‘ డా. ఉమా ఇయ్యుణ్ణి ’ రచనలు

అమెరికాలో అస్తిత్వం

అక్టోబర్ 2013


అమెరికాలో అస్తిత్వం

“మహతీ ” భర్త రఘు పెట్టిన గావు కేకకి మూడు నెలల బాబుని నిద్ర పుచ్చుతున్న మహతి హడిలిపోయింది. నిద్దట్లోనే కెవ్వుమన్నాడు పసికందు రాహుల్. ఒక్కసారి వాడిని గుండెలకి హత్తుకున్న మహతికి రఘు ఉగ్ర స్వరూపం చూడగానే ఊపిరి ఆగినట్లయింది.

“ఏమయిందండీ” సన్నని స్వరంతో అడిగింది.

“ఇంకా ఏమవ్వాలి? అసలు నీకు నేనంటే ఏమన్నా లెక్క ఉందా? ఈ మధ్య చూస్తున్నాను, కట్టుకున్న మొగుడికి తిండీ తిప్పలు ఉన్నాయా? వర్క్ కి వెళ్ళేటప్పుడు బట్టలు ఇస్త్రీ ఉన్నాయా, అని ఏమన్నా జ్ఞానం ఉందా నీకు?”

అతని కోపానికి కారణం తెలియక చేతిలోనున్న బాబుతో సహా మధ్య గదిలోకి వచ్చింది మహతి. అలాగ తనని చూడగానే ఇంకా…
పూర్తిగా »