కవిత్వం

రస భంగం

ఫిబ్రవరి 2015

నేను నీకు
ఏ మాటా ఇవ్వలేను.

వెచ్చని
ఈ గది
తలుపు తోసుకు
చల్ల గాలిని
వెంట తెచ్చావనో

కిటికీ దగ్గర
మాగన్ను
పావురాయి
నీ బూటు చప్పుడుకి
ఎగిరిపోయిందనో

తలలో
మెదిలే
తలపు
చేప

పదాల గేలానికి
చిక్కకుండా
తిరుగుతోందనో

ఈ కుర్చీలో
నే గంటనించీ
అక్షరాలు ఆవరించి
కూచున్నాననో

అందుకనో
మరెందుకనో.