కొంత హుషారు
కొంత కంగారు
కొత్త స్టేషన్లో ఎప్పుడాగినా
ఎంతోకొంత కలవరం
అమ్మడాన్నీ అమ్ముడుపోవడాన్నీ
ఆగిన ఆ కాసిన్ని క్షణాల్లోనే
ఎన్నో కొన్ని అప్పగింతల్నీ
తప్పదు, ముగించుకోవాలి,
లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా
నటిస్తూ
కళ్ళల్లో తేలే ఆశనిరాశల్నీ
కౌగిళ్ళలో నొక్కుకునే బాధల్నీ
అరుదుగా కొన్ని సంతోషాల్ని కూడా,
చూస్తూనే కదలాలి బండి, తప్పదు,
ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా
వదిలేస్తూ
చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
ఇవేవీ మిగలవు గుర్తుకి.
“చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
ఇవేవీ మిగలవు గుర్తుకి.”
బాగా చెప్పారు .
చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
కవిత బావుంది..
నీ కవిత ఏదైనా సరే చదువుతూ ఉండగానే కళ్ళెదురుగా ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది…. అక్షరాలు పూర్తవుతాయి గానీ ఆ చిత్రం మాత్రం ఎప్పటికీ అలా ఉండిపోతుంది!!
“వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
ఇవేవీ మిగలవు గుర్తుకి.”
చాలా బావుంది మానసా.
చాలా బావుంది
లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా నటిస్తూ …
తప్పదు, ముగించుకోవాలి, అప్పగింతల్నీ…
ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా వదిలేస్తూ …
హృదయాన్ని బరువెక్కిస్తూ …
ఎంచక్కగా వ్రాశారు …