కవిత్వం

నన్నీ రాత్రి జన్మించ నివ్వండి

డిసెంబర్ 2014


జన్మించ నివ్వండి నన్నీరాత్రి
తుఫాను తీసుకొస్తున్నది నదిని ఇంటికి
కర్కటాలు కొట్టుకొస్తున్నవి మరిగే చారులోకి
గాలి ఊల వేస్తున్నది
చెట్టు బరువెక్కి వంగుతున్నది
వాన జల్లులో
నలనల్లని పరిపక్వత రాలుతున్నది
పిల్లల కేరింత జోరందు కుంటున్నది
పిల్ల కాలువ పొంగుతున్నది
వంటింట్లో
పొయ్యి చిటపట లాడుతున్నది
నా గడప నుండి సాగిపోయే నావలు
త్వరలో
దిగ్రేఖ మీద కనుమరుగవ నున్నవి.

 

మూలం : నైజీరియన్ కవి విలియం ఈకే (Iheanyi’s poem ‘Let me born this night’ )
అనువాదం : నాగరాజు రామస్వామి