‘ ఎన్ వేణుగోపాల్ ’ రచనలు

అత్యాచారం

అత్యాచారం

అత్యాచారానికి గురి కావడానికీ
ఎత్తయిన మెట్ల మీదినుంచి తోసేయబడడానికీ
తేడా ఏమీ లేదు,
కాకపోతే ఈ గాయాలు లోపల కూడ నెత్తురు స్రవిస్తాయి.
అత్యాచారానికి గురి కావడానికీ
ట్రక్కు గుద్దిపోవడానికీ తేడా ఏమీ లేదు
కాకపోతే ఆతర్వాత అది బాగుండిందా అని మగవాళ్లు వెటకరిస్తారు
అత్యాచారానికి గురి కావడానికీ
కట్లపాము కాటుకూ తేడా ఏమీ లేదు
కాకపోతే నువు కురచ గౌను తొడుక్కుని ఉన్నావా అనీ
అసలు బైట ఒక్కదానివే ఎందుకున్నావనీ జనం అడుగుతారు.

అత్యాచారానికి గురి కావడానికీ
ప్రమాదంలో కారు అద్దం పగిలి బైటికి విసిరేయబడడానికీ
ఏమీ…
పూర్తిగా »

విషాద బీభత్స వర్తమానంలో తాత్విక సత్యాల సౌందర్యం

ఫిబ్రవరి 2013


విషాద బీభత్స వర్తమానంలో తాత్విక సత్యాల సౌందర్యం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల్లో ఏ ఒక్కటి చదివినా నిస్సందేహంగా ఒక ప్రగాఢమైన అనుభవం కలుగుతుంది. ఆ కథ చదవక ముందరి మనఃస్థితికీ చదివిన తరవాత మనఃస్థితికీ తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆ కథలు కాలక్షేపానికీ ఉబుసుపోకకీ అలవోకగా చదివేవి కావు. అవి వెంటాడే కథలు. మెల్లమెల్లగా ఆలోచనల్లో బలపడే కథలు. ఆ కథల్లో మామూలు జీవితమే ఉండవచ్చు, మనకు బాగా తెలిసిన పాత్రలూ, హావభావాలూ, వ్యక్తీకరణలూ ఉండవచ్చు. మనకు తెలిసిన కష్టాలూ క్లేశాలూ మాత్రమే ఉండవచ్చు. బహుశా మనం పక్కకు పెట్టదలచుకున్న నిరాశామయ పరిస్థితి మరింత నగ్నంగా, భయానకంగా కూడ ఉండవచ్చు. ఆ కథల్లో గొప్ప శైలీ శిల్ప విన్యాసాలు లేకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే…
పూర్తిగా »

చేరన్ కవితలు కొన్ని: అమ్మా, విలపించకు

అమ్మా విలపించకు

నిను ఓదార్చడానికి

పర్వతాలు సరిపోవు

నీ కన్నీళ్లు నింపుకునే

నదులు లేవు

 

నీ భర్త తన భుజం మీదినుంచి

శిశువును నీకందించిన క్షణాన

తుపాకి పేలింది

 

నేలరాలిన నీ తాళిబొట్టు మీద

నెత్తురు చిందింది

 

విస్ఫోటనమైన బాంబు వేడికి

నీ అందమైన కలలన్నీ వాడిపోయాయి

 

నీ మంజీరాలనుంచి జారిపడినవి

ముత్యాలూ కాదు

కెంపులూ కావు

నెత్తుటి నేరాన్ని గుర్తించే

పాండ్య రాజు ఇంకెంత మాత్రమూ లేడు

 

నిద్రలేని రాత్రులలో

నీ బంగారుకొండ అసహనంగా కదలాడి

’అప్పా’ అని గొంతెత్తి ఏడ్చినప్పుడు

ఏం చెపుతావు?

చిన్నారికి చందమామను చూపుతూ

అడుగడుగూ వేస్తున్నప్పుడు

రొమ్ముకు ఆనించుకుని ఊరుకోబెడుతున్నపుడు

’అప్పా…
పూర్తిగా »