సాదాసీదా క్షణమేదో
అసాధారణమవుతుంది
సాగేగాలి తీరు కూడా
సాఫీగా వుండదు
కుదురులేని యవ్వనమవుతుంది
వారం మొత్తం కష్టమంతా
శుక్రవారం సాయంత్రం
ఓబిర్యాని పొట్లంలానో
సినిమా కష్టాలుగానో
స్నేహితుల ఇంట
సన్నాయి నవ్వులగానో…
ఏదీ లేదంటే ,
సోఫాలో సహచరుని భుజం మీద
సోలిన సంగీతంలానో
తర్జుమా కాబడుతుంది
ఆసాయంత్రమెందుకో
ఎవరూ తమలోకి తాము
తొంగిచూసుకోరు
తప్పొప్పులు,లోటుపాట్లు,
తప్పటడుగులు గురించి
అస్సలు తెలుసుకోరు
అదో రెండు రోజుల భారీ విరామానికి
ముందొచ్చే పండగలాంటిది
బహుశా మెదడుని మభ్యపెట్టి
మనసుని మోహించే సమయంలాంటిది
చీకటికేదో బలముంది..ఆకర్షణుంది…
అది అకస్మాత్తుగా
ఆ సాయంత్రమే రెండింతలవుతుంది
చంద్రునిలోంచి ఊడిపడ్డకలలా
వెన్నెల రుచిచూపెడుతుంది !
ఎంత బాగా రాశారు తులసి గారూ! నిజమే, Fridays are not for introspection. Friday సాయంకాలం కాగానే గడియారంతో పందెం మొదలౌతుంది. ఆదివారం రాత్రిలోపు ఎన్ని క్షణాల్ని, ఎన్ని నిముషాల్ని, ఎన్ని గంటల్ని, ఎన్ని సరదాల్ని పిండుకోగలమా అని.
తులసి గారూ – ఇది దృశ్యానువాదమా?
రఘోత్తమ రావు గారు, మీరు ఆ మాట అన్నాక – నాకు నా కవిత దృశ్యానువాదం లా అనిపిస్తుంది. నిజానికి Friday నాకు అలానే పరిచయం and అదే impression / experience ఎప్పటి నుండో. అది ఇప్పటికి బయటకు తేలింది ఇలా అక్షరాల్లో!
సోమవారానికీ, ఆదివారానికీ తేడా తెలియని ఉద్యోగిగా మీ శుక్రవారపు ధ్యానస్థ (musing)ను కించిత్ అనుభవించగలిగాను అదీ శుక్రవారంపూటనే!
Good one. Enjoyed reading it.
శుక్కురోరం శ్రమణ గీతం!