మాట్లాడుకోవాలి మనం
సౌష్టవాల సంకీర్ణతలను
బద్దలైన అద్దాలపై కూర్చొని
అర్థాలు లేకపోయినా
అదేపనిగా మాట్లాడుకోవాలి మనం.
ఏదీ మొదలు కాని చోటకూడా
అప్పటికే కొన్ని పూర్తయ్యే వుంటాయని,
సమస్తం సర్వనాశనమయిన చోటకూడా
తలలెత్తే చివుర్లుంటాయని
తెలుసుకోవాలి మనం.
కప్పుకున్న కవి తోళ్లు విప్పుకొని,
దిగ్భ్రమ దేహ దుఃఖాన్ని ఆస్వాదించాకన్నా,
విషమ గందరగోళ
సాహీతీ నిషా గరళాలు
పూర్తిగా దిగిపోయాకన్నా
తేడా తెలుసుకోవాలి మనం
కవిగా ఎదగడానికి,
కవిత్వంగా మారడానికి మధ్య.
ఎప్పటిలాగానే
అతను చెబుతూనే వున్నాడు.
హ్మ్మ్ … మీ ఘోష అర్ధం చేసుకునే ప్రయత్నం చేసాను భాస్కర్ గారు
,. ఇంకా నయం, ఆత్మఘోష అనలేదు,…. ఏదో కుళ్లుమోతుతనంలా కనిపించనందుకు:) ,… ధన్యవాదాలు మెర్సీగారు.
బాగుంది భాస్కర్!
‘అర్థాలు లేకపోయినా
అదేపనిగా మాట్లాడుకోవాలి మనం.
ఏదీ మొదలు కాని చోటకూడా
అప్పటికే కొన్ని పూర్తయ్యే వుంటాయని’
కవిత మీకు నచ్చినందుకు ఆనందంగా వుంది సర్,. థాంక్యూ వెరీమచ్.
‘సమస్తం సర్వనాశనమయిన చోటకూడా
తలలెత్తే చివుర్లుంటాయని
తెలుసుకోవాలి మనం.’
- ఇలాటి ఆశే ఇక మిగిలింది.
‘కవిగా ఎదగడానికి,
కవిత్వంగా మారడానికి మధ్య…’
ఇది మాత్రం నిజాతి నిజం.
భాస్కర్ గారు, మీ ఆవేదన కొంతవరకు అర్ధమైంది నాకు.
అభినందనలతో..
- నిజమేనండి.
చాలా సార్లు నిజాలు నిజాలుగా కనిపించవ్,. మీరంత స్పష్టంగా ఓ నిజాన్ని అభినందించినందుకు,. నిజాయితీతో కూడిన ధన్యవాదాలు ఆర్.దమయంతి.
గారు.
రాయడానికి విషయం దొరకడం కవికి పెద్ద సమస్యేం కాకపోవచ్చును. కాని రాసే విధానం విలక్షణతను, కవితాత్మకతను కలిగినదై వుండాలి. మీరు చాలా సరళమైన భాషనే ఉపయోగిస్తూ ప్రత్యేకమైన తరహాలో బాగా రాస్తున్నారు. Traditional పద్ధతిని follow అవక, కొత్తగా, హృద్యంగా రాస్తున్న మీ వంటి కొత్తతరం కవులు నిజంగా అభినందనీయులు.
అందరు అర్దాలు వెతికి మాట్లాడుకోలేరు. మాట్లాడటం మొదలయ్యాకే అర్దాలు అపార్దాలు ఏమిటో తెలుస్తవి. మౌనం లో talethee చీయుర్ల్లు కవిత్వమే
నిజమే అన్నా ,అర్ధాలు లేకపోయినా అదే పనిగా మాట్లాడుకోవాలి మనం