కారా మాస్టారుగా చిరపరిచితులు కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథకి పెద్ద దిక్కు. శారీరకంగా అలసిపోతున్న వయసులో కూడా పుస్తకం చదవకుండా/ కథ గురించి ఆలోచించకుండా ఇప్పటికీ వొక్క రోజు గడవదు ఆయనకి- ‘వాకిలి’ ఫస్ట్ పర్సన్ శీర్షిక కోసం మేం అడిగే అయిదారు రోజువారీ ప్రశ్నలకు ఆయన సమాధానాలివి. కారామాస్టారు మాట్లాడ్డమే పొదుపుగా, ఎడిట్ చేసినట్టుగా మాట్లాడతారు. క్లుప్తంగా ఇవీ ఆయన మాటలు.
కారా మాస్టారు గారితో ఫోన్ లో అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు:
ఇప్పటి దినచర్య: కథానిలయంనుండి దూరంగా చోడవరంలో వుంటున్నాను. వయసు 89. అందుచేత వెనకటి ఓపిక లేదు. ఒక కన్ను ఒక చేయి పని చేయదు. అయినా చదువుతున్నాను. కథానిలయం పనుల వత్తిడి వలన చాలా పుస్తకాలను చదవాలనుకున్నవి చదవలేక పోయా. ఆ పని ఇప్పుడు చేస్తున్న. మహా భారతం పూర్తయింది.
ఇప్పటి చదువు: మహాభారతం చదువుతున్నా పత్రికలలో వచ్చిన కథలు రెగ్యులర్ గా చదువుతున్నాను. అభిమానులు, కథా రచయితలు పంపిన కథా సంపుటాలు చవుతున్నాను. ఈ మధ్య చదివిన వాటిలో కన్నెగంటి చంద్ర కథల సంపుటి “మూడో ముద్రణ” impress చేసింది.
(కాళీపట్నం రామారావు)
ఇప్పటి కాలక్షేపం: చదువొక్కటే నా కాలక్షేపం. అలాగే నా దగ్గరకు వచ్చిన కథా రచయితలు అమ్మిపెట్టమన్న సంపుటాలు నన్ను చూడ వచ్చిన అభిమానులకు ఇస్తూ వుండడం.
కథ గూర్చి ఇప్పుడేమనుకుంటున్నారు.: తెలుగు కథ చాలా అభివృద్ధి చెందింది. కథకుల సంఖ్య బాగా పెరిగింది. బాగా రాస్తున్నారు. సంతృప్తికరంగా వుంది.
ఇటీవల వచ్చిన వాటిలో నచ్చిన కథ: ఒక కథంటూ చెప్పలేను, జ్నాపకశక్తి వుండడం లేదు. రెండు మూడేళ్ళలో వచ్చినవి గుర్తులేవు. ఈ మధ్యవి చెప్పగలను హైదరాబాదునుండి దళితుల సమస్యలపై రాస్తున్నఆయనా దళితుడే అనుకుంటా సతీష్ చందర్ కథలు నచ్చుతున్నాయి. కథ 2011 లో ఆయన తప్పు కథ వుంది.
Varmaaji, goppa kavi goorchi meeru cheppina maatalu maaku tene mootalu.
తెలుగు కథకీ, కథా సాహిత్యానికి కారా మాష్టారు చేసిన కృషి సాటిలేనిది. అది ఒక “యజ్ఞం”. అంత దీక్షతో చేపట్టి ఒక కథానిలయాన్ని తెలుగు కథకి ఆనవాలుగా, ఆటపట్టుగా నిలబెట్టారు. ఇక మన బాధ్యత దాన్ని నిలబెట్టుకోవడంలో ఉంది. నిజాయితీకి, నిబధ్ధతకీ నిదర్శనం మాష్టారు. నవతరానికి యజ్ఞం కథ సృష్టించిన epoch తెలీదు.
Thank you Kumar Varma garu.. nice interview
కారా మాస్టర్ గారు , మేము ఫోర్త్ ఫోరం చదువుతున్నప్పుడు పౌర శిక్షణ మాస్టర్ గా వుండేవారు.
. అది సెయింట్ అంథోని స్కూల్ విశాఖ లో 1952 లో.అప్పుడు మాకు అంత్యాక్షరి కొరకు కొన్ని పద్యాలూ కన్థస్తము
చెఇంచెవారు . అంచేత మాకు చాల పద్యాలూ కన్తస్తం వచ్చాయి . ఇప్పడికి ఆ పద్యాలూ సరదాగా,హాయిగా చదువుకుంటూ మాస్టారిని
తలచుకుంటాము. ఇది ఒక అదృష్టముగా భావిస్తున్నాము. ఎల్లంకి అప్పారావు.
విశాఖ