కవిత్వం

మంచు చినుకు..

మార్చి 2015

పాయలుగా సాగే నది అలల మధ్య
తడి అంటని పాదాల పయనం

రాగ దీపాల మధ్య ద్వీపమేదో
వడగాలి తాకిడికి ఎగసి పడుతూ

కూలుతున్న స్వప్న సౌధాల ధూళిలో
తుంపరగా మంచు చినుకు బొమ్మ కడుతూ

మోహం లేని మోహనా మోహనా
నీ ముందు మోకరిల్లి జ్వలించే జ్వాలల మధ్య రాజుకుంటూ

ఈ వెన్నెలని దహించే కార్చిచ్చు
మేఘమేదో అల్లుకుంటూ రాలిపోనీ