రా
వచ్చేయ్
నిండు చందమామ తిరిగి
నెలవంకై యే దారిలో
పరిగెడుతోంది…
బోల్డన్ని తారకలు, కాసింత
చల్లగాలి పరుచుకొంటున్న యీ
రాత్రి
మనం కలుద్దాం
అత్యంత పురాతన వైన్
ఫ్రైడ్ గ్రీన్ టమేటో, రా సాల్ట్ డ్ చిల్లీస్
సిద్దంగా వుంచుతాను
గార్లిక్ బ్రెడ్ తీసుకురా…
నా కిష్టమైన నీ పసుపుపచ్చని
ఫ్యాబ్ ఇండియా
కుర్తా ధరించి
వో కొత్త పాటతో
రా
మన శ్వాసలకి
సరి కొత్త రిధమ్ ని
పరిచయం చేద్దాం
వొకరి మెడ చుట్టూ వొకరం చేతులేసి
వొకరి భుజాలపై మరొకరం తలనాన్చి
కాసేపు
మెడిటేషన్ చేసుకొందాం
జీవితం యెంత విస్తారమైనదో
అంత చిన్నది కూడా
యీ రోజు రేపటిలోకి
వొకే వేగంతో మారిపోతోంది
నిరంతరంగా…
పనిని వాయిదా వెయ్యలేని
మన నైజం
కలుసుకోవాలనే
తలంపు
థింగ్స్ టు డులో చిట్టచివరి
ప్రయారిటీ కాకుండుంటే
మరెన్నో దివారాత్రులు
లెక్కకు అందని
అరుదైన ఐశ్వర్యమై
మనోపుస్తకంలో యెన్నెన్నో
రసఝురి
కావ్యాలని లిఖించేవి
కేవలం sms లతో
సరిపెట్టుకొని
మురిసిపోకుండా
రా
యీ రాత్రి
తారకల పల్చని వెలుగు
శతకోటిరశ్మి కిరణాలుగా
పరావర్తనం
చెందకముందే
రా
వైన్ రంగుతో
సమ్మిళితమైన మన పెదవుల వర్ణంపై
గత కాలపు
గాయాలన్నిటినీ
యెరైజ్ చేసేసుకొందాం…
ప్రతి రాత్రి
చందమామని
వెలిగించుకొనే
సమయాలు
కావివి
మనం
కలిసినప్పుడు
విరబూసే
మనో చ్ఛాయా రంగులని
పంచేంద్రియాల క్లౌడ్ లో
దాచేసుకొందాం
అప్పుడప్పుడూ
చూసుకొందాం
యెప్పటికి
వుంటాయనే
భరోసాతో
తిరిగి
మనం
మన
పనుల స్కేటింగ్ లోకి
జారుకొందాం…
రా
వచ్చేయ్…
ఒక మంచి కవిత్వాన్ని చదివినప్పుడు ఆ కవియొక్క మనసు పడే అనందం చెప్పలేనిది.అటువంటి ఆనందం కలిగింది నాకు మీ ఈ కవిత చదివాక కుప్పిలి పద్మ గారు.భావాలన్నీ అలవోకగా నిమగ్నమయ్యాయి మీ అక్షర సరళిలో.చాల నచ్చింది ఈ కవిత కుప్పిలి పద్మ గారు.మనఃపూర్వక అభినందనలు.
Thank you Tilak gaaru.
“వైన్ రంగుతో
సమ్మిళితమైన మన పెదవుల వర్ణంపై
గత కాలపు
గాయాలన్నిటినీ
యెరైజ్ చేసేసుకొందాం…” రొమాంటిక్ పోయెమ్!
Thank You RamaKrishna garu.
లగ్జరీ పోయెం ! చాలా బాగుంది.
Thank You Thirupalu garu.
ప్రతి రాత్రి
చందమామని
వెలిగించుకొనే
సమయాలు
కావివి
నాకు నచ్చే సమయాలు
కెక్యూబ్ వర్మ గారు, Thank you.
ఒక మంచి కవిత చదివినప్పుడు మంచి రెస్పాన్స్ మౌనమె …. ప్రేమతో అక్క
మధ్యలో ఆంగ్ల పదాలు చక్కటి బాస్మతి బిర్యానీలో చైనా రానుంచి దిగుమతి అయ్యిన ప్లాస్టిక్ బియ్యంలా అడ్డుతగులుతున్నాయి. సంపాడుకులకు తమ వృత్తి నిర్వహణ మీద కుంచెం శ్రద్ధ పెట్టి ఉంటె తప్పకుండా ఇక్కడ భావం తెలుగుతనానికి దగ్గిరయ్యి సాహితీ ప్రియుల అభిమానానికి పాత్రమయ్యేది. పద్మ గారు తప్పు మీది కాదు. కానీ వీలయితేఆ మంచి తెలుగు రాయడానికి ప్రయత్నించండి.