కావడిబద్దకు రెండు కల్లులొట్టీలు
భుజానికెత్తుకుని ఈడ్సుకుంట
బతుకు పోరుపయనం సురువైతదిమొగులును ముట్టిచ్చుకోవాలనే ఆశతో
కొమ్మలు లేని తాడిసెట్టు విర్రవీగుతది
మట్టలూపుతూ వేలెడంతలేవని ఎక్కిరిత్తది
గాలి ముచ్చట్లకు షెవులూపుతది
గాలి సవ్వడికి, సంగీతానికి
ఒళ్లంతా పులకరించి తందనాలు ఆడుతదిమోకుతో తాటిని కావలిచ్చుకుని
కాళ్లకు గుజిబంధమేసుకుని
కాల్జేతులు ఒడుపుగ పట్టి
సర్రసర్ర సగమెక్కినంక
గుజిపట్టుదప్పి మోకు మొరాయిచ్చిందంటే
పైపానాలీ పైనే..!
భుజానికెత్తుకుని ఈడ్సుకుంట
బతుకు పోరుపయనం సురువైతదిమొగులును ముట్టిచ్చుకోవాలనే ఆశతో
కొమ్మలు లేని తాడిసెట్టు విర్రవీగుతది
మట్టలూపుతూ వేలెడంతలేవని ఎక్కిరిత్తది
గాలి ముచ్చట్లకు షెవులూపుతది
గాలి సవ్వడికి, సంగీతానికి
ఒళ్లంతా పులకరించి తందనాలు ఆడుతదిమోకుతో తాటిని కావలిచ్చుకుని
కాళ్లకు గుజిబంధమేసుకుని
కాల్జేతులు ఒడుపుగ పట్టి
సర్రసర్ర సగమెక్కినంక
గుజిపట్టుదప్పి మోకు మొరాయిచ్చిందంటే
పైపానాలీ పైనే..!
ఒక్కసారి కళ్లు మూసుకుని
పెళ్లాం బిడ్డల దల్సుకుని
లేని ధైర్నం కూడబలుక్కుని
మొగులుకు, న్యాలకు నడ్మ ఊగిసలాడుతూ
పొట్ట కూటి కోసం కల్లులొట్టి నింపుతడు
కల్లు ఒడ్సుకుని
పానాలు అరచేత పట్టుకుని
ఈ పూటకు గండం గట్టెక్కిందనుకుంటడు
ఎంత ఒడుపుగ ఎక్కుతడో
అంతే ఇగురంగ దిగుతడు
కొత్తలు బొంతల పడంగనే
పోరగాండ్లకు ఇంత కూడు దొరికిందని సంబురపడుతడు
ఎంతైనా
బడుగుజీవుని బతుకుసిత్రమే!
గాల్లో.. ముట్టిచ్చిన దీపమే!!
గౌండ్లోల్ల కట్టం కండ్లగ్గట్టినట్టు సెప్పినవన్న