వచ్ఛతా, పెద్దమనసు మనలో చాలా కొద్దిమందికే ఉంటుంది. ఎంతో నిర్మలమైన మనసు ఉన్న వారే కొత్తదనాన్నిఆస్వాదించి, ఆనందించి, ప్రేమించి, యోగ్యతని అప్రయత్నంగా లోకానికి ప్రకటించగలుగుతారు. ఇటువంటి ప్రకటనల మూలంగా ప్రజలు కొత్త కవుల గొప్పతనాన్ని గ్రహించి(దురదృష్ట వశాత్తూ ఎక్కువమంది తమంతట తాముగా దేనినీ గుర్తించలేరు), వారిని స్వీకరించగలుగుతారు. లేదంటే గుర్తింపు లభించని ప్రతిభావంతులైన కవులు కవిత్వం కోసం జీవితాన్ని వెచ్చించేందుకు అవసరమైన moral support దొరకక లౌకికత్వంలోకో లేదా ఏకాంతంలోకో నిష్క్రమిస్తారు. సాహిత్యంలో ఆ లోటు ఎవరూ పూడ్చలేనిది. మంచి కవుల్ని ప్రోత్సహించకుండా నాణ్యమైన కవిత్వం రావడం లేదని విమర్శించడం వల్ల సాహిత్యానికి ఏం మేలు జరుగుతుంది? ఒక గొప్ప కవిని సమాజం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కాని Spontaneous గా ఒక విషయంలోని గొప్పదనాన్ని గుర్తించే అంతరికశక్తి, గుర్తించినా అంగీకరించగల ఉన్నతత్వం, అంగీకరించగలిగినా ప్రకటించగల ధైర్యం కొద్దిమందికే ఉంటాయి. చాలా రోజులుగా వంశీధర్ యొక్క తీక్షణమైన శైలికి, అసాధారనమైన ప్రయోగశీలతకి, నాణ్యమైన వచన విలక్షణతకి, భావగంభీర్యతకి తగిన గుర్తింపు రాలేదనే అసంతృప్తితో నేను ఉన్నాను(అలాగే చాలా మంది ప్రతిభావంతులైన కొత్త కవులకి తగిన గౌరవం లభించడం లేదు). ఆ అసంతృప్తి మీ వ్యాసం చదివాక ఉపశమించింది. నేను ఎంతో గౌరవిస్తున్న ఈ ముగ్గురు ఆధునిక కవుల గురించి మీరు రాయడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే గతంలో కూడా ప్రతిభావంతులైన కొత్త కవుల్ని మీరు గౌరవించడం, ప్రోత్సహించడం గమనించాను. ఎదిగిన వ్యక్తి ఎప్పుడూ ప్రపంచానికి ఒక నిచ్చెనగా నిలవాలి. అది బాధ్యతగా కాకుండా ప్రేమగా చేయగలగాలి. మీ ప్రయత్నం నాకెంతో ఆనందాన్ని కలిగించిది. అలాగే మీ పట్ల గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసింది.
ఇక వ్యాసం విషయానికివస్తే పైన ఉదహరించిన కవులు ముగ్గురూ భాషాపరంగా అసాధారణమైన సామర్థ్యం ఉన్నవారే. వారు భాషాపరంగా ప్రకటించే సరళత్వం ఆధునిక శైలికి, శైలుల కాలానుగత పరిణామశీలతకి సంబందించినదేకాని, వారికి భాషమీద అధికారం లేకపోవడంకాదు. అంతటి సరళత్వంతోనూ వారు ప్రాచీన పదాల్ని సునాయాసంగా ఉపయోగించడం గమనించాను. పక్షులు పాడినట్లుగా సహజంగా, సునాయాసంగా కవిత్వం రాయాలంటే హృదయాన్ని అనుభవానికి వశం చేయాలి. నియమనిబంధనల్ని, జ్ఞానభారాన్ని విడిచిపెట్టాలి. తెలిసిందంతా విడిచిపెట్టాలి. అనుభూతి techinic ని ఎంచుకుంటుంది. దానిలో తగినంత గాఢత ఉన్నప్పుడు, తనంతట తానుగా జ్ఞాన శకలంగా నిలువగల బలం దానికి ఉన్నప్పుడూ లేదా అనంతమైన పరిపూర్ణతని క్షణమాత్రంగానైనా స్పర్శించగలిగినప్పుడూ అది తన స్వంత techinic ని సృజించుకోగలదు. అనుభూతిలో తగినంత గాఢత లోపించినప్పుడు intellect ఆ ఖాళీలను పూరించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి స్థితిలో కవిత్వం రాయకుండా ఉండడం మంచిదని నా ఉద్దేశ్యం. కవిత్వంలో మేధస్సు పాత్రని పెంచి సాహిత్యాన్ని పెద్ద కార్ఖానాగా మార్చారు ఎందరో కవులు. ఎండిపోయిన హృదయం నుండి అమృతాన్ని పిండాలని ప్రయత్నించి మేధస్సుకు పెద్దపీట వేసారు. ఆ విధంగా భావంతో కాకుండా పదవిన్యాసాలతో ఆనందించడం మొదలుపెట్టారు. నియమనిబంధనల్ని సృష్టించారు. ఆత్మ ఎప్పుడూ సరళంగానే పలుకుతుంది. అది పలికినప్పుడు ఎప్పుడూ ఒక కొత్త రీతిలో గానం చేస్తుంది. దానికి ఇన్నిన్ని ఉపకరణాలు అవసరంలేదు. గొప్ప కవిత్వాన్ని సృష్టించాలని ఆశపడేవారు సరళమైన జీవితాన్ని జీవించాలి. జీవితానికి, కవిత్వానికి దూరం పెరిగినప్పుడు హృదయంతోకాక, మనసుతో కవిత్వాన్ని రాయాల్సిన పరిస్థితి వస్తుంది. వట్టిపోయిన పొదుగు నుండి బలవంతంగా కవిత్వాన్ని పిండాలని ప్రయత్నించేకంటే జీవిత ప్రవాహాన్ని సహజంగా గమనిస్తూ జీవించడం మేలు. జీవితాన్ని అనుసరించిన వారి హృదయాన్ని కవిత్వం అప్రయత్నంగా కావలించుకొంటుంది. పద్మం వికసించే రోజు కోసం ఓర్పుగా వేచిఉండాలి. కవి ప్రతిదినం కవిత్వం రాయవలసిన అవసరం లేదు. ఆత్మని పలికించేవి జీవితం మొత్తం మీద ఒక డజను కవితలని రాసినా చాలు. రబియా ఎన్ని కవితలు రాసింది? జీవితంతో కాక సాహిత్యంతో మాత్రమే సంబందం పెట్టుకున్నవారు పదాల సాలె గూడులో చిక్కుకుంటారు. మరికొందరు యవ్వనకాలంలో సహజంగా ప్రజ్వలించిన జ్వాల ఆరిపోయాకా మిగిలిన పొగని నేర్పుగా ఉపయోగిస్తూ సహజ జ్వాల అన్నట్టుగా ఇతరుల్ని భ్రమింపజేయగలుగుతారు. ఎలా అంటే జీవితమంతా శ్రమించి ఒక శక్తివంతమైన techinic ని అభివృద్ది చేసుకుంటారు, తమ మేధస్సుతో, శ్రమతో. వారి అవగాహనాలేమిని, confusionని, అజ్ఞానాన్ని అందమైన పదాలను నేర్పుగా పేర్చి authentic భావనని కలిగించగలుగుతారు. దురదృష్టవశాత్తూ వారి కౌశలానికి మనమూ ఎన్నో సార్లు మోసపోతాము.
మీరు sketching అని పేర్కొన్నది నిజాయితీపరులకు మిగిలివున్న ఏకైక మార్గం. అది ఒకొక్కసారి ఓమాదిరి మంచి ఫలితాలని ఇస్తుంది. అయితే తగినంత అంతరిక శక్తి లోపించినప్పుడు, ఐహిక ప్రపంచంతో దీర్ఘకాలంగా interaction కొనసాగించినప్పుడూ బాహ్య చేతనలో ఏర్పడే disturbance లేదా జడత్వం కవి యొక్క ఈ అసహాయ స్థితికి కారణం అని భావిస్తున్నాను. ఇప్పుడే లోపలి చైతన్యాన్ని, బాహ్య చైతన్యం అడ్డుకుంటుంది. ఇటువంటి సమయంలో కవి రాయకుండా ఏకాంతంలోకి నిష్క్రమించడం మంచిదని నా భావన. తిరిగి pure passion సహజంగా సంభవించే వరకు వేచిఉండడం మేలు. గొప్ప కావ్యాలు రాయడం కోసం ఎంతో మంది యూరోపియన్ కవులు పల్లెప్రాంతాలలో నెలల తరబడి ఏకాంతంగా జీవించిన సంగతి మనకు తెలిసిందే. మనలోపలి కుతకుతని బలవంతపు మూసల్లోకి ఒంపకుండా యదాతధంగా, సహజంగా విడిచిపెట్టగాలితే, ఎరుకతో గమనించగలిగితే, ఒక సరియైన సమయానికి ఆ కుతకుతలోచే అమృతం పెల్లుబుకుతుంది. అందుకు artistc greed ని మనం విడిచిపెట్టాలి. కవి రాయడానికి సిద్ధపడ్డట్లే రాయకుండా జీవితాన్ని అనుసరించడానికి కూడా సిద్ధపడాలి.
కవిత్వాన్ని రాయడం కంటే, గొప్ప కళను సృజించడం కంటే సృజనాత్మకంగా జీవించడం ఎంతో కష్టమైనది. అలా జీవించగలిగినప్పుడు హృదయంలోని గానం ఎప్పుటికీ మూగబోదు.
శ్రీరామ్ గారు: ఎంతో వోపికగా చదవడమే కాకుండా, అంతే వోపికగా వ్యాఖ్య రాసినందుకు షుక్రియా. మీ వ్యాఖ్యలో రాబియా అనే పేరు ప్రస్తావించారు?అది నాకు కొత్త పేరు. ఆ కవి గురించి కొంచెం వివరించగలరా? మీరు ప్రత్యేకించి చిరు వ్యాసం రాసినా బాగుంటుంది.
అఫ్సర్ గారు..
Rābiʻa al-ʻAdawiyya al-Qaysiyya or Rābiʿah al-Baṣrī క్రీ.శ. 717–801 సం.ల మధ్య కాలంలో జీవించిన సూఫీ మార్మికురాలు. ఆమె కవిత్వాన్ని బహుశా మీరు చదివే ఉంటారు. నేను Sufism పట్ల ఆకర్షితంకావడానికి ఆమె కవిత్వంమే కారణం.
నేను Sufism పేరు కూడా వినని రోజులవి. చాలా ఏళ్ళ క్రితం భీమిలిలో చిక్కాల కృష్ణారావు గారి ఇంటికి ఒక ఆదివారం గడిపేందుకు వెళ్లాను. ఇంకా ఇతర అతిధులు కూడా వచ్చారు. ఆయన చలం గారితో కలిసి అరుణాచలంలో జీవించిన రోజులలో జరిగిన సరదా సంఘటనల గురించి ఉల్లాసంగా చెప్పుకుంటూ పోతున్నారు. అప్రయత్నంగా అక్కడ ఉన్న ఒక పత్రిక తెరిచాను. అందులో నాలుగు రబియా కవితలు ఉన్నాయి. చదవడం మొదలుపెట్టాను. కిటికీలోంచి ధారాళంగా సముద్రపుగాలి వీస్తోంది.
O my Lord, the stars glitter
and the eyes of men are closed.
Kings have locked their doors
and each lover is alone with his love.
Here, I am alone with you.
ఈ వాక్యాలు చదవగానే కొన్ని క్షణాలు కాలం ఆగిపోయింది. చిక్కాల కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు. అతిధులు వింటున్నారు. గాలి వీస్తోంది. కాని కాలాతీతమైనది నా హృదయాన్ని స్పర్శించింది. కొంతసేపటి తరువాత అ స్థితి నుండి బయటకు వచ్చాకా కృష్ణారావుగారిని అడిగాను, రబియా ఎవరని. ఆయన రబియా గురించి, Sufism గురించి చెప్పడం మొదలుపెట్టారు. కాని అప్పటికే Sufism నా హృదయంలో బలంగా స్థితమైవుంది. కేవలం దాని పేరు, నిర్వచనం తెలియదంతే. ఆ తరవాత Charles Upton Translate చేసిన Doorkeeper of the Heart: Versions of Rabia, Coleman Barks Sufism మీద రాసిన గ్రంథాలతో నా పరిశోధన మొదలయింది. తరువాత ఎన్నో వందల సూఫీ గ్రంథాలు సేకరించాను. ఒక్కమాటలో చెప్పమంటే Sufism అనేది సాయంకాలపు గాలిలా చల్లనిది, ప్రేమభరితమైనది అని చెబుతాను.
Awesome ‘sketch’, dear Afsar ji! చదూతున్నంత సేపూ మీ భాషనూ, శైలినీ బాగా ఎంజాయ్ చేశాను!
chadivithe chadivinatlundale…raasthe raasinatlundale..etla ante itlaa…