నిన్ను పలకరించాలని ఆశగా వచ్చాను
ఇక్కడ నువ్వు లేవు
అలసిన దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల నలిగిన మనసు
ఒకొక్క మడత విప్పుతుంటే
గాజు గది ఒకటి పగులుతున్న చప్పుడు
పారుతున్న నేను తప్ప
నా దగ్గర లేపనమేమీ లేదు పూయడానికి
***
ప్రేమగా ఆ గాయాలను తడమనివ్వు
నీతో కలిసి వర్షించడం తప్ప ఏమిచేయగలను
హృదయాలను ఇచ్చి పుచ్చుకోవడానికి
వేదన కంటే మధురమైన హేతువేది
“వేదన కంటే మధురమైన హేతువేది?…ఔ ను -నిజమే ” బాధే సౌఖ్యమనుకో”మన్నాడు ఒక సినీ ‘కవి’…ఎంత చక్కని అర్ధం గల భావమది?నిత్యనూతనమైనదదేకదా!చాంద్ గారికి అభినందనలు!
Thanks Madam