నుడి

వాకిలి నవంబర్ నుడి విజేతలు

డిసెంబర్ 2015

పాఠకులకు నమస్కారం!

నవంబర్ నుడి విజేతలు:
1. తేజస్విని
2. రవిచంద్ర
3. కామేశ్వర రావు

విజేతలకు అభినందనలు!

వాకిలి నవంబర్ నుడి పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు!

ఎక్కువ మంది పాఠకులు తడబడిన ఆధారాలకు సమాధానాలను వివరిస్తున్నాను.

4 అడ్డం: కొంత మంది జరీమానా అని పూరించారు. సక్రమంగా మారిన అన్నాం కనుక, ‘మారిన’ను సక్రమం చేయగా వచ్చే ‘రిమాన’ ‘జ’ పక్కన చేరినప్పుడు ఏర్పడే ‘జరిమాన’ జవాబు అవుతుంది.

9 అడ్డం: పునుగులు, పుపుగులు, పురుగులు అని రకరకాలుగా నింపారు. ఆధారంలో పు అనే అక్షరాలు మూడు, గు అనే అక్షరాలు మూడు ఇవ్వబడినాయి. మొదటివి ‘పు’లు కాగా తర్వాతవి ‘గు’లు. పులు + గులు = పులుగులు = పక్షులు!

11 అడ్డం: అరవైలో సగం లేదు అన్నది క్లూ. ఒకరు ‘అ’ అనీ, మరొకరు ‘ము’ అనీ నింపారు. సగం = అర కనుక, అరవై – అర = వై. కాబట్టి జవాబు ‘వై’.

16 అడ్డం: కొంత మంది మానసికం అని నింపారు. ‘మాసిన’ తడబాటు = ‘మానసి’. కంటి ఆనవాలు లేని కంకటి = క (కంకటి – కంటి). మానసి + క = మానసిక = మనసుకు సంబంధించిన.

28 అడ్డం: వేడుకంటి, వేడుకుంటి, వేల్పు కంటి అని నింపారు కొందరు. బతిమాలి = వేడి.
చూసితిని = కంటి. ముక్కంటి, బేసి కంటి, చిచ్చర కంటి లాగానే శివునికి వేడికంటి
అనే పేరుంది. వేడి గల (మూడో) కన్ను ఉన్నవాడు అని అర్థం.
8 నిలువు: వామిడికి బదులు వాముడి అని నింపారు కొందరు. వాము + ఇడి = వామిడి.

17 నిలువు: కొందరు కంకాలం అని పూరించారు. గుడిసె = పాక. తారుమారు చేసిన గుడిసె = కపా.
సగం పొలం = లం. కపా + లం = కపాలం = పుర్రె!

22 నిలువు: కారుకం అన్నారు కొందరు. Car (వాహనం) + ముకం (వదనం) = కార్ముకం = ధనుస్సు

23 అడ్డం దగ్గర ఒక్కరు కూడా తడబడకపోవడం సంతోషాన్ని కలిగించింది.

పాఠకులకు నా వైపునుండి చెప్పదల్చుకున్నవి:
1. ఆధారాల చివర బ్రాకెట్లలో ఇవ్వబడిన అంకెల విభజనను మరీ సీరియస్ గా తీసుకోవద్దు. అన్ని సందర్భాల్లో కచ్చితంగా వర్తించేలాగా uniform అయిన రీతిలో ఇవ్వడం కష్టం.

2. ఒక సమాధానం దుష్ట సమాసం అని సందేహాన్ని వెలిబుచ్చారొకరు. ఈ పజిల్ లో భాషా సవ్యతకు మరీ ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వటం లేదు కాబట్టి, దుష్ట సమాసాలు సమాధానాలుగా ఉండవచ్చు.

3. Key solution ప్రకటింపబడక ముందే నన్ను ప్రశ్నలు అడిగితే వాటికి జవాబులిచ్చే క్రమంలో అనవసరంగా హింట్ ఇస్తున్నట్టున్నాను కనుక, ఇకముందు key solution వెలువడిన తర్వాతే జవాబులిస్తాను.

**** (*) ****