సంద్రంలాంటి కాలంల
నేను, సంవత్సరాలు
చస్తూ పుడుతూ ఉన్నాం
రోజులను దులిపినప్పుడు
గుణించిన క్షణాలు
దుమ్ములో రాలిపోతున్నాయి
తరగని దూరాలకి
పెరుగుతున్న గీతల్ని
చెరుపుకొని పరిగెడుతున్నా
***
నిన్నగా మిగిలే ప్రతీ రోజులో
నన్ను కొంత కోల్పోకా తప్పదు
చిరిగిన జేబులో దాచిన ఆశలు
జారిపోతే ఎవరిని నిందించాలి
గతమే నిజం కనుక
గడవనిదే నేనీక్షణాన్ని నమ్మలేను
***
సంవత్సరాకి నాదొక విన్నపం
నువ్విలాగే ప్రవహిస్తూ ఉండు
నేను జీవించడానికి సరిపడే వేదన తోడుకుంటాను
నువ్వు మరలా వచ్చినపుడు
చచ్చిన దేహానికి క్రొత్త బట్టలు తీసుకురా
నీతోపాటుగా నేనూ ఆరిపోతూ
తిరిగి వెలగడమే నిత్యజీవం నాకు
“నిన్నగా మిగిలే ప్రతీ రోజులో
నన్ను కొంత కోల్పోకా తప్పదు”
“గతమే నిజం కనుక
గడవనిదే నేనీక్షణాన్ని నమ్మలేను”
కవిత Bagundhi…
గతమే నిజం కనుక
గడవనిదే నేనీక్షణాన్ని నమ్మలేను..ఎంత బాగా చెప్పారు .