కవిత్వం

సెక్యూరిటీ చెక్

డిసెంబర్ 2015

నీ లేపుటాప్లు, సెల్ఫోన్లు
టాబ్లెట్లూ, వాలెట్లూ
ఇంటి తాళాలు, అహంకారం

ఒక్క క్షణమైనా
అన్నీ విడిచిపెట్టి

ఖాళీ చేతులు జాపుకుని
ఒక ద్వారపాలకుడి ఎదుట…

కొన్ని ద్వారాలు తెరుచుకోవాలంటే
ఎన్ని వదులుకోవాలో!