‘ ఇక్బాల్ చంద్ ’ రచనలు

మరో ఇంటికి…

29-మార్చి-2013


మరో ఇంటికి…

1.
గుబురు ఆకు కొమ్మల్లో నుంచి
ఎగిరి
దగ్డ వనానికి ప్రయాణం-

ఎంత వొదిలి వొచ్చినా
ఇంకా కొంత
తగిలే ఉంటూంది-

2.
సర్దుతున్నా కొద్ది
మరింత వెలితి-

3.
పాత ఇల్లు
కొత్త ఇల్లు ల మధ్య
చాలా వైరుధ్యం-
మరింత గందరగోళం-

గడప గడప కీ
గెంతే కొంటె పిల్లి లా
కాలం గడుస్తూ వుంది-

వెలిసి పోయిన
పాత రంగులు కనిపించ కుండా
ఇక్కడ మళ్ళీ కొత్త రంగులు
అద్దుకోవాలి-

4.
అలవాటయిన చెరువు నీంచిపూర్తిగా »

కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్

08-మార్చి-2013


కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్

ఇంటర్వ్యూ: మూలా సుబ్రహ్మణ్యం

నమ్మిన ఒక్కో విలువా కళ్ళెదుటే కూలిపోతుంటే ఆధునిక జీవితం అట్టడుగున నిరాకారంగా కనిపించే అస్తిత్వం ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ మనిషి వేదనని తెలుగు కవిత్వంలో మొదట పటుకున్నది బైరాగి. నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పదచిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే పద చిత్రాలతో సైతం ఆ వేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌. “లక్ష ఆకలి చావులకు మించి/ఒక్క ప్రేమ రహిత హృదయ హత్యోదంతం/అతి పెద్ద నీచ కావ్యం” అని ప్రకటించిన ఇక్బాల్…
పూర్తిగా »